మాస్కో: కోవిడ్–19 మహమ్మారిని ఎదుర్కొనేందుకు రూపొందించిన ‘స్పుత్నిక్’టీకా ఈ నెలాఖరుకు అందుబాటులోకి రానుంది. వ్యాక్సిన్ ఉత్పత్తిని రష్యా ప్రారంభించిందని ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ ఇంటర్‌ఫాక్స్ వార్తా సంస్థ తెలిపింది. మాస్కోలోని గమలేయా ఇనిస్టిట్యూట్ స్పుత్నిక్ టీకాను అభివృద్ధి చేసింది. ప్రపంచంలో తొలి కరోనా టీకా తమదేనని, సమర్థమంతంగా పనిచేస్తోందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే రష్యా జరిపిన క్లినికల్ ట్రయల్స్‌పై స్పష్టత లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) అంటోంది.
Comments
Please login to add a commentAdd a comment