సాక్షి, ముంబై: దేశంలో కరోనా వైరస్ వ్యాక్సిన్ల కొరతపై అనేక విమర్శల కొనసాగుతున్న సమయంలో డాక్టర్ రెడ్డీస్ కీలక విషయాన్ని ప్రకటించింది. రష్యాకు చెందిన కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్-వీ కమర్షియల్ లాంచ్ నిలిచిపోలేదని స్పష్టం చేసింది. రాబోయే వారాల్లో వాణిజ్యపరంగా ఇది అందుబాటులోకి వస్తుందని ప్రకటించింది. ఈ మేరకు డాక్టర్ రెడ్డి లాబొరేటరీస్ ఒక ప్రకటన విడదుల చేసింది. దీంతో వ్యాక్సినేషన్ ప్రకక్రియ మరింత బలోపేతమవుతుందని పేర్కొంది.
కాగా 91.6 శాతం సామర్థ్యంతో పనిచేస్తుందని భావిస్తున్న స్పుత్నిక్-వీ వ్యాక్సిన్‌ను మే 14న సాఫ్ట్ పైలట్ ప్రాతిపదికన డాక్టర్ రెడ్డీస్ భారతదేశంలో ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆగస్టు, డిసెంబర్ మధ్య కాలంలో దేశంలో స్థానికంగా ఉత్పత్తి చేసిన దిగుమతి చేసుకున్న 100 మిలియన్ల స్పుత్నిక్ -వీ డోస్‌లను అందించాలని భారత ప్రభుత్వం ఆశిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment