ఊరట: స్పుత్నిక్-వీ తొలి డోస్ హైదరాబాద్‌లోనే | Sputnik V(Imported)To First Dose Administered | Sakshi
Sakshi News home page

ఊరట: స్పుత్నిక్-వీ తొలి డోస్ హైదరాబాద్‌లోనే

Published Fri, May 14 2021 2:40 PM | Last Updated on Fri, May 14 2021 3:18 PM

  Sputnik V(Imported)To First Dose Administered - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో రెండో దశలో  రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్న తరుణంలో  ఊరటనిచ్చే సమాచారం స్పుత్నిక్-వీ టీకా స్వీకరణ షురూ కావడం. రెండు వారాల క్రితమే మన దేశంలోకి ఎంట్రీ ఇచ్చినా స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి మాత్రం రాలేదు. మరో వారంలో దేశీయ మార్కెట్లోకి అందుబాటులోకి రానుందని కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం ప్రకటించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం మొట్టమొదటి డోసు హైదరాబాద్‌లోనే వేయడం శుభపరిణామం. 

స్పుత్నిక్-వీ టీకాను ప్రజలకు అందుబాటులోకి తెచ్చే ప్రక్రియ ప్రారంభమైందని  డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ప్రకటించింది. ఈ టీకా  ఒక్కో డోసు ఖరీదు  (జీఎస్టీతో కలిపి) రూ.995 గా  నిర్ణయించింది. ఈ స​మాచారాన్ని డా.రెడ్డీస్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.  మే 1నే మన దేశంలోకి స్పుత్నిక్-వీ ఫస్ట్ కన్‌సైన్‌మెంట్లు వచ్చినా, మే 13న భారతదేశ సెంట్రల్ డ్రగ్ లేబొరేటరీ రెగ్యులేటరీ క్లియరెన్స్  అనుమతి లభించింది.  దేశంలోని మరో ఆరు వ్యాక్సిన్ తయారీ కంపెనీలతో కలిసి టీకా పంపిణీ కార్యక్రమంలో పాలుపంచుకోనున్నట్లు డాక్టర్ రెడ్డీస్ ఈ సందర్భంగా  వెల్లడించింది.

చదవండి :  దిగుమతి చేసుకున్న స్పుత్నిక్-వీ ధర ఎంతంటే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement