మాస్కో : కరోనా వైరస్ ప్రకంపనలు ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న తరుణంలోరష్యా మరో కీలక అంశాన్ని వెల్లడించింది. రెండో వ్యాక్సిన్ తయారీకి సిద్ధమవుతోంది. కరోనా మహమ్మారిని అంతం చేసేందుకు రెండవ వ్యాక్సిన్‌కు సంబంధించి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక ప్రకటన చేశారు. కోవిడ్-19 రెండవ వ్యాక్సిన్‌కు రష్యా రెగ్యులేటరీ అనుమతి ఇచ్చినందుకు సంతోషంగా ఉందని బుధవారం ప్రభుత్వ సమావేశంలో ఆయన ప్రకటించారు.
తాజాగా సైబీరియాకు చెందిన వెక్టార్ ఇనిస్టిట్యూట్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌కు అనుమతినిచ్చింది. గత నెలలో ప్రారంభ దశ మానవ పరీక్షలను పూర్తి చేసినందుకు పుతిన్ శాస్త్రవేత్తలను అభినందించారు. ఇక మొదటి, రెండవ టీకా ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించి విదేశీ భాగస్వాములతో కూడా పనిచేస్తున్నామనీ, విదేశాలలో కూడా తమ టీకాను అందిస్తామన్నారు. కాగా తొలి వాక్సిన్ స్పుత్నిక్ వీ ను రష్యా రిజిస్టర్ చేసిన సంగతి తెలిసిందే. ఆగస్టు మాసంలో కోవిడ్-19 వ్యాక్సిన్‌కు రెగ్యులేటరీ ఆమోదం పొందిన మొట్టమొదటి దేశంగా అవతరించింది. రష్యాలో1,340,409 కేసులు నమోదయ్యాయి. కేసులో విషయంలో అమెరికా, ఇండియా, బ్రెజిల్ తరువాత ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద దేశంగా రష్యా నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment