
విజయ్ వర్మ
‘నువ్వు కావాలయ్యా...’ అంటూ ‘జైలర్’లోని ప్రత్యేక పాటలో తమన్నా చేసిన డ్యాన్స్ అందర్నీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఈ మధ్యకాలంలో ఎక్కువగా వార్తల్లో నిలిచిన పాటల్లో ఇదొకటి. కాగా.. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ అయితే తమన్నాతో దాదాపు ఇలానే అన్నారట. ‘నీతో ఎక్కువ సమయం గడపాలని ఉంది’ అని చెప్పారట విజయ్. గత ఏడాది కొత్త సంవత్సరం పార్టీలో విజయ్, తమన్నా చాలా క్లోజ్‌గా కనిపించడంతో ఇద్దరూ డేటింగ్‌లో ఉన్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి.
పైగా సినిమాల్లో కూడా చేయనంతగా విజయ్ వర్మతో ‘లస్ట్ స్టోరీస్ 2’ సిరీస్‌లో ముద్దు సన్నివేశాల్లో నటించారు తమన్నా. ఆ సిరీస్‌లో ఇద్దరి కెమిస్ట్రీ ప్రేమలో ఉన్నారేమోననే అభిప్రాయం పలువురికి కలగజేసింది. అయితే అప్పుడు కాదు.. అసలు డేటింగ్ మొదలైంది ఎప్పుడంటే అంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు విజయ్ వర్మ, ఆ ఇంటర్వ్యూలో విజయ్ వర్మ మాట్లాడుతూ – ‘‘లస్ట్ స్టోరీస్ 2’ అప్పుడు మేం డేటింగ్‌లో లేము.
ఆ షూటింగ్ మొత్తం పూర్తయ్యాక ‘ర్యాప్‌అప్ పార్టీ’ ఏర్పాటు చేయాలనుకున్నారు. కానీ అది జరగలేదు. దాంతో తమన్నా, నేను, మరో ఇద్దరు పార్టీ చేసుకున్నాం. ఆ పార్టీలోనే ‘నాకు నీతో ఎక్కువ సమయం గడపాలని ఉంది’ అంటూ నా ఫీలింగ్‌ని తమన్నాతో చెప్పాను. ఆ తర్వాత మా ఫస్ట్ డేట్ సెట్ కావడానికి 20, 25 రోజులు పట్టింది’’ అని పేర్కొన్నారు. సో.. ప్రపోజ్ చేసిన 25 రోజులకు విజయ్, తమన్నాల డేటింగ్ మొదలైందన్న మాట. ఇక ఈ ఇద్దరూ పలు సందర్భాల్లో ఒకరంటే మరొకరికి బాగా ఇష్టమన్నట్లు పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే పెళ్లి గురించి మాత్రం క్లారిటీ
ఇవ్వడంలేదు.
Comments
Please login to add a commentAdd a comment