ఉపకరణాలు అందించేందుకు వైద్యపరీక్షలు
జిల్లావ్యాప్తంగా 25 వరకు శిబిరాల నిర్వహణ
ధవళేశ్వరం : ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు ఉపకరణాలు అందించేందుకు ఈ నెల 25 తేదీ వరకు జిల్లావ్యాప్తంగా వైద్యశిబిరాలు నిర్వహిస్తున్నట్టు సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టు ఆఫీసర్ టీవీఎస్ గంగాధర్ కుమార్, సర్వశిక్షా అభియాన్ ఐఈ కో ఆర్డినేటర్ వై.లక్ష్మణ్æకుమార్ తెలిపారు. ధవళేశ్వరం భవిత కేంద్రంలో బుధవారం ప్రత్యేక అవసరాలుగల విద్యార్థులకు ఉపకరణాలను అందించేందుకు వైద్యపరీక్షలు నిర్వహించారు. లక్ష్మణ్‌కుమార్ మాట్లాడుతూ బుధవారం నుంచి ఈ నెల 25వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని భవితా కేంద్రాల్లో వైద్యశిబిరాలు నిర్వహించి, ఉపకరణాలు అవసరమైన వారిని గుర్తిస్తామన్నారు. జిల్లావ్యాప్తంగా సుమారు 8,500 మంది ప్రత్యేక అవసరాలుగల చిన్నారులు ఉన్నారన్నారు. ఒకసారి ఉపకరణాలు తీసుకున్న వారు మూడేళ్ల తర్వాత మళ్లీ తీసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో రాజమహేంద్రవరం రూరల్ ఎంఈవో కె.నరసింహారెడ్డి, ఐఈఆర్‌టీలు గంటా సత్యనారాయణ, కె.కమలాకర్ పాల్గొన్నారు. కాగా.. వైద్యశిబిరాల సమాచారం కోసం ఆయా మండలాల ఎంఈవోలను సంప్రదించవచ్చు.
వైద్యశిబిరాలు జరిగే తేదీలు
20–10–2016 : రాజోలు, ఏలేశ్వరం, బిక్కవోలు, కోరుకొండ
21–10–2016 : అడ్డతీగల, తుని, రావులపాలెం, మండపేట
22–10–2016 : అమలాపురం , పిఠాపురం, సామర్లకోట, చింతూరు,
24–10–2016 : పి.గన్నవరం, జగ్గంపేట, కరప, రంపచోడవరం,
25–10–2016 : కాకినాడ అర్బన్