Dr Reddy
-
డాక్టర్ రెడ్డీస్ లాభం 1,342 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ (డీఆర్ఎల్) రూ. 1,342 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత క్యూ2లో నమోదైన రూ. 1,480 కోట్లతో పోలిస్తే ఇది 9 శాతం తక్కువ. గ్లోబల్ జనరిక్స్ దన్నుతో సమీక్షాకాలంలో ఆదాయం రూ. 6,880 కోట్ల నుంచి సుమారు 17 శాతం వృద్ధి చెంది రూ. 8,016 కోట్లకు పెరిగినట్లు మంగళవారం ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా కంపెనీ తెలిపింది. వివిధ వ్యాపార విభాగాలవ్యాప్తంగా మెరుగైన వృద్ధిని కొనసాగించినట్లు సంస్థ కో–చైర్మన్ జీవీ ప్రసాద్ తెలిపారు. నికోటినెల్ తదితర బ్రాండ్ల కొనుగోలు ప్రక్రియను పూర్తి చేశామని, భవిష్యత్ వృద్ధి చోదకాల విషయంలో పురోగతి సాధించామని ఆయన పేర్కొన్నారు. సామర్థ్యాలను మెరుగుపర్చుకోవడం, ప్రధాన వ్యాపారాలను బలోపేతం చేసుకోవడంపై మరింతగా దృష్టి పెట్టడాన్ని కొనసాగిస్తామని ప్రసాద్ వివరించారు. ఉత్పత్తి సామర్థ్యాలను పెంచుకోవడం తదితర అంశాలపై ఈ ఆర్థిక సంవత్సరం రూ. 2,500 కోట్ల మూలధన వ్యయాలను చేయనున్నట్లు సంస్థ సీఈవో ఎరెజ్ ఇజ్రేలీ తెలిపారు. మరిన్ని విశేషాలు.. ⇒ క్యూ2లో గ్లోబల్ జనరిక్స్ విభాగం ఆదాయం 17 శాతం పెరిగి రూ. 6,108 కోట్ల నుంచి సుమారు రూ. 7,158 కోట్లకు చేరింది. కీలకమైన ఉత్తర అమెరికా మార్కెట్ 17 శాతం పెరిగి రూ. 3,728 కోట్లకు చేరింది. అమెరికాలో నాలుగు కొత్త ఉత్పత్తులను కంపెనీ ప్రవేశపెట్టింది. క్యూ2లో దేశీయంగా మూడు కొత్త బ్రాండ్లను కంపెనీ ప్రవేశపెట్టింది. ⇒ రిటుగ్జిమాబ్ బయోసిమిలర్కి యూరోపియన్ కమిషన్ నుంచి మార్కెటింగ్ ఆథరైజేషన్ లభించింది. అలాగే, గ్యాస్ట్రోఇంటెస్టినల్ ఔషధం వొనొప్రాజాన్ను భారత్‌లో విక్రయించేందుకు టకెడా సంస్థతో లైసెన్సింగ్ ఒప్పందం కుదుర్చుకుంది. కంపెనీ షేరు బీఎస్ఈలో స్వల్పంగా పెరిగి రూ. 1,273 వద్ద ముగిసింది. -
భారత్ ఫార్మా కంపెనీలకు అమెరికా కీలక ఆదేశాలు
భారత్‌కు చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీలు డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, సన్ ఫార్మా మరియు అరబిందో ఫార్మాకు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (USFDA) కీలక ఆదేశాలు జారీ చేసింది. తయారీ సమస్యల కారణంగా యూఎస్ మార్కెట్లో ఉన్న ఉత్పత్తులను రీకాల్ చేయాలని ఆదేశించింది. న్యూజెర్సీలోని ప్రిన్స్టన్లో ఉన్న డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ జావిగ్టర్ (Javygtor), సాప్రోప్టెరిన్ డైహైడ్రోక్లోరైడ్ను రీకాల్‌కు సిద్ధమైంది. సన్ ఫార్మా సైతం ఫంగల్ ఇన్ఫెక్షన్ల చికిత్సకు ఉపయోగించే యాంఫోటెరిసిన్ బి లిపోసోమ్ రీకాల్ చేస్తున్నట్లు యూఎస్ఏఫ్డీఏ తెలిపింది.అదే విధంగా, అరబిందో ఫార్మా అమెరికన్ మార్కెట్లో ఆందోళనకు చికిత్స చేయడానికి ఉపయోగించే క్లోరాజెపేట్ డిపోటాషియం టాబ్లెట్లను (3.75 mg, 7.5 mg) రీకాల్ చేస్తోంది. -
ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో డాక్టర్ రెడ్డీస్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వరల్డ్ హైపర్ టెన్షన్ డే సందర్భంగా రక్తపోటుపై అవగాహన కార్యక్రమాలతో ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ తాజాగా ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. 30,813 మంది వైద్యులు పంపిన సందేశాలను ఆకులుగా అలంకరించి అతి పెద్ద హృదయాకృతిని రూపొందించినందుకు గాను ఈ ఘనత దక్కించుకుంది. దాదాపు 200 కిలోల బరువున్న ఈ ఇన్‌స్టాలేషన్‌ను హైదరాబాద్ బాచుపల్లిలోని కంపెనీ క్యాంపస్‌లో ఏర్పాటు చేశారు. -
ఊరట: స్పుత్నిక్-వీ తొలి డోస్ హైదరాబాద్‌లోనే
సాక్షి, హైదరాబాద్: దేశంలో రెండో దశలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్న తరుణంలో ఊరటనిచ్చే సమాచారం స్పుత్నిక్-వీ టీకా స్వీకరణ షురూ కావడం. రెండు వారాల క్రితమే మన దేశంలోకి ఎంట్రీ ఇచ్చినా స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి మాత్రం రాలేదు. మరో వారంలో దేశీయ మార్కెట్లోకి అందుబాటులోకి రానుందని కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం ప్రకటించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం మొట్టమొదటి డోసు హైదరాబాద్‌లోనే వేయడం శుభపరిణామం. స్పుత్నిక్-వీ టీకాను ప్రజలకు అందుబాటులోకి తెచ్చే ప్రక్రియ ప్రారంభమైందని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ప్రకటించింది. ఈ టీకా ఒక్కో డోసు ఖరీదు (జీఎస్టీతో కలిపి) రూ.995 గా నిర్ణయించింది. ఈ సమాచారాన్ని డా.రెడ్డీస్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. మే 1నే మన దేశంలోకి స్పుత్నిక్-వీ ఫస్ట్ కన్సైన్మెంట్లు వచ్చినా, మే 13న భారతదేశ సెంట్రల్ డ్రగ్ లేబొరేటరీ రెగ్యులేటరీ క్లియరెన్స్ అనుమతి లభించింది. దేశంలోని మరో ఆరు వ్యాక్సిన్ తయారీ కంపెనీలతో కలిసి టీకా పంపిణీ కార్యక్రమంలో పాలుపంచుకోనున్నట్లు డాక్టర్ రెడ్డీస్ ఈ సందర్భంగా వెల్లడించింది. చదవండి : దిగుమతి చేసుకున్న స్పుత్నిక్-వీ ధర ఎంతంటే? -
బుల్ రన్‌కు రెస్ట్.. నష్టాల్లో మార్కెట్లు
ముంబై : గత నాలుగు సెషన్లుగా దూసుకెళ్తూ.. రికార్డు గరిష్టాలను తాకుతున్న బుల్ రన్‌కు స్టాక్ మార్కెట్లు రెస్ట్ ఇచ్చాయి. బ్యాంకు, ఫార్మాస్యూటికల్ కంపెనీలు తమ ఫలితాల్లో నిరాశపరచడంతో, ఆ కంపెనీల షేర్లు నష్టాలు పాలయ్యాయి. దీంతో శుక్రవారం స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 73 పాయింట్ల నష్టంలో 32,309.88 వద్ద, నిఫ్టీ 6 పాయింట్ల నష్టంలో 10,014.50 వద్ద క్లోజయ్యాయి. నష్టాలు పాలైనప్పటికీ, నిఫ్టీ తన కీలకమైన మార్కు 10వేల నుంచి కిందకి దిగలేదు. మొట్టమొదటిసారి ఈ మార్కును మంగళవారం సెషన్లో తాకింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ తనకు ఎంతో కీలకమైన మార్కును ఛేదించడంతో, లాభాల స్వీకరణ చోటుచేసుకోవడం సాధారణమని విశ్లేషకులంటున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్లలో కొంత ధర కరెక్షన్కు గురైందని చెప్పారు. డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్ నేటి మార్కెట్లో అత్యధికంగా 6.5 శాతం నష్టపోయింది. మే 30 తర్వాత ఇదే అత్యంత కనిష్టస్థాయి. ఈ కంపెనీ ఫలితాల్లో నిరాశపరచడంతో, షేర్లు నష్టాలు పాలయ్యాయి. ఐసీఐసీఐ కూడా లాభాల్లో 8 శాతం డౌన్ కావడంతో, ఈ బ్యాంకు షేర్లు కూడా 3 శాతం పడిపోయాయి. వరుసగా మూడు క్వార్టర్లోనూ ఐడియా సెల్యులార్ తీవ్ర నష్టాలను నమోదుచేసింది. దీంతో ఈ కంపెనీ స్టాక్ 5.6 శాతం డౌన్ అయింది. కానీ సిగరెట్ల నుంచి బిస్కెట్ల వరకు తయారీచేస్తున్న ఐటీసీ లిమిటెడ్ మంచి ఫలితాలను ప్రకటించడంతో, షేర్లు 2 శాతం పెరిగాయి. నేటి సెషన్లో రెండు సూచీల్లోనూ హెచ్డీఎఫ్సీ, ఇన్ఫోసిస్, యస్ బ్యాంకు మంచి లాభాలను ఆర్జించగా.. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, లుపిన్, ఐడియా, ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 5 పైసలు బలహీనపడి 64.16గా ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు 53 రూపాయల నష్టంతో 28,423వద్ద ఉన్నాయి. -
డా.రెడ్డీస్‌కు యూఎస్ఎఫ్డీఏ షాక్
హైదరాబాద్: దేశీయ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ రెగ్యులేటరీ భారీ షాకిచ్చింది. దీంతో గురువారం నాటి మార్కెట్లో ఈ షేరు భారీగా నష్టపోతోంది. సంస్థకు చెందిన విశాఖపట్టణం స్పెషల్ ఎకనామిక్ జోన్ లోని దువ్వాడ అంకాలజీ ప్లాంటులో యూఎస్ఎఫ్డీఏ 13 లోపాలను(అబ్జర్వేషన్స్) గుర్తించారన్న వార్తలతో మదుపర్ల సెంటిమెంట్ దెబ్బతింది. దీంతో ఈ కౌంటర్లో్ అమ్మకాలకు తెరలేచింది. దాదాపు 4.2 శాతానికిపై నష్టపోయి 52 వారాల కనిష్టాన్ని నమోదు చేసింది. వైజాగ్‌కు సమీపంలోని దువ్వాడ ఫార్ములేషన్ల తయారీ ప్లాంటులో తనిఖీలు నిర్వహించిన అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ 13 అబ్జర్వేషన్స్‌తో కూడిన ఫామ్ 483ని జారీ చేసింది. ఈ సమాచారాన్ని డాక్టర్ రెడ్డీస్ బీఎస్ఈ ఫైలింగ్‌లో తెలిపింది. అలాగే వీటిని సరిదిద్దే చర్యలు చేపట్టినట్లు తెలియజేసింది. దిద్దుబాటు చర్య ప్రణాళిక తో వ్రాతపూర్వకంగా స్పందించనున్నామని, త్వరలోనే దీన్ని అమలు చేయనున్నామని చెప్పింది. మరోవైపు రాష్ట్రంలోని మరో ముఖ్యమైన శ్రీకాకుళంప్లాంట్‌లో ఏప్రిల్ రెండవ వారంలో యూఎస్ఎఫ్డీఏ తనిఖీలు చేపట్టనుంది. కాగా ఈ స్టాక్ గత నెలలో 8 శాతం పైగా క్షీణించింది. -
పేటెంట్ కేసులో డాక్టర్ రెడ్డీస్‌పై తెవా దావా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పేటెంట్ ఉల్లంఘన కేసులో డాక్టర్ రెడ్డీస్‌పై లా సూట్ వేసే ఆలోచనలో ఉన్నట్లు తెవా ఫార్మా ప్రకటించింది. కొపాగ్జోన్ జెనరిక్ వెర్షన్‌కు సంబంధించి డాక్టర్ రెడ్డీస్ నుంచి పారా-4 నోటిఫికేషన్ అందిందని, దీన్ని సవాలు చేస్తూ లా సూట్ దాఖలు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెవా తెలిపింది. నాడీ వ్యవస్థ దెబ్బతిని వివిధ భాగాలు పనిచేయని వ్యాధి చికిత్సకు ఈ కొపాగ్జోన్ను వినియోగిస్తారు.