మాస్కో: కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా ప్రయోగించడానికి ప్రపంచంలో అధికారికంగా రిజిస్టరయిన మొట్టమొదటి వ్యాక్సిన్ స్పుత్నిక్–వి. దీన్ని రష్యా అభివృద్ధి చేసింది. ఈ వ్యాక్సిన్‌లోని తొలి కాంపోనెంట్(ఆర్‌ఏడీ26) స్పుత్నిక్ లైట్. ఈ టీకా ఒక్క డోసు కరోనా వైరస్‌పై 79.4% సమర్థంగా పని చేస్తున్నట్లు అధ్యయనంలో తేలింది. అంటే దాదాపు 80%. ఇతర టీకాల రెండు డోసులు చూపుతున్న ప్రభావం కంటే ఇదే అధికమని సైంటిస్టులు తేల్చారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలురకాల కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. ఇవయితే రెండు డోసులు తీసుకోవాలి. స్పుత్నిక్ లైట్ టీకా ఒక్క డోసు చాలని పరిశోధకులు చెబుతున్నారు. అందుకే స్పుత్నిక్ లైట్ సింగిల్ డోసు వ్యాక్సినేషన్‌కు రష్యా ప్రభుత్వం తాజాగా అనుమతి మంజూరు చేసింది. కరోనా కొత్త రకాలకు(వేరియంట్లు) వ్యతిరేకంగా ఈ టీకా చక్కగా పని చేస్తున్నట్లు గుర్తించారు. స్పుత్నిక్ లైట్ సింగిల్ డోసు తీసుకున్న తర్వాత 28 రోజులకు 91.67 శాతం మంది శరీరంలో యాంటీబాడీస్ వృద్ధి చెందినట్లు తేల్చారు. ఈ టీకా డోసు తీసుకున్నవారిలో తీవ్ర దుష్పరిణామాలేవీ ఉత్పన్నం కాలేదు.
Comments
Please login to add a commentAdd a comment