
న్యూఢిల్లీ: రష్యాకు చెందిన స్పుత్నిక్-వీ కోవిడ్ వ్యాక్సిన్ 2, 3 దశల క్లినికల్ ప్రయోగాలను భారత్‌లో ప్రారంభించినట్లు డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్, రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్టిమెంట్ ఫండ్(ఆర్డీఐఎఫ్) తెలిపింది. వివిధ ప్రాంతాల్లో ఈ ప్రయోగాలు జరగనున్నాయని, దాని భద్రత రోగనిరోధక శక్తి అంశాలపై అధ్యయనం చేస్తామని రెండు సంస్థలు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపాయి. ఈ క్లినికల్ ప్రయోగాలను జేఎస్‌ఎస్ మెడికల్ రీసెర్చ్ నిర్వహిస్తుందన్నాయి.
మొదటిదశ ప్రయోగంలో 28వ రోజున 91.4 శాతం సామర్థ్యంతో, 42 రోజుల అనంతరం 95 శాతం సామర్థ్యంతో ఈ వ్యాక్సిన్ పనిచేసినట్లు ఆర్డీఐఎఫ్ తెలిపింది. మూడో దశ ప్రయోగాల్లో స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ ప్రయోగంలో 40,000 మంది వలంటీర్లు పాల్గొంటున్నారు. ఈ వ్యాక్సిన్‌ని దేశ అవసరాలకూ, ఇతర దేశాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఉత్పత్తి చేయనున్నట్లు డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ కో ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ జీవీ ప్రసాద్ తెలిపారు. భారత్‌లో పది కోట్ల వ్యాక్సిన్ డోసుల పంపిణీకి ఆర్డీఐఎఫ్‌తో డాక్టర్ రెడ్డీస్ లాబ్ ఒప్పందం కుదుర్చుకుంది. (మా వ్యాక్సిన్ సేఫ్: సీరం ఇన్‌స్టిట్యూట్)