సాక్షి,న్యూఢిల్లీ: దేశంలో రెండో దశలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో దేశ ప్రజలకు ఊరటనిచ్చే పరిణామం చోటు చేసుకుంది. రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ కరోనా వ్యాక్సిన్‌కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) అనుమతి లభించింది. అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్(సీడీఎస్‌సీఓ)కు చెందిన విషయ నిపుణుల కమిటీ(ఎస్‌ఈసీ) సిఫార్సు మేరకు డీసీజీఐ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో దేశంలో మూడో కరోనా టీకా అందుబాటులోకి చ్చింది. భారత్‌లో ఈ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి మంజూరు చేయాలని డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్ చేసిన విజ్ఞాపనను నిపుణుల కమిటీ పరిశీలించింది. అనుమతి ఇవ్వొచ్చంటూకు సిఫార్సు చేసింది. దీనికి డీసీజీఐ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో స్పుత్నిక్ టీకా భారత్‌లో అందుబాటులోకి వచ్చింది.
మరోవైపు దేశంలో రెండో దశలో కరోనా వైరస్ కేసుల ఉధృతికొనసాగుతోంది. అయితే దేశవ్యాప‍్తంగా కేసుల నమోదు బుధవారం స్వల్పంగా తగ్గినప్పటికీ రోజు వారీ కేసుల నమోదు లక్షన్నరు పైనే ఉండటం గమనార్హం. కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ విడుల చేసిన గణాంకాల ప్రకారం గడిచిన 24గంటల్లో 1,61,736 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 879 మంది మరణించారు. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,36,89,453కి, మొత్తం మరణాల సంఖ్య 1,71,058కి చేరింది. మరణాల రేటు 1.26 శాతానికి చేరింది. . కొత్తగా 97,168మంది వైరస్ బారి నుండి బయటపడ్డారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 1,22,53,697గా ఉంది. కాగా రికవరీ రేటు 89.86శాతానికి తగ్గింది. యాక్టివ్ కేసుల సంఖ్య 12,64,698గా ఉంది.
చదవండి : ‘స్పుత్నిక్’ అత్యవసర వినియోగానికి అనుమతివ్వండి
క్యా కరోనా: ఒకరా ఇద్దరా.. అందరిదీ అదే పరిస్థితి!
Comments
Please login to add a commentAdd a comment