
న్యూఢిల్లీ/హైదరాబాద్: సింగిల్ డోస్ కోవిడ్ టీకా ‘స్పుత్నిక్ లైట్’ అత్యవసర వినియోగానికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) అనుమతి నిరాకరించింది. దీనికి సంబంధించి నిపుణుల కమిటీ చేసిన సిఫారసులను డీసీజీఐ ఆమోదించింది. స్పుత్నిక్ లైట్’ టీకా ‘స్పుత్నిక్ వీ’ టీకాలోని కాంపొనెంట్ 1కి సమానమేనని నిపుణుల కమిటీ అభిప్రాయపడింది.
ఈ టీకాకు సంబంధించి భద్రత, రోగ నిరోధక శక్తిని పెంపొందించే విషయంలో క్లినికల్ ట్రయల్స్ డేటా తగినంత లేదని పేర్కొంది. నిపుణుల కమిటీ సిఫారసులను సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వెబ్‌సైట్‌లో గురువారం పోస్ట్ చేశారు. స్పుత్నిక్ లైట్ అత్యవసర వినియోగానికి అనుమతించాలని హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ డీసీజీఐకి ప్రతిపాదనలు పంపిన విషయం తెలిసిందే.
చదవండి: జాగ్రత్తగా ఉంటే మూడో వేవ్ రాకపోవచ్చు..