స్టార్ హీరోయిన్ మిల్కీబ్యూటీ తమన్నా గురించి అందరికి తెలుసు.. టాలీవుడ్‌లో అడుగుపెట్టి ఇరవై ఏళ్లు పూర్తి కావొస్తున్న క్రేజ్ మాత్రం తగ్గలేదు.. ఇప్పుడున్న కుర్ర హీరోయిన్లతో పోటి పడుతూ వరుస సినిమాలను చేస్తూ బిజీగా ఉంది. బాలీవుడ్‌లో ఆమె మొదట జీ కర్థ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. ఆ సిరీస్‌లో కూడా బోల్డ్ సన్నివేశాలలో రెచ్చిపోయింది. తాజాగా వచ్చిన వెబ్ సిరీస్ 'లస్ట్ స్టోరీస్2'లో కూడా అవే సీన్లతో మరింత డోస్ పెంచింది.
బాలీవుడ్‌లో అవకాశాల కోసమే మిల్కీబ్యూటీ ఇలాంటి నిర్ణయాలు తీసుకుందానని కూడా ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే ఆమె సినీ కెరియర్‌లో ఏ సినిమాలో కూడా ఈ స్థాయిలో బోల్డ్‌గా నటించలేదు. అంతే కాకుండా విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నట్లు ప్రకటించింది. ఈ సీరిస్‌లో వారిద్దరూ ఏకంగా లిప్ కిస్ సీన్స్‌తో పాటు బెడ్ రూం సీన్స్‌లో కూడా రెచ్చిపోయారు.
(ఇదీ చదవండి: సినీ తారల ‘వ్యాపారం’.. సైడ్ బిజినెస్‌తో కోట్లు గడిస్తున్న స్టార్స్ వీరే!)
ఈ సిరీస్ కోసం తమన్నాకు భారీ స్థాయిలోనే రెమ్యూనేషన్ ఇచ్చారని తెలుస్తోంది. ఒక సినిమా కోసం తమన్నా సుమారు రూ. ఐదు కోట్ల రూపాయల వరకు తీసుకుంటుందని ఇండస్ట్రీ టాక్. కానీ 'లస్ట్ స్టోరీస్2' కోసం ఏకంగా ఏడు కోట్ల రూపాయల వరకు తీసుకున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారింది.
ఇందులో కూడా తను కేవలం 30 నిమిషాల నిడివి లోపే తన క్యారెక్టర్ ఉంటుంది. రొమాన్స్ సీన్లు చేసేందుకు ఎలాంటి అడ్డు చెప్పనందుకే ఇంత మొత్తంలో రెమ్యునరేషన్ మేకర్స్ ఇచ్చారని తెలుస్తోంది. టాలీవుడ్‌లో భోళా శంకర్ సినిమాలో చిరంజీవితో జోడిగా తమన్నా నటిస్తుంది. ఈ సినిమా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది.
(ఇదీ చదవండి: 'భోళా శంకర్'కి లైన్ క్లియర్.. ఆ సినిమా వాయిదా వల్ల!)
Comments
Please login to add a commentAdd a comment