సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో మరో అడుగు ముందుకు పడింది. ఇప్పటివరకు కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలను పంపిణీ చేస్తున్న ప్రభుత్వం.. అత్యవసర కేటగిరీలో స్పుత్నిక్–వి వ్యాక్సిన్‌ను పంపిణీ చేయనుంది. ఇప్పటికే ఈ మేరకు కేంద్రం ఆమోదం తెలిపింది. తాజాగా ఆదివారం ప్రత్యేక విమానంలో రెండో విడతగా 60 వేల టీకా డోసులు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాయి. తొలి విడతగా 1.5 లక్షల డోసుల స్పుత్నిక్–వి టీకాను ఈ నెల 1న ఇక్కడికి వచ్చాయి. వాటిని పంపిణీ చేసేందుకు హిమాచల్‌ప్రదేశ్‌లోని కసౌలీలో ఉన్న సెంట్రల్ డ్రగ్స్ లేబొరేటరీ ఈ నెల 13న అనుమతిచ్చింది.
దీంతో టీకాల పంపిణీ కార్యక్రమాన్ని డాక్టర్ రెడ్డీస్ సంస్థ చేపట్టింది. కాగా, భారత్‌లో ఈ టీకా తయారీ ని దశల వారీగా ఏడాదికి 850 మిలియన్ డోసులకు పెంచేందుకు సన్నాహాలు జరుగుతు న్నాయి. త్వరలో సింగిల్ డోస్ స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేం దుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. భారత్‌లో స్పుత్నిక్–వి తయారీ, పంపిణీకి ‘రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్’తో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. డాక్టర్ రెడ్డీస్ కస్టమ్ ఫార్మా సర్వీసెస్ వ్యాపార విభా గానికి అధిపతి దీపక్ సప్రా తొలి స్పుత్నిక్–వి డోసు తీసుకున్నారు.
కరోనా వ్యాక్సిన్: రాష్ట్రానికి 60 వేల స్పుత్నిక్–వి డోసులు
Published Mon, May 17 2021 2:34 AM | Last Updated on Mon, May 17 2021 9:53 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment