మన దేశంలో దాదాపు సగంమంది ఫిజికల్‌గా ఫిట్‌గా లేరట. భారతీయుల్లో 50 శాతం మంది శారీర శ్రమ అన్న ఊసే ఎత్తడం లేదని తేలింది. గ్లోబల్ హెల్త్ జర్నల్ లాన్సెట్ నిర్వహించిన స్టడీలో ఈ షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి.
ది లాన్సెట్ గ్లోబల్ హెల్త్ జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, 2022లో భారతదేశంలోని దాదాపు 50శాతం మంది తగినంత వ్యాయామం చేయడం లేదు. కనీసం వారానికి 150 నిమిషాల ఫిజికల్ యాక్టివిటీ కూడా చేయట్లేదని తేలింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) సూచనల ప్రకారం, పద్దెనిమిదేళ్లు పైబడిన వారు(అడల్ట్స్) వారానికి 150 నిమిషాలు మోస్తరు ఫిజికల్ యాక్టివిటీ లేదంటే 75 నిమిషాలు తీవ్రమైన ఫిజికల్యాక్టివిటీ చేయాలి. దీన్ని ఆధారంగా చేసుకుని 2000-2022 మధ్యకాలంలో 197 దేశాల్లో లాన్సెట్ సర్వే చేసింది. దక్షిణాసియా ప్రాంతంలో మహిళల్లో తగినంత శారీరక శ్రమ లేకపోవడం పురుషుల కంటే సగటున 14శాతం ఎక్కువ. 42 శాతంగా పురుషులతో పోలిస్తే, తగిన శారీరక శ్రమ చేయని మహిళల సంఖ్య 57శాతంగా ఉంది.
అంతేకాదు 2000 సంవత్సరంలో 22శాతం భారతీయులు శారీరంగా దృఢంగా ఉండగా, 2010 నాటికి ఇది 34 శాతానికి, 2022 నాటికి 50 శాతానికి పెరిగిందని తెలిపింది. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే 2030 నాటికి ఇది 60 శాతం దాటుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచవ్యాప్తంగా, 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న స్త్రీపురుషులిరువురిలోనూ శారీరక శ్రమ పెరగడం గమనార్హం.
కాగా, ప్రపంచవ్యాప్తంగా 31.3 శాతం మంది పెద్దలు (18 ఏళ్లు పైబడిన వారు) ఫిజికల్లీ అన్ ఫిట్‌గా ఉన్నారని స్టడీలో తేలింది. ఈ విషయంలో ఫస్ట్ ప్లేస్‌లో ఆసియా పసిఫిక్ రీజియన్, రెండో స్థానంలో దక్షిణాసియా ఉందని లాన్సెట్ పరిశోధకులువెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment