
ముంబై: ప్రముఖ భారత కార్ల తయారీదారు మహీంద్రా అండ్ మహీంద్రా కీలక నిర్ణయం తీసుకుంది. నాసిక్ ఫెసిలీటీ సెంటర్‌లో తయారుచేసిన సుమారు ఆరు వందల డీజిల్ వాహనాలను రీకాల్ చేయనున్నట్లు వార్తలు వస్తోన్నాయి. ఫెసిలిటీ సెంటర్ నుంచి వచ్చిన ఒక బ్యాచ్‌లో కలుషితమైన ఫ్లుయెడ్స్‌ను ఇంజిన్ భాగాల్లో వాడినట్లు తెలుస్తోంది. జూన్ 21 నుంచి జూలై 2, 2021 మధ్య తయారు చేసిన వాహనాలు ప్రభావితమైనట్లు గుర్తించారు. అయితే కంపెనీ రీకాల్ చేయదల్చుకున్న వాహనాల పేర్లను మహీంద్రా ప్రకటించలేదు.
తాజాగా పలు వాహనాలను రీకాల్ చేస్తున్నట్లు మహీంద్రా బీఎస్‌ఈలో ఫైలింగ్ చేసింది. మహీంద్రా తన బీఎస్ఈ ఫైలింగ్‌లో..జూన్ 21 నుంచి 2021 జూలై 2 మధ్య తయారు చేయబడిన ఆరు వందల కంటే తక్కువ వాహనాల పరిమిత బ్యాచ్‌ను రీకాల్ చేయనున్నట్లు ఫైల్ చేసింది. వాహనాల్లో నెలకొన్న లోపాలను తనిఖీ చేసి, సరిద్దిదుతామని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. మహీంద్రా సంస్థ తన నాసిక్ ఫెసిలీటీ సెంటర్‌లో థార్, స్కార్పియో, బొలెరో, మరాజ్జో, ఎక్స్‌యువి 300 లను తయారు చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment