భారత్‌కు చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీలు డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, సన్ ఫార్మా మరియు అరబిందో ఫార్మాకు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (USFDA) కీలక ఆదేశాలు జారీ చేసింది. తయారీ సమస్యల కారణంగా యూఎస్ మార్కెట్‌లో ఉన్న ఉత్పత్తులను రీకాల్ చేయాలని ఆదేశించింది.
న్యూజెర్సీలోని ప్రిన్స్‌టన్‌లో ఉన్న డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ జావిగ్టర్ (Javygtor), సాప్రోప్టెరిన్ డైహైడ్రోక్లోరైడ్‌ను రీకాల్‌కు సిద్ధమైంది.
సన్ ఫార్మా సైతం ఫంగల్ ఇన్ఫెక్షన్ల చికిత్సకు ఉపయోగించే యాంఫోటెరిసిన్ బి లిపోసోమ్ రీకాల్ చేస్తున్నట్లు యూఎస్‌ఏఫ్‌డీఏ తెలిపింది.
అదే విధంగా, అరబిందో ఫార్మా అమెరికన్ మార్కెట్‌లో ఆందోళనకు చికిత్స చేయడానికి ఉపయోగించే క్లోరాజెపేట్ డిపోటాషియం టాబ్లెట్‌లను (3.75 mg, 7.5 mg) రీకాల్ చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment