స్పుత్నిక్‌–వి వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుంది, సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఏంటి? | Sputnik V Vaccine in India: Vaccine Efficacy, Side Effects, Price Details in Telugu | Sakshi
Sakshi News home page

Sputnik V Vaccine: తక్కువ సైడ్‌ ఎఫెక్ట్స్‌.. ఎక్కువ సేఫ్టీ

Published Thu, Apr 15 2021 6:37 PM | Last Updated on Thu, Apr 15 2021 8:47 PM

Sputnik V Vaccine in India: Vaccine Efficacy, Side Effects, Price Details in Telugu - Sakshi

రష్యాకు చెందిన ‘స్పుత్నిక్‌–వి’ వ్యాక్సిన్‌ను మన దేశంలో వినియోగించేందుకు కేంద్రం పర్మిషన్‌ ఇచ్చింది.

రోజురోజుకూ కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో రష్యాకు చెందిన ‘స్పుత్నిక్‌–వి’ వ్యాక్సిన్‌ను మన దేశంలో వినియోగించేందుకు కేంద్రం పర్మిషన్‌ ఇచ్చింది. ఇప్పటికే ఇస్తున్న కోవాగ్జిన్, కోవిషీల్డ్‌ టీకాలకు తోడుగా ఈ వ్యాక్సిన్‌ కూడా అందుబాటులోకి రానుంది. అసలు ఈ స్పుత్నిక్‌–వి వ్యాక్సిన్‌ ఏంటి, దాన్ని ఎలా తయారు చేశారు, ఎలా పనిచేస్తుంది, సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఎంత వరకు ఉంటాయన్న వివరాలు చూస్తే.. 


ఇక్కడ క్లినికల్‌ ట్రయల్స్‌ కూడా ఓకే 
‘స్పుత్నిక్‌–వి’ వ్యాక్సిన్‌ను రష్యాకు చెందిన గమేలియా ఇన్‌స్టిట్యూట్‌ అభివృద్ధి చేసింది. కరోనా తొలివేవ్‌ సమయంలోనే అంటే గతేడాది ఆగస్టులోనే ఈ వ్యాక్సిన్‌ రష్యాలో రిజిస్టరైంది. మన దేశంలో రెడ్డీస్‌ ల్యాబ్స్‌ ఫార్మా సంస్థ ఆ వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించింది. రెడ్డీస్‌ ల్యాబ్స్‌తోపాటు హెటెరో, పనాసీ బయోటెక్, గ్లాండ్, స్టెలిస్, విర్కో ఫార్మా కంపెనీలు మన దేశంలో ఏడాదికి 85 కోట్ల ‘స్పుత్నిక్‌–వి’ వ్యాక్సిన్‌ డోసులను ఉత్పత్తి చేయనున్నాయి. 

మామూలు జలుబు వైరస్‌ నుంచి.. 
మనకు సాధారణంగా జలుబును కలిగించే రెండు రకాల అడెనో వైరస్‌లను తీసుకుని బలహీనపర్చి.. వాటికి కరోనా వైరస్‌ స్పైక్స్‌లో ఉండే ప్రొటీన్‌ను జోడించి వ్యాక్సిన్‌ను డెవలప్‌ చేశారు. సాధారణ అడెనోవైరస్‌లు కావడంతో శరీరం, రోగ నిరోధక వ్యవస్థ అతిగా రెస్పాండ్‌ కాకుండా.. తగిన యాంటీబాడీస్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఈ వ్యాక్సిన్‌తో సైడ్‌ ఎఫెక్ట్స్‌ అతి తక్కువగా ఉన్నట్టు ఇప్పటికే నిర్ధారించారు. 


సామర్థ్యం 91.6 శాతం 
ప్రపంచవ్యాప్తంగా వినియోగిస్తున్న కరోనా వ్యాక్సిన్లలో ఫైజర్‌ (95.3%), మోడెర్నా (94.1%) ఎఫిషియెన్సీతో పనిచేస్తున్నట్టు గుర్తించారు. వాటి తర్వాత కోవిడ్‌ వైరస్‌ను అడ్డుకునే సామర్థ్యం ఎక్కువగా ఉన్నది ‘స్పుత్నిక్‌–వి’ వ్యాక్సిన్‌కే. దీని ఎఫిషియెన్సీని 91.6 శాతంగా నిర్ధారించారు. 


రెండు డోసులు.. మూడు వారాల తేడా.. 
స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌ను అర మిల్లీలీటర్‌ డోసు చొప్పున 21 రోజుల తేడాతో రెండు డోసులు వేసుకోవాల్సి ఉంటుంది. రెండో డోసు కూడా వేసుకున్నాక శరీరంలో యాంటీబాడీస్‌ ఉత్పత్తి బాగా పెరుగుతుంది. ఈ వ్యాక్సిన్‌తో 28వ రోజు నుంచి 42వ రోజు మధ్య గరిష్టంగా ఇమ్యూనిటీ ఉంటుందని గుర్తించారు. 

ఎక్కువ కాలం సేఫ్టీ 
స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌ రెండు డోసులు కూడా రెండు వేర్వేరు స్ట్రెయిన్లతో ఉంటాయి. మొదటి డోసులో ఒక రకం, రెండో డోసులో మరో రకం అడెనోవైరస్‌తో డెవలప్‌ చేసిన వ్యాక్సిన్‌ ఇస్తారు. దీనివల్ల రోగనిరోధక వ్యవస్థ రెండు సార్లు క్రియాశీలమవుతుంది. యాంటీ బాడీస్‌ ఎక్కువ కాలం ఉండి, శరీరానికి రక్షణ కల్పిస్తాయి. 


పొడి రూపంలో వ్యాక్సిన్‌ 
స్పుత్నిక్‌–వి వ్యాక్సిన్‌ పొడి రూపంలో (డ్రై ఫామ్‌) సాధారణ ఫ్రిజ్‌లలో 2 నుంచి 8 సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయొచ్చు. దానికి డిస్టిల్డ్‌ వాటర్‌ కలిపి లిక్విడ్‌ ఇంజెక్షన్‌గా మార్చితే.. మైనస్‌ 18 డిగ్రీల వద్ద స్టోర్‌ చేయాల్సి ఉంటుంది. లేదా రెండు, మూడు గంటల్లోగా లబ్ధిదారులకు వేయాల్సి ఉంటుంది.


ఒక్కో డోసు రూ.750!
మన దేశంలో స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌ను ఏ ధరతో సరఫరా చేస్తారన్నది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఇప్పటికే ఈ వ్యాక్సిన్‌ను 60 దేశాల్లో వినియోగిస్తున్నారు. ఈ లెక్కన సగటు ధర రూ.750 (పది డాలర్లు)గా ఉంది.

ఇక్కడ చదవండి:
కరోనా సెకండ్‌వేవ్‌; మళ్లీ తెరపైకి రైల్వేకోచ్‌లు 

ఆస్పత్రిలో బెడ్‌ అయినా ఇవ్వండి లేదా చంపేయండి‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement