recalling
-
భారత్ ఫార్మా కంపెనీలకు అమెరికా కీలక ఆదేశాలు
భారత్‌కు చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీలు డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, సన్ ఫార్మా మరియు అరబిందో ఫార్మాకు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (USFDA) కీలక ఆదేశాలు జారీ చేసింది. తయారీ సమస్యల కారణంగా యూఎస్ మార్కెట్లో ఉన్న ఉత్పత్తులను రీకాల్ చేయాలని ఆదేశించింది. న్యూజెర్సీలోని ప్రిన్స్టన్లో ఉన్న డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ జావిగ్టర్ (Javygtor), సాప్రోప్టెరిన్ డైహైడ్రోక్లోరైడ్ను రీకాల్‌కు సిద్ధమైంది. సన్ ఫార్మా సైతం ఫంగల్ ఇన్ఫెక్షన్ల చికిత్సకు ఉపయోగించే యాంఫోటెరిసిన్ బి లిపోసోమ్ రీకాల్ చేస్తున్నట్లు యూఎస్ఏఫ్డీఏ తెలిపింది.అదే విధంగా, అరబిందో ఫార్మా అమెరికన్ మార్కెట్లో ఆందోళనకు చికిత్స చేయడానికి ఉపయోగించే క్లోరాజెపేట్ డిపోటాషియం టాబ్లెట్లను (3.75 mg, 7.5 mg) రీకాల్ చేస్తోంది. -
మారుతి కార్లలో లోపాలు: రీప్లేస్ చేసేదాకా దయచేసి వాడకండి!
సాక్షి, ముంబై: భారతదేశపు అగ్రశ్రేణి కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ తన కస్టమర్లకు షాకింగ్ న్యూస్ చెప్పింది. పలు మోడళ్ల కార్లలో ఎయిర్‌బ్యాగ్ కంట్రోలర్లలో లోపం కారణంగా వేల కార్లను రీకాల్ చేస్తున్నట్టు ప్రకటించింది. డిసెంబర్ 2022 డిసెంబరు 8, 2023 జనవరి 12 మధ్య తయారు చేసిన 17,362 వాహనాలను రీకాల్ చేస్తున్నట్లు మారుతి బుధవారం తెలిపింది.ఆల్టో కె10, ఎస్-ప్రెస్సో, ఈకో, బ్రెజ్జా, బాలెనో , గ్రాండ్ విటారా వంటి మోడళ్లు ప్రభావితమైనట్లు కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ఎయిర్‌బ్యాగ్ కంట్రోలర్‌లో లోపం కారణంగా 17,362 వాహనాలను రీకాల్ చేస్తున్నట్లు కంపెనీ ఈరోజు విడుదల చేసింది. ఈ వాహనాల్లో అవసరమైతే ఎయిర్‌బ్యాగ్ కంట్రోలర్‌ను ఉచితంగా తనిఖీ చేసి భర్తీ చేసేందుకు గాను ఈ రీకాల్ చేపట్టినట్టు వెల్లడించింది. ఈ లోపం కారణంగా వాహనం క్రాష్ అయినప్పుడు ఎయిర్‌బ్యాగ్‌లు, సీట్ బెల్ట్ ప్రిటెన్షనర్లు చాలా అరుదుగా పనిచేయకపోవచ్చని తెలిపింది. ప్రభావితమైన భాగాన్ని మార్చే వరకు వాహనాన్ని నడపవద్దని లేదా ఉపయోగించవద్దని వినియోగదారులకు సూచించింది. సంబంధిత కార్ ఓనర్లకు తక్షణమే మారుతి సుజుకి అధీకృత వర్క్‌షాప్‌ల నుంచి సమాచారం వస్తుందని పేర్కొంది. కాగా గత డిసెంబరులో సియాజ్, బ్రెజ్జా, ఎర్టిగా,ఎక్స్ఎల్ 6, గ్రాండ్ విటారా మోడల్స్ 9,125 యూనిట్లను ఫ్రంట్‌లైన్ సీట్ బెల్ట్‌లలోని లోపాలను సరిచేయడానికి రీకాల్ చేసింది. -
పలు కార్లను రీకాల్ చేయనున్న మహీంద్రా కంపెనీ..!
ముంబై: ప్రముఖ భారత కార్ల తయారీదారు మహీంద్రా అండ్ మహీంద్రా కీలక నిర్ణయం తీసుకుంది. నాసిక్ ఫెసిలీటీ సెంటర్లో తయారుచేసిన సుమారు ఆరు వందల డీజిల్ వాహనాలను రీకాల్ చేయనున్నట్లు వార్తలు వస్తోన్నాయి. ఫెసిలిటీ సెంటర్ నుంచి వచ్చిన ఒక బ్యాచ్‌లో కలుషితమైన ఫ్లుయెడ్స్‌ను ఇంజిన్ భాగాల్లో వాడినట్లు తెలుస్తోంది. జూన్ 21 నుంచి జూలై 2, 2021 మధ్య తయారు చేసిన వాహనాలు ప్రభావితమైనట్లు గుర్తించారు. అయితే కంపెనీ రీకాల్ చేయదల్చుకున్న వాహనాల పేర్లను మహీంద్రా ప్రకటించలేదు. తాజాగా పలు వాహనాలను రీకాల్ చేస్తున్నట్లు మహీంద్రా బీఎస్ఈలో ఫైలింగ్ చేసింది. మహీంద్రా తన బీఎస్ఈ ఫైలింగ్‌లో..జూన్ 21 నుంచి 2021 జూలై 2 మధ్య తయారు చేయబడిన ఆరు వందల కంటే తక్కువ వాహనాల పరిమిత బ్యాచ్‌ను రీకాల్ చేయనున్నట్లు ఫైల్ చేసింది. వాహనాల్లో నెలకొన్న లోపాలను తనిఖీ చేసి, సరిద్దిదుతామని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. మహీంద్రా సంస్థ తన నాసిక్ ఫెసిలీటీ సెంటర్లో థార్, స్కార్పియో, బొలెరో, మరాజ్జో, ఎక్స్యువి 300 లను తయారు చేస్తుంది. -
4.71 లక్షల ఎస్‌యూవీల రీకాల్
న్యూయార్క్: గత సెప్టెంబర్‌లో యూఎస్‌లో ప్రారంభించిన హ్యుండాయ్ టస్కన్ ఎస్‌యూవీల రీకాల్‌ను కొనసాగిస్తున్నట్లు దక్షిణ కొరియా ఆటో దిగ్గజం హ్యుండాయ్ తాజాగా వెల్లడించింది. యాంటీలాక్ బ్రేక్ సిస్టమ్ కలిగిన కార్ల కంప్యూటర్లలో అంతర్గతంగా సమస్యలు ఎదురవుతున్నట్లు ఈ సందర్భంగా పేర్కొంది. దీంతో ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్లకు అవకాశమేర్పడుతున్నట్లు తెలియజేసింది. ప్రధానంగా 2016-2018 మధ్య తయారైన కొన్ని మోడళ్లలో ఈ సమస్యలు కనిపిస్తున్నట్లు వివరించింది. దీంతో అగ్రిప్రమాదానికి అవకాశముంటుందని తెలియజేసింది. వీటికి జతగా 2020-21 మోడళ్లను సైతం రీకాల్ చేస్తున్నట్లు వెల్లడించింది. అయితే హ్యుండాయ్కు చెందిన స్మార్ట్ క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్ కలిగిన టస్కన్ వాహనాలను వెనక్కి పిలవడం లేదని పేర్కొంది. యూఎస్‌లో 2020 సెప్టెంబర్‌లో ప్రారంభించిన కార్ల రీకాల్‌లో భాగంగా మరో 4.71 లక్షల ఎస్‌యూవీలకు రిపేర్ సర్వీసులు అందించనున్నట్లు తెలియజేసింది. రిపేర్లు పూర్తయ్యేవరకూ కార్లను బయటే పార్క్ చేయవలసిందిగా ఈ సందర్భంగా యజమానులకు సూచించింది. చదవండి: (ఇక భారత్‌లోనూ ఎలక్ట్రిక్ కార్ల హవా) సమస్యపై దర్యాప్తు ఎస్‌యూవీలలో ఎదురవుతున్న సమస్యలపై కొనసాగిస్తున్న దర్యాప్తులో భాగంగా తాజా రీకాల్‌ను చేపట్టినట్లు హ్యుండాయ్ యూఎస్ వెల్లడించింది. కొన్ని కార్లలో అగ్రిప్రమాదాలు జరగడంతో రిపేర్‌కు సన్నాహాలు చేసినట్లు పేర్కొంది. అయితే ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని తెలియజేసింది. ఫిబ్రవరి చివరికల్లా యజమానుల జాబితాను సిద్ధం చేయగలమని వెల్లడించింది. తద్వారా యజమానులు డీలర్ల దగ్గరకు కార్లను తీసుకుని వెళితే కంప్యూటర్లలో ఫ్యూజు మార్పిడిని చేపడతారని తెలియజేసింది. నిజానికి సెప్టెంబర్‌లో ఇదే సమస్యతో 2019-21 మధ్య కాలంలో తయారైన 1.8 లక్షల టస్కన్ ఎస్‌యూవీలను యూఎస్‌లో రీకాల్ చేసింది. తుప్పు కారణంగా రక్షణాత్మక యాంటీలాక్ బ్రేక్ సర్క్యూట్ బోర్డులలో షార్ట్ సర్క్యూట్లకు వీలు ఏర్పడుతున్నట్లు వివరించింది. ఇంజిన్లు ఆఫ్‌చేసి ఉన్నప్పటికీ ఈ సమస్య ఎదురయ్యే వీలున్నట్లు పేర్కొంది. (ప్రపంచ కుబేరుడిగా ఎలన్ మస్క్?) -
ల్యాప్‌టాప్‌లు కూడా పేలతాయా? సంచలన హెచ్చరిక
హెచ్‌పీ ల్యాప్‌టాప్‌ల వినియోగదారులకు వారికి షాకింగ్ న్యూస్. ఇప్పటివరకూ స్మార్ట్ఫోన్లు పేలిన సంఘటనలు చూశాం..ఇకపై ల్యాప్‌టాప్‌లు కూడా పేలనున్నాయా? గ్లోబల్ ఎలక్ట్రానిక్ దిగ్గజం హెచ్‌పీ ప్రకటనను గమనిస్తే ఈ భయాలే కలుగుతున్నాయి. ఈ కంపెనీ తయారు చేసిన బ్యాటరీలపై అనేక సందేహాలు పుట్టుకొస్తున్నాయి. మాన్యుఫ్యాక్చరింగ్ తప్పిదం కారణంగా 78,500 లిథియం బ్యాటరీలను వెనక్కు తీసుకుంటున్నామని సంస్థ చేసిన తాజా ప్రకటన సంచలనం రేపుతోంది. ముఖ్యంగా ఈ ఏడాది జనవరిలో 50 వేల బ్యాటరీలను రీకాల్ చేసిన సంస్థ తాజాగా మరో ప్రకటన చేసిందని యూఎస్ కన్స్యూమర్ ప్రాడక్ట్ సేఫ్టీ కమిషన్ వెల్లడించింది. అంతకుముందు సంవత్సరంలో 101,000 బ్యాటరీలను రీకాల్ చేసింది. తమ లిథియం అయాన్ బ్యాటరీలతో కూడిన ల్యాప్టాప్స్ నుంచి మంటలొచ్చే అవకాశం ఉందని స్వయంగా హెచ్‌పీ కంపెనీ ఒప్పుకుంది. ఇవి ప్యాకేజింగ్ సమయంలోనే బాగా వేడెక్కినట్టు ఫిర్యాదులందినట్టు తెలుస్తోంది. అయితే అప్డేట్ని డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా బ్యాటరీల సేఫ్టీ మోడ్‌ను పొందొచ్చంటూ యూజర్లకు ముందస్తు హెచ్చరిక జారీ చేసింది. డిసెంబర్ 2015 నుంచి ఏప్రిల్ 2018 వరకు విక్రయించిన నోట్‌బుక్ కంప్యూటర్స్, మొబైల్ వర్క్ స్టేషన్స్ హెచ్‌పీ లిథియం అయాన్ బ్యాటరీలు ప్రభావితమైనట్టు పేర్కొంది. అంతేకాదు వీటి గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఒక వెబ్‌సైట్‌ను హెచ్‌పీ సంస్థ ఏర్పాటు చేసింది. దీని ద్వారా రీకాల్ చేసిన బ్యాటరీ మీ ల్యాప్‌టాప్‌లో ఉందేమో సరిచూసుకోమని కోరుతోంది. -
టయోటా హైబ్రిడ్ కార్ల రీకాల్
టోక్యో: జపాన్‌కు చెందిన కార్ల తయారీ సంస్థ టయోటా మరోసారి భారీగా హైబ్రిడ్ కార్లను రీకాల్ చేయనుంది. సాంకేతిక లోపాలకారణంగా సుమారు 24 లక్షల కార్లను వెనక్కి తీసుకుంటున్నట్టు శుక్రవారం ప్రకటించింది. సాంకేతిక సమస్యల కారణంగా కార్లలో మంటలంటుకునే అవకాశం ఉందంటూ గత నెలలో ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల టయోటా హైబ్రిడ్ కార్లను రీకాల్ చేస్తున్నట్టు ప్రకటించింది. -
65 లక్షల టయోటా కార్ల రీకాల్
టోక్యో: జపాన్‌కు చెందిన ప్రపంచ ప్రఖ్యాత వాహన తయారీ సంస్థ 'టయోటా' 6.5 మిలియన్ వాహనాలను వెనక్కి తీసుకుంటోంది. ఆ సంస్థ వాహనాల తయారీలో చిన్న సాంకేతిక లోపం తలెత్తడంతో అగ్ని ప్రమాదం బారినపడే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకుంది. డ్రైవర్ ప్రక్కగా ఏర్పాటు చేసిన పవర్ విండో మాస్టర్ స్విచ్‌లో సమస్యలు గుర్తించినట్లు టయోటా కంపెనీ తెలిపింది. మాస్టర్ స్విచ్ మెల్ట్ అయి మంటలు వ్యాపించే ప్రమాదం ఉన్నందున వాహనాలను వాపసు తీసుకుంటున్నట్లు టయోటా ప్రకటించింది. ఇప్పటి వరకు ఈ తరహాలో ఎలాంటి ప్రమాదాలు జరిగినట్లు తమ దృష్టికి రాకున్నా.. ముందు జాగ్రత్త చర్యగా వాహనాలను వెనక్కి తీసుకుంటున్నట్లు టయోటా తెలిపింది. ఇటీవలి కాలంలో టయోటా వాహనాల 'ఎయిర్ బ్యాగ్'లలో సమస్యలు తలెత్తడంతో 10 మిలియన్ వాహనాలను రీకాల్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా వెనక్కి తీసుకుంటున్న వాహనాలు 2005 నుండి 2010 మధ్య కాలంలో విక్రయించిన యారిస్, కొరోల్లా, కామ్రి లతో పాటు ఆర్ఏవీ4 తరహా మోడల్ వాహనాలు ఉన్నాయి. ఈ మోడల్ వాహనాలను ఎక్కువగా ఉత్తర అమెరికా, బ్రిటన్‌లో విక్రయించినట్లు టయోటా తెలిపింది.