physically
-
భారతీయుల్లో సగంమంది అన్‌ఫిట్టే! 60 ఏళ్లు పైబడినవారు బెటర్!
మన దేశంలో దాదాపు సగంమంది ఫిజికల్‌గా ఫిట్‌గా లేరట. భారతీయుల్లో 50 శాతం మంది శారీర శ్రమ అన్న ఊసే ఎత్తడం లేదని తేలింది. గ్లోబల్ హెల్త్ జర్నల్ లాన్సెట్ నిర్వహించిన స్టడీలో ఈ షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి.ది లాన్సెట్ గ్లోబల్ హెల్త్ జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, 2022లో భారతదేశంలోని దాదాపు 50శాతం మంది తగినంత వ్యాయామం చేయడం లేదు. కనీసం వారానికి 150 నిమిషాల ఫిజికల్ యాక్టివిటీ కూడా చేయట్లేదని తేలింది.ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) సూచనల ప్రకారం, పద్దెనిమిదేళ్లు పైబడిన వారు(అడల్ట్స్) వారానికి 150 నిమిషాలు మోస్తరు ఫిజికల్ యాక్టివిటీ లేదంటే 75 నిమిషాలు తీవ్రమైన ఫిజికల్యాక్టివిటీ చేయాలి. దీన్ని ఆధారంగా చేసుకుని 2000-2022 మధ్యకాలంలో 197 దేశాల్లో లాన్సెట్ సర్వే చేసింది. దక్షిణాసియా ప్రాంతంలో మహిళల్లో తగినంత శారీరక శ్రమ లేకపోవడం పురుషుల కంటే సగటున 14శాతం ఎక్కువ. 42 శాతంగా పురుషులతో పోలిస్తే, తగిన శారీరక శ్రమ చేయని మహిళల సంఖ్య 57శాతంగా ఉంది.అంతేకాదు 2000 సంవత్సరంలో 22శాతం భారతీయులు శారీరంగా దృఢంగా ఉండగా, 2010 నాటికి ఇది 34 శాతానికి, 2022 నాటికి 50 శాతానికి పెరిగిందని తెలిపింది. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే 2030 నాటికి ఇది 60 శాతం దాటుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచవ్యాప్తంగా, 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న స్త్రీపురుషులిరువురిలోనూ శారీరక శ్రమ పెరగడం గమనార్హం.కాగా, ప్రపంచవ్యాప్తంగా 31.3 శాతం మంది పెద్దలు (18 ఏళ్లు పైబడిన వారు) ఫిజికల్లీ అన్ ఫిట్‌గా ఉన్నారని స్టడీలో తేలింది. ఈ విషయంలో ఫస్ట్ ప్లేస్‌లో ఆసియా పసిఫిక్ రీజియన్, రెండో స్థానంలో దక్షిణాసియా ఉందని లాన్సెట్ పరిశోధకులువెల్లడించారు. -
ఉపకరణాలు అందించేందుకు వైద్యపరీక్షలు
జిల్లావ్యాప్తంగా 25 వరకు శిబిరాల నిర్వహణ ధవళేశ్వరం : ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు ఉపకరణాలు అందించేందుకు ఈ నెల 25 తేదీ వరకు జిల్లావ్యాప్తంగా వైద్యశిబిరాలు నిర్వహిస్తున్నట్టు సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టు ఆఫీసర్ టీవీఎస్ గంగాధర్ కుమార్, సర్వశిక్షా అభియాన్ ఐఈ కో ఆర్డినేటర్ వై.లక్ష్మణ్æకుమార్ తెలిపారు. ధవళేశ్వరం భవిత కేంద్రంలో బుధవారం ప్రత్యేక అవసరాలుగల విద్యార్థులకు ఉపకరణాలను అందించేందుకు వైద్యపరీక్షలు నిర్వహించారు. లక్ష్మణ్‌కుమార్ మాట్లాడుతూ బుధవారం నుంచి ఈ నెల 25వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని భవితా కేంద్రాల్లో వైద్యశిబిరాలు నిర్వహించి, ఉపకరణాలు అవసరమైన వారిని గుర్తిస్తామన్నారు. జిల్లావ్యాప్తంగా సుమారు 8,500 మంది ప్రత్యేక అవసరాలుగల చిన్నారులు ఉన్నారన్నారు. ఒకసారి ఉపకరణాలు తీసుకున్న వారు మూడేళ్ల తర్వాత మళ్లీ తీసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో రాజమహేంద్రవరం రూరల్ ఎంఈవో కె.నరసింహారెడ్డి, ఐఈఆర్టీలు గంటా సత్యనారాయణ, కె.కమలాకర్ పాల్గొన్నారు. కాగా.. వైద్యశిబిరాల సమాచారం కోసం ఆయా మండలాల ఎంఈవోలను సంప్రదించవచ్చు. వైద్యశిబిరాలు జరిగే తేదీలు 20–10–2016 : రాజోలు, ఏలేశ్వరం, బిక్కవోలు, కోరుకొండ 21–10–2016 : అడ్డతీగల, తుని, రావులపాలెం, మండపేట 22–10–2016 : అమలాపురం , పిఠాపురం, సామర్లకోట, చింతూరు, 24–10–2016 : పి.గన్నవరం, జగ్గంపేట, కరప, రంపచోడవరం, 25–10–2016 : కాకినాడ అర్బన్