
సాక్షి, విశాఖపట్నం : విశాఖ కేజీహెచ్, ఆంధ్రా మెడికల్ కాలేజీల్లో కోవిడ్ షీల్డ్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్ ప్రారంభం అయినట్లు కేజీహెచ్ ఆస్పత్రి సూపరింటెండ్ డాక్టర్ సుధాకర్ తెలిపారు. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ, సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసిన కోవిడ్ షీల్డ్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. శనివారం సాక్షి టీవీతో ఆయన మాట్లాడుతూ.. కేజీహెచ్‌తో పాటు మరో 17 చోట్ల క్లినికల్ ట్రయల్స్ చేస్తున్నామన్నారు. విశాఖ కేజీహెచ్‌లో 100 మందిపై క్లినికల్ ట్రయల్స్ చేస్తున్నామని వెల్లడించారు.చదవండి: కరోనా సోకిందనడానికి ఈ లక్షణాలే ఆధారం
‘నిన్నటి నుంచి క్లినికల్ ట్రయల్స్ వలంటీర్లు ఎంపిక ప్రారంభించాం. మొదట 10 మంది ఇప్పటి వరకు రిజిస్టర్ చేసుకున్నారు. ఎలాంటి వ్యాధి లక్షణాలు లేకుండ సంపూర్ణ ఆరోగ్య వంతులుగా ఉన్నవారు. 18 ఏళ్ళు పైబడిన వాళ్ళు కోవ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొనవచ్చు. సోమవారం నుంచి తొలి వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌కు సిద్ధం అవుతున్నాం. మొత్తం అయిదు దశల్లో క్లినికల్ ట్రయల్స్ వ్యాక్షిన్ ఇచ్చి, వారి రక్త నమూనాలు నమోదు చేస్తాం. ఆరు నెలలు పాటు ఎంపికైన 100మందిలో 75 మందికి వ్యాక్సిన్ ఇస్తాము. ఆ తర్వాత సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు శాంపిల్స్ అన్ని పంపిస్తాము’. అని డాక్టర్ సుధాకర్ తెలిపారు.చదవండి:శిల్పారామాలకు పరిపాలనా అనుమతులు జారీ)
Comments
Please login to add a commentAdd a comment