camps
-
సిరియా: ఐసిస్ స్థావరాలపై అమెరికా దాడులు
న్యూయార్క్: సిరియాలోని ఐసిస్ స్థావరాలపై పలు వైమానిక దాడులు జరిపినట్లు అమెరికా వెల్లడించింది. తమ దాడులతో ఐసిస్ కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడుతుందని పేర్కొంది. ‘‘శనివారం ఉదయం ఐసిస్ క్యాంప్‌లపై అమెరికా సెంట్రల్ కమాండ్ బలగాలు వైమానిక దాలు చేశాం. ఈ దాడులు.. అమెరికా, దాని మిత్రదేశాలు , భాగస్వాములపై దాడులకు ప్లాన్ చేయటం, దాడుల నిర్వహించటం వంటి ఐసిస్ సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయి. ఈ దాడులుకు సంబంధించి సమాచారం అందిస్తాం’ అని అమెరికా పేర్కొంది. అయితే ఈ దాడుల్లో మృతుల సంఖ్య తదితర వివరాలు అమెరికా వెల్లడించకపోవటం గమనార్హం.U.S. Central Command conducts airstrikes against multiple ISIS camps in Syria. pic.twitter.com/i8Nqn1K97p— U.S. Central Command (@CENTCOM) October 12, 2024ఇటీవల కాలంలో సిరియాపై అమెరికా దాడులు చేయడం ఇది రెండోసారి. సెప్టెంబరు నెల చివరిలో ఐసిస్ స్థావరాలే టార్గెట్‌గా అమెరికా గగనతల దాడులు చేసింది. ఈ దాడుల్లో 37 మంది హతమైనట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. మృతి చెందిన వారంతా ఇస్లామిక్ స్టేట్ గ్రూప్, అల్‌ఖైదా అనుబంధ సంస్థలకు చెందినవారేనని పేర్కొంది. మృతుల్లో ఇద్దరు కీలక నేతలు కూడా ఉన్నట్లు వెల్లడించింది.చదవండి: అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఎలా జరుగుతాయి? -
అప్పటికప్పుడే... 10.86 లక్షల సమస్యలకు పరిష్కారం
సాక్షి, అమరావతి: ప్రజల సమస్యలను క్షేత్ర స్థాయిలో తక్షణమే తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జగనన్న సురక్ష క్యాంపుల్లో ఇప్పటివరకు 10.86 లక్షల ప్రజల సమస్యలు పరిష్కారమయ్యాయి. వీటిని ప్రజల నుంచి వినతులు అందిన వెంటనే అప్పటికప్పుడే.. అక్కడికక్కడే పరిష్కరించారు. రాష్ట్రంలో అన్ని గ్రామ, వార్డు సచివాలయాల వద్ద మండల స్థాయి అధికారుల ఆధ్వర్యంలో జగనన్న సురక్ష క్యాంపులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. నాలుగు రోజుల్లో బుధవారం వరకు మొత్తం 10,86,727 వినతులను అప్పటికప్పుడే, అక్కడికక్కడే క్యాంపుల్లో అధికారులు పరిష్కరించారు. ప్రతి సంక్షేమ పథకం, ప్రభుత్వ ఆఫీసుల్లో జారీ అయ్యే వివిధ రకాల ధ్రువీకరణ పత్రాల మంజూరు వంటివాటికి సంబంధించిన అర్హులు ఏ ఒక్కరూ మిగిలిపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వలంటీర్ల ఆధ్వర్యంలో ఇంటింటా అర్హులను జల్లెడ పట్టి.. వారికి ఆయా సేవలను అందజేస్తోంది. సచివాలయాలవారీగా 31 వరకు నిర్వహణ.. అన్ని గ్రామ, వార్డు సచివాలయాల వద్ద శనివారం (జూలై 1) నుంచి మొదలుపెట్టి ఈ నెల 31 వరకు ప్రభుత్వం క్యాంపులు నిర్వహిస్తోంది. ఇప్పటివరకు.. 1వ తేదీన 1,305 సచివాలయాల వద్ద, 3న 387 సచివాలయాల వద్ద, 4న 1,022 సచివాలయాల వద్ద, 5 (బుధవారం)న మరో 625 సచివాలయాల వద్ద క్యాంపులు పూర్తయినట్టు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ అధికారులు వెల్లడించారు. దాదాపు 36.30 లక్షల కుటుంబాలు నివాసం ఉండే పరిధిలో మొత్తం 3,339 సచివాలయాల వద్ద క్యాంపుల నిర్వహణ పూర్తయినట్టు తెలిపారు. ఈ సచివాలయాల పరిధిలో జరిగిన క్యాంపుల్లో వివిధ రకాల సమస్యలపై 13.10 లక్షల వినతులు అందాయి. ఇందులో 80 శాతానికి పైగా అంటే 10,86,727 వినతులను అధికారులు అప్పటికప్పుడే పరిష్కరించారు. వీటిలో హౌస్ హోల్డ్ లిస్టులో మార్పులుచేర్పులతోపాటు విద్యార్థులకు సంబంధించి ఆదాయ, కులధ్రువీకరణ పత్రాలు, కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డుల జారీ వంటివి ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు. ఇప్పటిదాకా జరిగిన క్యాంపుల్లో అందిన వినతుల్లో ఇంకా 2.22 లక్షలు పరిష్కరించాల్సి ఉందన్నారు. అవి కూడా ఆయా శాఖల అధికారుల పరిశీలనలో ఉన్నట్టు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ వర్గాలు తెలిపాయి. -
AP: రాష్ట్ర వ్యాప్తంగా ‘జగనన్న సురక్ష’ కార్యక్రమం ప్రారంభం
సాక్షి, అమరావతి: ప్రజల వినతులను సంతృప్త స్థాయిలో పరిష్కరించడం, ఏ ఒక్కరూ మిగిలిపోకుండా అర్హులందరికీ వివిధ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చే లక్ష్యంతో ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమానికి అనుబంధంగా చేపట్టిన ‘జగనన్న సురక్ష’ ద్వారా నేటి నుంచి సచివాలయాలవారీగా ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నారు. ►ఏపీ వ్యాప్తంగా ‘జగనన్న సురక్ష’ కార్యక్రమం ప్రారంభమైంది. సమస్యలు పరిష్కరించి లబ్ధిదారులకు సర్టిఫికెట్లు అందజేస్తున్నారు. లబ్ధిదారులకు సర్టిఫికెట్లు పంపిణీ చేస్తున్నారు ప్రజాప్రతినిధులు. ►తొలిరోజు జూలై 1వ తేదీన 1,306 సచివాలయాల పరిధిలో క్యాంపులు జరగనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. దీనికి సంబంధించి ఆయా సచివాలయాల పరిధిలోని వలంటీర్లు జూన్ 24వ తేదీనే ఇంటింటికీ వెళ్లి క్యాంపుల సమాచారాన్ని తెలియజేయడంతో పాటు ఆయా కుటుంబాల నుంచి వ్యక్తిగత వినతుల వివరాలను సేకరించారు. ►తొలిరోజు క్యాంపులకు సంబంధించి 14,29,051 కుటుంబాలకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ శుక్రవారం ఎస్ఎంఎస్ రూపంలో కూడా సమాచారాన్ని పంపింది. ►జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా నిర్వహించే ప్రత్యేక క్యాంపులకు సంబంధించి 11 రకాల ప్రధాన ధ్రువీకరణ పత్రాల జారీకి ఎలాంటి సర్విసు చార్జీలను వసూలు చేయరాదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ►జగనన్న సురక్ష కార్యక్రమం కింద జూలై 1వ తేదీ నుంచి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా 15,004 గ్రామ, వార్డు సచివాలయాల వద్ద నెల రోజుల పాటు నిర్దేశిత తేదీల్లో ప్రత్యేక క్యాంపుల నిర్వహణకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ►సచివాలయాల వద్ద మండల స్థాయి అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ప్రత్యేక క్యాంపులలో అందే వినతులను అత్యంత వేగంగా పరిష్కరించే లక్ష్యంతో ఏడు రోజుల ముందే దరఖాస్తులను స్వీకరించడంతోపాటు టోకెన్లను కూడా జారీ చేస్తున్నారు. ►శుక్రవారం సాయంత్రం వరకు 9.48 లక్షల టోకెన్లు జారీ కాగా 6.77 లక్షల వినతుల వివరాలను సచివాలయాల డిజిటల్ అసిస్టెంట్లు కంప్యూటర్లలో నమోదు చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అప్పటికప్పుడే పరిష్కారానికి అవకాశం ఉన్న 2.65 లక్షల వినతులకు సంబంధించి క్యాంపు నిర్వహణకు ముందే అధికారుల స్థాయిలో ఆమోద ప్రక్రియ పూర్తయ్యాయి. -
‘జగనన్న సురక్ష’ నేటి నుంచే..
సాక్షి, అమరావతి : అర్హులై ఉండి ఏ ఒక్కరూ లబ్ధి అందకుండా మిగిలిపోకూడదన్న తపన, తాపత్రయంతో ప్రతి ఇంట్లో ఏ చిన్న సమస్య ఉన్నా దానిని పరిష్కరించాలన్న చిత్తశుద్ధితో జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మరో ప్రతిష్టాత్మక కార్యక్రమం ‘జగనన్న సురక్ష’. రాష్ట్రవ్యాప్తంగా 15,004 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో నెలరోజులపాటు నిర్వహించే ఈ కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి లాంఛనంగా ప్రారంభిస్తారు. ఇంటింటికీ వెళ్లి జల్లెడ.. ఇప్పటికే రాష్ట్రంలో శాచ్యురేషన్ పద్ధతిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ మంచి చేసిన జగనన్న ప్రభుత్వం.. అర్హులై ఉండి ఏ కారణంతోనైనా ఇంకా ఎవరైనా మిగిలిపోతే వారికి కూడా సంక్షేమ పథకాలు అందాలన్న లక్ష్యంతో ఈ ‘జగనన్న సురక్ష‘ ద్వారా ఇంటింటినీ జల్లెడ పట్టనుంది. తద్వారా వారికి లబ్ధి చేకూర్చడంతో పాటు వారికింకేమైనా సర్టిఫికెట్లు (జనన, మరణ, కుల, సీసీఆర్సీ, రేషన్ కార్డు డివిజన్, హౌస్ హోల్డ్ డివిజన్, ఇన్కమ్ మొదలైన 11 రకాలు ధ్రువీకరణపత్రాలు) అవసరమైతే సర్వీస్ ఫీజు లేకుండా వాటిని ఉచితంగా అందించనుంది. కుల, మత, వర్గ, పార్టీలకు అతీతంగా.. లంచాలకు, వివక్షకు తావులేకుండా.. నూటికి నూరు శాతం సంతృప్త స్థాయిలో పారదర్శకంగా సంక్షేమ ఫలాలు అందించాలన్నదే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. దేశంలో ఎక్కడాలేని విధంగా ప్రతి ఇంటికీ వెళ్లి సమస్యలేమైనా ఉంటే తెలుసుకుని పరిష్కారం చూపించే దిశగా చేస్తున్న వినూత్న కార్యక్రమం ఈ ‘జగనన్న సురక్ష’. రేపటి నుంచి గృహ సందర్శన.. వలంటీర్లు, సచివాలయ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, జగనన్న మీద, జగనన్న ప్రభుత్వం మీద ప్రేమ, అభిమానం ఉన్న ఉత్సాహవంతులతో కూడిన టీమ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటినీ సందర్శిస్తుంది. అర్హులై ఉండి ఎక్కడైనా లబ్ధి అందని వారుంటే వారిని గుర్తించి సమస్య పరిష్కారానికి కావల్సిన పత్రాలు సేకరిస్తారు. వారికేమైనా కుల, ఆదాయ, జనన మొదలైన సర్టిఫికెట్లు అవసరమైతే వాటికి అవసరమైన పత్రాలను తీసుకుని దరఖాస్తులను దగ్గరుండి పూర్తిచేస్తారు. సమస్య పరిష్కారమయ్యే వరకు తోడుగా.. ఇలా తీసుకున్న దరఖాస్తులను సచివాలయానికి తీసుకెళ్లి వాటిని అక్కడ సమర్పించి, టోకెన్ నంబర్, సర్వీస్ రిక్వెస్ట్ నంబరు తీసుకుని వాటిని తిరిగి ఇంటి వద్దకే వెళ్లి అందజేస్తారు. ఈ క్యాంపులు ఎప్పుడు, ఎక్కడ నిర్వహిస్తారో ముందుగానే తెలియజేస్తారు. ఆ రోజు దగ్గరుండి క్యాంపు వద్దకు తీసుకెళ్తారు. సమస్య పరిష్కారమయ్యేలా వారికి తోడుగా ఉంటారు. జూలై 1 నుంచి క్యాంపులు.. మండల స్థాయి అధికారులైన తహశీల్దార్, ఈఓపీఆర్డీ ఒక టీమ్ కాగా.. ఎంపీడీఓ, డిప్యూటీ తహశీల్దార్ రెండో టీమ్‌గా ఏర్పడి సచివాలయంలో ఒకరోజు పూర్తిగా గడిపేలా చూస్తారు. జూలై 1 నుంచి ప్రతి సచివాలయంలో క్యాంపు నిర్వహించి అక్కడికక్కడే పథకాల సమస్యలను పరిష్కరించడంతోపాటు సేవా చార్జీలు లేకుండానే అవసరమైన సర్టిఫికెట్లను అందిస్తారు. సర్వీస్ ఫీజు లేకుండా సర్టిఫికెట్ల జారీ.. జనన, మరణ, కుల, ఆదాయ, కుటుంబ, వివాహ ధ్రువీకరణ పత్రాలు, లావాదేవీ మ్యుటేషన్లు, ఫోన్ నంబర్‌కు ఆధార్ అనుసంధానం, పంట సాగు కార్డులు, కొత్త రేషన్ కార్డు లేదా రేషన్ కార్డు విభజన, ప్రభుత్వ డేటాకు సంబంధించి కుటుంబ వివరాల్లో మార్పులు చేర్పులు వంటి 11 రకాల సర్టిఫికెట్లను ఉచితంగా జారీతో పాటు మరే ఇతర అవసరమైన సర్టిఫికెట్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం ‘జగనన్న సురక్ష’ కార్యక్రమంలో అందిస్తుంది. కార్యక్రమం వివరాలు.. రాష్ట్రంలోని 5.3 కోట్ల మంది పౌరులకు చేరువయ్యేలా 1.6 కోట్ల కుటుంబాలను సందర్శిస్తూ, జూలైæ 1 నుంచి∙ఈ కార్యకమం నిర్వహిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 15,004 సురక్ష క్యాంపులు జరుగుతాయి. ఇందులో 1.5 లక్షల మంది గ్రామ, వార్డు సచివాలయ ప్రభుత్వోద్యోగులు, 2.6 లక్షల మంది వలంటీర్లు పాల్గొంటారు. ఇక 26 జిల్లాలకు 26 మంది ప్రత్యేక ఐఏఎస్ అధికారులు, ఆయా జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఇతర అధికారులు ఈ క్యాంపులను తనిఖీ చేస్తారు. ప్రోగ్రాం పురోగతిపై జిల్లా కలెక్టర్లు రోజువారీ సమీక్ష నిర్వహిస్తారు. అలాగే, సీఎం కార్యాలయ అధికారులు ఈ కార్యక్రమంపై వారం వారం సమీక్ష నిర్వహిస్తారు. ‘1902’తో హెల్ప్ డెస్క్ ఏర్పాటు వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు, జగనన్న మీద, జగనన్న ప్రభుత్వం మీద ప్రేమ, అభిమానం ఉన్న ఉత్సాహవంతులు ఇళ్లను సందర్శించినప్పుడు ఇంటి యజమాని ఇంటివద్ద లేకపోయినప్పటికీ వారికి సమీపంలో క్యాంపు జరిగే రోజు నేరుగా అక్కడకు వెళ్లినట్లయితే వలంటీర్లతో కూడిన ఈ టీమ్ ‘1902’ హెల్ప్‌డెస్క్ ద్వారా అవసరమైన సహాయం అందిస్తుంది. ఇక గ్రామంలో.. సచివాలయ పరిధిలో ఏ రోజు ఈ కార్యక్రమం జరుగుతుందో తెలుసుకోవాలంటే టోల్ ఫ్రీ నంబర్ ‘1902’ కి కాల్ చేయాలి. లేదా https://vswsonline.ap.gov.in/#/home వెబ్‌సైట్‌ను సందర్శించాలి. -
1 నుంచి ‘సచివాలయాల’ వద్ద ప్రత్యేక క్యాంపులు
సాక్షి, అమరావతి: జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా జూలై 1 నుంచి అన్ని గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రత్యేక క్యాంపుల్లో ప్రధానంగా 11 రకాల సేవలు, ధ్రువీకరణ పత్రాల జారీకి ఎలాంటి సర్విసు చార్జీలు వసూలు చేయకూడదని నిర్ణయం తీసుకుంది. నాలుగు వారాల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ‘జగనన్నకు చెబుదాం’కు అనుబంధంగా అన్ని రకాల ప్రజా వినతులను సంతృప్త స్థాయిలో పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. దీని నిర్వహణకు సంబంధించి గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ మంగళవారం విధివిధానాలతో కూడిన ఉత్తర్వులను జారీ చేశారు. తహసీల్దార్, ఎంపీడీవోలతో సహా వివిధ మండల స్థాయి అధికారుల ఆధ్వర్యంలో జూలై 1 నుంచి సచివాలయాల వారీగా ఈ ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తామని తెలిపారు. వలంటీర్లతో పాటు సచివాలయాల సిబ్బంది ఈ నెల 24 నుంచే ఇంటింటికీ వెళ్లి ఈ కార్యక్రమం గురించి వివరిస్తారు. అంతేకాకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వివిధ రకాల వ్యక్తిగత ధ్రువీకరణ పత్రాల జారీకి వినతులను కూడా సేకరిస్తారు. క్యాంపుల నిర్వహణ సమయంలో వినతుల స్వీకరణ, పరిష్కారం కోసం రిజిస్ట్రేషన్, వెరిఫికేషన్, సర్విసు రిక్వెస్టు డెస్‌్కలను వేర్వేరుగా ఏర్పాటు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే ఆయా డెస్‌్కల్లో మండల స్థాయి అధికారులు, సచివాలయాల సిబ్బంది నిర్వహించాల్సిన బాధ్యతలను కూడా పొందుపరిచారు. ♦ గ్రామ సచివాలయాల వద్ద ప్రత్యేక క్యాంపుల నిర్వహణ కోసం మండలాల వారీగా ఎంపీడీవో, తహసీల్దార్ల ఆధ్వర్యంలో రెండు వేర్వేరు బృందాలను ఏర్పాటు చేస్తారు. ప్రతి బృందంలో ముగ్గురేసి మండల స్థాయి అధికారులు ఉంటారు. ఒక మండల పరిధిలో 24 కంటే ఎక్కువగా సచివాలయాలు ఉంటే అవసరమైన పక్షంలో మూడో బృందాన్ని ఏర్పాటు చేసుకునే వెసులుబాటును స్థానిక అధికారులకే అప్పగించారు. ♦ అత్యధిక వార్డు సచివాలయాలు ఉండే నగరాలు, పట్టణాల్లో దగ్గరగా ఉండే సచివాలయాలను క్లస్టర్‌గా వర్గీకరిస్తారు. ఆ క్లస్టర్ల వారీగా క్యాంపులు నిర్వహిస్తారు. అయితే, క్లస్టర్ పరిధిని గరిష్టంగా ఐదు వార్డు సచివాలయాలకే పరిమితం చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ♦ క్యాంపుల పర్యవేక్షణకు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ప్రత్యేక అధికారులను జిల్లా కలెక్టర్లు నియమిస్తారు. ♦ గ్రామీణ ప్రాంతాల్లో ఆయా గ్రామ సచివాలయాల భవనాల్లోనే ఈ క్యాంపులు నిర్వహించాలని పేర్కొన్నారు. అద్దె భవనాల్లో సచివాలయం ఉంటే ఇతర ప్రభుత్వ భవనాల్లో క్యాంపులు నిర్వహిస్తారు. ♦ ఏ రోజు ఏ సచివాలయం పరిధిలో క్యాంపు నిర్వహిస్తున్నారో ముందస్తుగా అందరికీ తెలిసేలా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొనే సిబ్బంది, వలంటీర్లకు ముందస్తుగా శిక్షణ ఇవ్వాలని సూచించారు. సచివాలయాల వద్ద నిర్వహించే క్యాంపుల్లో ఈ 11 సర్వీసులకు ఎలాంటి సర్విసు చార్జీలు ఉండవని ప్రభుత్వం పేర్కొంది. అయితే, మ్యుటేషన్ ఆఫ్ ట్రాన్సాక్షన్‌కు సంబంధించి పాస్ పుస్తకాల జారీకి దరఖాస్తుదారులు చెల్లించాల్సిన స్టాట్యుటరీ చార్జీలను మాత్రం వసూలు చేస్తారు. సర్వీసు చార్జీలు లేకుండా అందజేసే సేవలివే.. ♦ ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్లు (కుల, నివాస ధ్రువీకరణ పత్రాలు) ♦ ఆదాయ ధ్రువీకరణ పత్రం ♦ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ ♦ మరణ ధ్రువీకరణ పత్రం ♦ మ్యుటేషన్ ఫర్ ట్రాన్సాక్షన్ (భూకొనుగోలు అనంతరం ఆన్లైన్లో నమోదు), మ్యుటేషన్ ఫర్ కరక్షన్స్ (ఆన్లైన్లో భూవివరాల నమోదులో మార్పులు చేర్పులు) ♦ వివాహ ధ్రువీకరణ పత్రం (పట్టణ ప్రాంతాల్లో 90 రోజుల్లోగా, గ్రామీణ ప్రాంతాల్లో 60 రోజుల్లోపు) ♦ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు ♦ ఆధార్‌కార్డులో మొబైల్ నంబర్ అప్డేట్ ♦ కౌలు గుర్తింపు కార్డులు (సీసీఆర్సీ) ♦ కొత్త రేషన్‌కార్డు లేదా రేషన్‌కార్డు విభజన ♦ ప్రభుత్వ డేటాకు సంబంధించి కుటుంబ వివరాల్లో కొంత మంది సభ్యుల పేర్ల తొలగింపు. -
ఉచితంగా ఆధార్ అప్డేట్.. వారికి మాత్రమే ఛాన్స్..!
సాక్షి, అమరావతి: ఆధార్ అప్డేట్ సేవలను ఉచితంగా అందిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. అయితే, ఆన్లైన్లో సొంతగా ఆధార్ వివరాలను అప్డేట్ చేసుకునేవారికి మాత్రమే ఈ వెసులుబాటు కల్పించినట్లు వెల్లడించింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల పేర్లతో ప్రతి ఒక్కరూ తమ ఆధార్‌ను అప్డేట్ చేసుకునేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఇందుకోసం యూఐడీఏఐ ప్రమాణాలకు అనుగుణంగా ధ్రువీకరణపత్రాల జారీకి ఏర్పాట్లు చేయాలని సూచించింది. ఈ మేరకు ఆధార్ కార్డుల జారీ సంస్థ అయిన యూఐడీఏఐ హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం డిప్యూటీ డైరెక్టర్ జనరల్ పి.సంగీత ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.జవహర్‌రెడ్డికి లేఖ రాశారు. ప్రతి ఒక్కరూ పదేళ్లకు ఒకసారి అయినా ఆధార్ కార్డులోని తమ వివరాలను అప్డేట్ చేసుకోవాలని యూఐడీఏఐ ఇటీవల నిబంధన తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దానిప్రకారం ఆన్లైన్లో సొంతగా ఆధార్ వివరాలను అప్డేట్ చేసుకునేవారికి ఉచితంగా సేవలు అందిస్తారు. ఆధార్ సెంటర్లకు వెళ్లి అప్డేట్ చేసుకునేవారు మాత్రం యథావిధిగా నిర్ణీత ఫీజు చెల్లించాలి. మరోవైపు ఈ నెల 15 నుంచి జూన్ 14వ తేదీ వరకు మాత్రమే ఉచిత సేవలు లభిస్తాయని యూఐడీఏఐ వేరుగా డిజిటల్ మీడియాలో ప్రచారం చేస్తోంది. అప్డేట్ చేసుకోవాల్సినవారు 1.56 కోట్ల మంది! ఆధార్ కార్డు తీసుకుని పదేళ్లు అయినా ఇప్పటికీ ఒక్కసారి కూడా తమ చిరునామా, ఫొటో ధ్రువీకరణ వంటి వివరాలు అప్డేట్ చేసుకోనివారు రాష్ట్రంలో 1.56కోట్ల మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రాష్ట్రంలో 2022, డిసెంబరు 31 నాటికి 5,19,98,236 మందికి ఆధార్ కార్డులు జారీ అయ్యాయి. వారిలో 1.56కోట్ల మంది కొత్త నిబంధన ప్రకారం తమ ఆధార్‌లో వివరాలను అప్డేట్ చేసుకోవాల్సి ఉందని అధికారులు తెలిపారు. నేటి నుంచి ప్రత్యేక ఆధార్ క్యాంపులు ప్రతి ఒక్కరూ తమ ఆధార్ వివరాలను అప్డేట్ చేసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ఐదు రోజులు ప్రత్యేక క్యాంపులను నిర్వహిస్తోంది. ఆధార్ సేవలు అందుబాటులో ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ఈ నెల 20, 21, 27, 28, 29 తేదీల్లో ప్రత్యేక క్యాంపులను నిర్వహించాలని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ సాగిలి షన్మోహన్ అన్ని జిల్లాల కలెక్టర్లు, సచివాలయాల శాఖ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. గ్రామ, వార్డు సచివాలయాలు లేదా స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండే ప్రాంతాల్లో ఈ క్యాంపులు నిర్వహించాలని సూచించారు. ఆధార్ క్యాంపుల సమాచారాన్ని ఆయా ప్రాంత ప్రజలందరికీ తెలిసేలా ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ క్యాంపులు ఏర్పాటుచేసిన ప్రాంతాల్లోని వలంటీర్లు తమ పరిధిలో 2014కు ముందు ఆధార్ కార్డులు పొంది ఇప్పటివరకు అప్డేట్ చేసుకోనివారిని గుర్తించి వారికి ప్రత్యేక ఆధార్ క్యాంపుల గురించి తెలియజేయాలని సూచించినట్లు అధికారులు తెలిపారు. చదవండి: ‘స్కిల్’ సూత్రధారి బాబే -
రేపటి నుంచి ఏపీ సచివాలయాల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులు
-
తెలంగాణ బీజేపీ నేతలకు శిక్షణ తరగతులు ప్రారంభం
-
శ్రీలంకలో కీలక పరిణామం.. 4 నెలల తర్వాత అలా!
కొలంబో: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఇబ్బందులు పడుతోంది శ్రీలంక. నిత్యావసరాలు, ఇంధన ధరలు ఆకాశాన్నంటిన నేపథ్యంలో ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది. అధ్యక్షుడు, ప్రధాని భవనాలను వేలాది మంది ముట్టడించటంతో అప్పటి ప్రభుత్వం కూలిపోయింది. కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. నిరసనలు మొదలైన నాలుగు నెలల తర్వాత కీలక పరిణామం చోటు చేసుకుంది. అధ్యక్షుడి భవనం సమీపంలోని ప్రధాన నిరసన క్యాంపును ఎత్తివేస్తున్నట్లు బుధవారం ప్రకటించారు నిరసనకారులు. దేశ రాజధాని, గాలేఫోస్ సీఫ్రంట్‌లోని టెంట్లను తొలగిస్తున్నట్లు యూనివర్సిటీ విద్యార్థులు, లెఫ్ట్ పార్టీల నేతృత్వంలోని బృందం తెలిపింది. స్థానిక హోటళ్లకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని, టెంట్లను తొలగించాలని పోలీసులు ఇచ్చిన ఆదేశాలకు వ్యతిరేకంగా కోర్టులో దాఖలు చేసిన 4 పిటిషన్లను సైతం ఉపసంహరించుకుంటున్నట్లు నిరసనకారుల ప్రతినిధి తెలిపారు. ఇప్పటికే నిరసనకారుల టెంట్లను తొలగిస్తున్న వీడియోలు బయటకు వచ్చాయి. ఆర్థిక సంక్షోభంతో నిత్యావసరాలు, ఇంధనం, ఆహార కొరత ఏర్పడటంతో ఏప్రిల్ 9న నిరసనలు ప్రారంభమయ్యాయి. కొద్ది రోజుల్లోనే ఉద్యమం ఉధృతంగా మారింది. జులై 9న అప్పటి అధ్యక్షుడు గొటబయ రాజపక్స నివాసంలోకి వందల మంది నిరసనకారులు చొరబడ్డారు. దాంతో గొటబయ దేశం విడిచి పారిపోయారు. అనంతరం తన పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత అధ్యక్ష భవనం, నివాసాలను నిరసనకారులు ఖాళీ చేశారు. పోలీసుల దాడుల్లో సుమారు 80 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ నిరసనల్లో ఇప్పటి వరకు పదుల సంఖ్యలో ఆందోళనకారులు అరెస్టయ్యారు. అంతర్జాతీయంగా వచ్చిన వ్యతిరేకతో వాణిజ్యం సంఘం అగ్రనేత జోసెఫ్ స్టాలిన్‌ను గత సోమవారం విడుదల చేశారు. మరోవైపు.. గొటబయ రాజపక్స వారసుడిగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు రణీల్ విక్రమ సింఘే. దేశంలో మళ్లీ నిరసనలు జరగకుండా అత్యవసర పరిస్థితి విధించారు. ఎవరైనా అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదీ చదవండి: Gotabaya Rajapaksa: థాయ్‌లాండ్ చెక్కేసిన శ్రీలంక మాజీ అధ్యక్షుడు -
ఇక శివారులో శిబిరాలు
సాక్షి, హైదరాబాద్: శాసనమండలి స్థానిక సంస్థల కోటా ఎన్నిక కోసం ముందు జాగ్రత్తగా టీఆర్ఎస్ పార్టీ ఇతర రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన క్యాంపులకు వెళ్లిన ఓటర్లు, హైదరాబాద్ శివారులో జిల్లాల వారీగా ఏర్పాటు చేసిన శిబిరాలకు చేరుకుంటున్నారు. బుధవారం రాత్రికల్లా వీరంతా తమ శిబిరాలకు చేరుకుంటారు. ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు వీటిని పర్యవేక్షిస్తున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధ, గురువారాల్లో జిల్లాల వారీగా ఓటర్లతో ఏర్పాటు చేసే సమావేశాల్లో పాల్గొని పోలింగ్‌పై అవగాహన కల్పించడంతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశా నిర్దేశం చేస్తారు. బృందాలుగా పోలింగ్ కేంద్రాలకు.. విశ్వసనీయ సమాచారం మేరకు.. ఈ నెల 10న పోలింగ్ జరిగే ఆరు స్థానిక కోటా స్థానాలకు సంబంధించిన ఓటర్లను బృందాలుగా సంబంధిత జిల్లాల్లోని పోలింగ్ కేంద్రాలకు తరలిస్తారు. మెదక్, ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థులు, నల్లగొండ, ఆదిలాబాద్‌తో పాటు కరీంనగర్ జిల్లాలోని రెండు స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉండటంతో టీఆర్ఎస్ తమ పార్టీ అభ్యర్థులకు అనుకూలంగా పోలింగ్ జరిగేలా జాగ్రత్తలూ తీసుకుంటోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు స్థానాలు ఉండటంతో ఏ ఒక్క స్థానం చేజారకుండా చూసేందుకు ఇక్కడి ఓటర్లను బెంగళూరు, మైసూరు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్యాంపులకు తరలించిన విషయం తెలిసిందే. సుమారు వారం రోజులుగా ఈ క్యాంపు లో ఉన్న ఓటర్లు.. మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ నేతృత్వంలో మంగళవారం తిరుమల దర్శనం అనంతరం హైదరాబాద్‌కు తిరుగుముఖం పట్టారు. బుధవారం ఉదయం శామీర్‌పేటలోని తమ బసకు చేరుకున్న అనంతరం ఓటర్లుగా ఉన్న పార్టీ ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లతో కేటీఆర్ భేటీ అవుతారు. మెదక్ జిల్లాకు చెందిన ఓటర్లను ఢిల్లీలోని శిబిరానికి తరలించగా, వారు ఆగ్రా, జైపూర్ పర్యటన ముగిం చుకుని బుధవారం హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. గోవా శిబిరంలో ఉన్న ఖమ్మం జిల్లా ఓటర్లు కూడా మంత్రి పువ్వాడ అజయ్ నేతృత్వంలో బృందాలుగా బుధవారం ఉదయానికి హైదరాబాద్‌కు చేరుకుంటారు. నల్లగొండ, ఆదిలాబాద్ జిల్లా కు చెందిన ఓటర్లతో టీఆర్ఎస్ పార్టీ క్యాంపులు ఏర్పాటు చేయనప్పటికీ, వారిని కూడా బుధవారం హైదరాబాద్‌కు తరలించాలని సంబంధిత జిల్లా మంత్రులకు ఆదేశాలు వెళ్లాయి. -
కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విచిత్ర పరిస్థితి
సాక్షి, కరీంనగర్: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక మరో మలుపు తిరిగింది. అధికార పార్టీతోపాటు ప్రతిపక్ష పార్టీ సైతం క్యాంపులకు శ్రీకారం చుట్టింది. ఉన్న కొద్దిపాటి ఓట్లు చీలిపోకుండా.. అధికార పార్టీ వైపునకు ఆకర్షితులవకుండా కాంగ్రెస్ పార్టీ తాజా క్యాంపులకు శ్రీకారం చుట్టింది. తాజాగా మంథని నియోజవర్గం నుంచి పలువురు స్థానిక ప్రజాప్రతినిధులను హైదరాబాద్ తరలించేందుకు సిద్ధపడ్డారు. ఇప్పటికే మంథని నుంచి దాదాపు 40 మంది వరకు ప్రజాప్రతినిధులను హైదరాబాద్‌కు తరలించారు. ఉమ్మడిజిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ జయశంకర్ జిల్లా అధ్యక్షుడు ఐత ప్రకాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఓ రిసార్ట్‌కు తరలివెళ్లారని సమాచారం. ఓట్లు చీల్చడమే లక్ష్యం..! మరోవైపు అధికార టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే దాదాపు 1000 మంది తమ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులను కుటుంబ సభ్యులతో సహా.. బెంగళూరుకు తరలించిన విషయం తెలిసిందే. ఈ క్యాంపుల్లో ప్రజాప్రతినిధుల స్థితిగతులను జిల్లా మంత్రులు ఎప్పటికపుడు పర్యవేక్షిస్తున్నారు. ఈలోపు ఉమ్మడిజిల్లాకు చెందిన మాజీమంత్రి శ్రీధర్‌బాబు కూడా తమ పార్టీ ఉనికిని బలంగా చాటుకునేయత్నంలో భాగంగా కాంగ్రెస్ నేతలను క్యాంపులకు పంపడం విశేషం. కాంగ్రెస్ అభ్యర్థిని పోటీలో పెట్టకపోయినా.. అధికార పార్టీ విజయావకాశాలను దెబ్బతీయగలం అనే నమ్మకం రావడంతోనే అధిష్టానం ఈ అనూహ్య నిర్ణయం తీసుకుందని సమాచారం. తొలుత ఉమ్మడి జిల్లాకు చెందిన ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు నియోజకవర్గ పరిధిలోని నేతలు, అంటే ఉమ్మడి జిల్లా తూర్పు ప్రాంతమైన మంథని, జయశంకర్ భూపాలపల్లి జిల్లా నేతలు, తరువాత జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్ పరిధిలోని మొత్తం 13 నియోజకవర్గాలకు చెందిన నేతలు హైదరాబాద్‌కు రావాలని కాంగ్రెస్ అధిష్టానం ఆదేశించిందని తెలిసింది. సోషల్ మీడియాకే పరిమితం కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్సీగా పోటీ చేసే అభ్యర్థులు ఎల్.రమణ, భానుప్రసాద్‌రావు, రవీందర్‌సింగ్, ప్రభాకర్‌రెడ్డి, సత్యనారాయణ తదితరులు ఇక్కడ ప్రచారం చేస్తున్నారు. విచిత్రంగా వీరి మాటలు వినాల్సిన ఓటర్లయిన నేతలు మాత్రం శిబిరాల్లో ఉన్నారు. దీంతో సదరు అభ్యర్థులంతా కేవలం విలేకరుల సమావేశాలు, ప్రతిపక్ష నేతల ప్రసన్నాలు, సమావేశాలు, సోషల్ మీడియాలో ప్రచారాలకే పరిమితమవుతున్నారు. ఓటర్లు లేకుండా జిల్లాలో జరిగిన తొలి ఎన్నికలు ఇవేనని, ఇలాంటి విచిత్ర పరిస్థితిని మునుపెన్నడూ చూడలేదని పలువురు సీనియర్ రాజకీయ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. -
మావోయిస్టుల పలాయనం
బరంపురం: కొందమాల్ జిల్లాలో రెండు రోజులుగా మావోయిస్టులు, సీఆర్పీఎఫ్, ఎస్ఓజీ జవాన్ల మధ్య రెండు వేర్వేరు అటవీ ప్రాంతాల్లో జరిగిన ఎదురు కాల్పుల సంఘటనలలో రెండు మావోయిస్టుల శిబిరాలను పూర్తిగా ధ్వంసం చేసి భారీగా సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు కొందమాల్ ఎస్పీ వినీత్ అగర్వాల్ తెలియజేశారు. శనివారం సాయంత్రం జిల్లా హెడ్‌క్వార్టర్ పుల్బణిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వినీత్ అగర్వాల్ మాట్లాడుతూ జిల్లాలోని బల్లిగుడ పోలీస్‌స్టేషన్ పరిధి కలహండి జిల్లా సరిహద్దు పంగిబాజు అటవీ ప్రాంతంలో గురువారం మావోయిస్టులు, ఎస్ఓజీ, సీఆర్పీఎఫ్ జవాన్ల మధ్య హోరాహోరీగా ఎదురు కాల్పులు జరగడంతో తాళలేక మావోయిస్టులు తప్పించుకున్నారు. పంగిబాజు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు విడిచి వెళ్లిన శిబిరాన్ని పోలీసులు ధ్వంసం చేసి భారీగా మావోయిస్టు సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అలాగే శుక్రవారం తుమ్ముడిబొంద పోలీస్ స్టేషన్ పరిధిలో గల బురానహి దక్షిణ రిజర్వ్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పులతో తట్టుకోలేక మావోయిస్టులు తప్పించుకున్నట్లు చెప్పారు. బురానహి దక్షిణ రిజర్వ్ శిబిరాన్ని వీడి మావోయిస్టులు పారిపోవడంతో పోలీసులు శిబిరాన్ని ధ్వంసం చేశారు. అయితే వేర్వేరు కాల్పుల సంఘటనలలో మావోయిస్టులు ఎవరూ మృతి చెందలేదని తెలియజేశారు. తప్పించుకున్న మావోయిస్టుల శిబిరంలో సిపిఐ మావోయిస్టు కేంద్ర కమిటీ నాయకుడు మురళి ఉన్నట్లు ఎస్పీ తెలియజేశారు. మావోయిస్టులు వీడి పారిపోయిన శిబిరాల్లో భారీ విస్ఫోటక సామగ్రితో పాటు మూడు విదేశీ తుపాకులు, రెండు ప్లాస్టిక్ పెట్టెలు, ఔషధాలు, ప్లాస్టిక్ కవర్లు, విప్లవ సాహిత్యం, మావోయిస్టు దుస్తులు, వాటర్ బాటిల్స్, విద్యుత్ తీగలు, సిరంజిలు, నిత్యావసర సామగ్రి ఉన్నట్లు ఎస్పీ వివరించారు. కొనసాగుతున్న కూంబింగ్ కొందమాల్–కలహండి జిల్లాల సరిహద్దులకు మోహరించిన అదనపు బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. స్థాని క పోలీసుల సహకారంతో మావోయిస్టుల అచూకీ కోసం దట్టమైన అటవీ ప్రాంతాల్లో ముమ్మరంగా గాలిస్తున్నారు. -
క్యాంప్‌లు షురూ
ప్రాదేశిక ఫలితాలు వెల్లడయ్యాయి. ప్రలోభ పర్వానికి తెరలేచింది. మండల పరిషత్ పీఠాలే లక్ష్యంగా రాజకీయాలు ఊపందుకున్నాయి. టీఆర్ఎస్దే ఆధిక్యం అయినప్పటికీ.. కాంగ్రెస్ సైతం పట్టవదలకుండా ప్రయత్నాలు సాగిస్తోంది. ఈ క్రమంలో అటు కారు, ఇటు హస్తం నేతలు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పలు మండలాలకు సంబంధించిన ఎంపీటీసీ సభ్యులను క్యాంప్‌లకు తరలించారు. అంతేకాదు.. పలు మండలాల్లో ఎంపీపీ పీఠంపై టీఆర్ఎస్లో ద్విముఖ పోటీ నెలకొంది. ఈ క్రమంలో ఎవరికి వారు వేర్వేరుగా క్యాంప్ రాజకీయాలకు తెరలేపినట్లు సమాచారం.ప్రధానంగా నర్సాపూర్, నార్సింగి, తూప్రాన్, వెల్దుర్తి మండలాలకు సంబంధించి ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడం.. స్వతంత్రులే కీలకం కావడంతో అందరి దృష్టి వీటిపైనే కేంద్రీకృతమైంది. సాక్షి, మెదక్ : జిల్లాలో 20 ఎంపీపీ స్థానాలు ఉండగా.. మెజార్టీ స్థానాల్లో టీఆర్ఎస్ ఎంపీటీసీ అభ్యర్థులే గెలుపొందారు. అల్లాదుర్గం, చిలప్‌చెడ్, హవేళి ఘణాపూర్, కౌడిపల్లి, కొల్చారం, మనో హరాబాద్, మెదక్, నిజాంపేట, పాపన్నపేట, రామాయంపేట, పెద్దశంకరంపేట, శివ్వంపేట పరిధిలో ‘కారు’కే స్పష్టమైన ఆధిక్యత లభిం చింది. ఈ 12 మండలాల్లో ఎంపీపీ స్థానాలు టీఆర్ఎస్కే దక్కుతాయనేది సుస్పష్టం. చేగుంట మండలానికి సంబంధించి మొత్తం 13 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. టీఆర్ఎస్ అభ్యర్థులునలుగురు, స్వతంత్ర అభ్యర్థులు తొమ్మిదిమంది గెలుపొందారు. స్వతంత్రులంతాటీఆర్ఎస్ రెబల్స్ కావడం విశేషం. ఈ లెక్కన చేగుంట ఎంపీపీ పీఠం టీఆర్ఎస్ ఖాతాలో చేరే అవకాశం ఉంది. రేగోడు, చిన్న శంకరంపేట, టేక్మాల్ మండలాల పరిధిలో కాంగ్రెస్‌కే అధిక సంఖ్యలో ఎంపీటీసీ స్థానాలు దక్కాయి. ఈ మూడు మండలాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకోకుంటే ఎంపీపీ స్థానాలు కాంగ్రెస్‌వే. రసకందాయంలో నాలుగు పీఠాలు నర్సాపూర్, నార్సింగి, తూప్రాన్, వెల్దుర్తి మండలాల్లో ఎంపీపీ పీఠాలపై అస్పష్టత నెలకొంది. పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో ఈ నాలుగు పీఠాలు రసకందాయంలో పడ్డాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు ఎవరికి వారు తీవ్రంగా యత్నిస్తుండడంతో నాటకీయ పరిణా మాలు చోటుచేసుకుంటున్నాయి. నార్సింగికి సంబంధించి మొత్తం ఐదు ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. టీఆర్ఎస్ రెండు, కాంగ్రెస్ ఒకటి, స్వతంత్ర అభ్యర్థులు ఇద్దరు గెలుపొందారు. స్వతంత్రులు ఎటు మొగ్గు చూపితే వారే ఎంపీపీ పీఠాన్ని దక్కించుకోనున్నారు. ఇక్కడ టీఆర్ఎస్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తూప్రాన్‌లో ఐదు ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. కాంగ్రెస్ రెండు, టీఆర్ఎస్ ఒకటి, స్వతంత్రులు ఇద్దరు గెలుపొందారు. ఇక్కడ స్వతంత్రులు కీలకం కానున్నారు. వెల్దుర్తిలో 12 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. కాంగ్రెస్ ఐదు, టీఆర్ఎస్ నాలుగు, స్వతంత్రులు ముగ్గురు విజయం సాధించారు. ఇండిపెండెంట్లు ముగ్గురు మూకుమ్మడిగా ఎటు మొగ్గు చూపుతారో.. వారే ఎంపీపీ పీఠాన్ని కైవసం చేసుకోనున్నారు. ఎంపీపీ పీఠాలు ఇలా.. మెదక్ నియోజకవర్గ పరిధిలోని మెదక్ ఎంపీపీ జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. దీని పరిధిలో మొత్తం ఏడు ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఐదింటిలో టీఆర్ఎస్, రెండింటిలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. టీఆర్ఎస్కు స్పష్టమైన ఆధిక్యం రాగా.. ఎంపీపీకి ప్రధానంగా ర్యాలమడుగు నుంచి పోటీ చేసిన యమున జయరాంరెడ్డి పేరు వినపడుతోంది. ఈ మేరకు ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డిని కలిసి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. హవేళిఘనాపూర్ ఎంపీపీ జనరల్‌కు రిజర్వ్ అయింది. దీని పరిధిలో 12 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. 11 స్థానాల్లో టీఆర్ఎస్.. ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. టీఆర్ఎస్కే ఆధిక్యం ఉండగా.. ఆ పార్టీ నుంచి ప్రధానంగా ఇద్దరు ఎంపీపీ పీఠానికి పోటీపడుతున్నారు. కూచన్‌పల్లికి చెందిన శేరి నారాయణరెడ్డి, తొగిటకు చెందిన మాణిక్‌రెడ్డి మధ్య పోటీ ఉన్నట్లు తెలుస్తోంది. శేరి నారాయణరెడ్డి స్వయానా ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన శేరి సుభాష్‌రెడ్డి సోదరుడు కాగా.. మాణిక్‌రెడ్డి టీఆర్ఎస్ జిల్లా నాయకుడు, రాజకీయ అనుభవం ఉంది. ఈ క్రమంలో ఎంపీపీ పీఠం కోసం ఎవరికి వారు ముమ్మరంగా యత్నిస్తున్నట్లు తెలిసింది. ఇద్దరు టీఆర్ఎస్కే చెందినప్పటికీ ఈ పదవి ఎవరిని వర్తిస్తుందనే అంశం జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. శివ్వంపేట ఎంపీపీ స్థానం ఓసీ జనరల్‌కు రిజర్వ్ అయింది. దీని పరిధిలో 12 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. టీఆర్ఎస్ పది, స్వతంత్రులు ఇద్దరు విజయం సాధించారు. శివ్వంపేట నుంచి ఎంపీటీసీగా విజయం సాధించిన తాజామాజీ ఎంపీపీ కల్లూరు హరికృష్ణ మరోసారి పీఠాన్ని అధిరోహించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈయనకు పార్టీ అధిష్టానం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ మేరకు ఎంపీటీసీ సభ్యులను క్యాంప్‌నకు తరలిలించినట్లు తెలిసింది. మరోవైపు కొత్తపేట, పాంబండ ఎంపీటీసీ సభ్యులు సత్తిరెడ్డి, రమాకాంత్‌రెడ్డి సైతం ఎంపీపీ పదవిని చేజిక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు వినికిడి. కొల్చారం ఎంపీపీ పదవి బీసీ మహిళకు రిజర్వ్ అయింది. 10 ఎంపీటీసీ స్థానాలో ఏడు టీఆర్ఎస్.. ముగ్గురు స్వతంత్రులు విజయం సాధించారు. టీఆర్ఎస్కే ఆధిక్యం ఉండగా.. ఎవరూ క్యాంప్‌నకు వెళ్లలేదు. ఎనగండ్ల, రంగంపేట్, రాంపూర్ ఎంపీటీసీ సభ్యులు ఎవరికి వారు ఎంపీపీ పదవికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. మనోహరబాద్ ఎంపీపీ బీసీ మహిళకు రిజర్వ్ అయింది. దీని పరిధిలో ఎంపీటీసీ స్థానాలు ఏడు కాగా.. టీఆర్ఎస్–5, స్వతంత్రులు ఇద్దరు (టీఆర్ఎస్ రెబెల్స్) గెలుపొందారు. వీరిలో కల్లకళ్–2 అభ్యర్థి పురం నవనీత తరఫున కుచారం, రంగాయిపల్లి, లింగారెడ్డి పేట్‌కు చెందిన ఎంపీటీసీ సభ్యులు ఎలక్షన్‌రెడ్డి ఆధ్వర్యంలో క్యాంపునకు వెళ్లినట్లు సమాచారం. మనోహరబాద్ అభ్యర్థి పొట్లోళ లత తరఫున పర్కిబందా, కల్లకళ్–1 ఎంపీటీసీ సభ్యులు జిల్లా సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి తరçఫున వేరే క్యాంప్‌నకు వెళ్లారు. నిజాంపేట ఎంపీపీ బీసీ జనరల్‌కు రిజర్వ్ అయింది. దీని పరిధిలో ఎనిమిది ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. ఆరింటిలో టీఆర్ఎస్, ఒకరు చొప్పున కాంగ్రెస్, స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. రిజర్వేషన్ ప్రకారం నçష్కల్ నుంచి గెలిచిన దేశెట్టి సిద్ధరాములుకు మాత్రమే అవకాశం ఉండగా.. ఎంపీటీసీ అభ్యర్థులను క్యాంప్‌నకు తరలించినట్లు తెలుస్తోంది. రామాయంపేట ఎంపీపీ ఎస్సీకి రిజర్వ్ అయింది. మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి స్వగ్రామమైన కోనాపూర్ నుంచి ఎంపీటీసీగా గెలుపొందిన భిక్షపతిని ఇదివరకే ఎంపీపీగా ప్రకటించినట్లు సమాచారం. ఈ మేరకు టీఆర్ఎస్ అభ్యర్థులను క్యాంపునకు తరలించినట్లు తెలిసింది. చేగుంట ఎంపీపీ స్థానం ఓసీ జనరల్‌కు రిజర్ కాగా.. దీని పరిధిలో మొత్తం 13 ఎంపీటీసీ స్థానాలున్నాయి. గెలిచిన తొమ్మిది మంది స్వతంత్ర అభ్యర్థులకు ఎనిమిది మంది క్యాంపులో ఉన్నారు. వీరిలో చందాయిపేట్, చేగుంట, రెడ్డిపల్లి ఎంపీటీసీ సభ్యులు రామచంద్రం, మసుల శ్రీనివాస్, శంభుని రవి ఎంపీపీ కోసం పోటీ పడుతున్నారు. నార్సింగి ఎంపీపీ స్థానం జనరల్ మహిళకు రిజర్వ్ కాగా.. దీని పరిధిలో ఐదు ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. గెలుపొందిన వారిలో ఇద్దరు స్వతంత్రులు. ఒక కాంగ్రెస్ అభ్యర్థి క్యాంపునకు తరలి వెళ్లారు. నార్సింగి ఎంపీటీసీ ఆకుల సుజాతను ఎంపీపీగా చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. రేగోడ్ ఎంపీపీ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది. దీని పరిధిలో ఏడు ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. కాంగ్రెస్ నాలుగింట గెలుపొందింది. గజ్వాడకు చెందిన ఎంపీటీసీ సభ్యురాలు సరోజన ఎంపీపీ అయ్యే అవకాశం ఉంది. అయినా.. కాం గ్రెస్ సభ్యులు క్యాంపునకు వెళ్లినట్లు తెలిసింది. నర్సాపూర్ ఎంపీపీ పదవిని ఎస్టీ మహిళకు రిజర్వ్ చేశారు. దీని పరిధిలో పది ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. కాంగ్రెస్, టీఆర్ఎస్ ఐదు చొప్పున గెలుపొందాయి. టీఆర్ఎస్కు చెందిన చిప్పలుతుర్తి ఎంపీటీసీ సంధ్యారాణి.. కాంగ్రెస్‌కు చెందిన అహ్మద్‌నగర్ ఎంపీటీసీ జ్యోతిలో ఎవరోఒకరు పీఠాన్ని అధిరోహించే అవకాశం ఉంది. టీఆర్ఎస్ యాదగిరిగుట్టలో క్యాంప్ పెట్టినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్‌కు వెళ్తున్నారు. అక్కడి నుంచి శ్రీశైలం వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం. కౌడిపల్లి ఎంపీపీ పదవి ఎస్టీ జనరల్‌కు రిజర్వ్ అయింది. దీని పరిధిలో పది ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఇందులో టీఆర్ఎస్ తొమ్మిది.. కాంగ్రెస్ ఒక స్థానంలో గెలుపొందింది. సలబతపూర్ ఎంíపీటీసీ సభ్యుడు రాజు, మహమ్మద్ నగర్ ఎంపీటీసీ సభ్యురాలు సునీత ఎంపీపీ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. వెల్దుర్తిలో 12 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. కాంగ్రెస్ ఐదు, టీఆర్ఎస్ నాలుగు, స్వతంత్రులు ముగ్గురు (టీఆర్ఎస్ రెబల్స్) గెలుపొందారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ తమతమ సభ్యులను క్యాంప్‌లకు తరలించగా.. స్వతంత్రులు ముగ్గురూ ఎటూ వెళ్లలేదు. దీంతో ఈ పీఠంపై అనిశ్చితి నెలకొంది. తూప్రాన్‌లో ఎంపీపీ పీఠం కాంగ్రెస్‌కే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఎంపీపీ రిజర్వేషన్ బీసీ మహిళ కాగా.. రెండు చొప్పున కాంగ్రెస్, స్వతంత్ర.. ఒకరు టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందారు. స్వతంత్ర అభ్యర్థిని బీసీ మహిళ గడ్డి స్వప్న కాంగ్రెస్‌లో చేరడంతో ఆమే ఎంపీపీ కానున్నట్లు తెలుస్తోంది. పెద్దశంకరంపేటలో శ్రీనివాస్, అల్లాదుర్గంలో అనిల్‌రెడ్డి ఎంపీపీలుగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. పాపన్నపేటకు చెందిన ఎంపీటీసీలు తీర్థయాత్రకు.. చిన్నశంకరంపేట, టేక్మాల్ ఎంపీటీసీ సభ్యులు క్యాంప్‌లకు తరలివెళ్లినట్లు తెలిసింది. తొలి జెడ్పీ పీఠం మనోహరాబాద్కే.. జిల్లా పరిషత్ తొలి పీఠంతోపాటు ఎంపీపీ పదవులు ఎవరిని వర్తిస్తాయనే దానిపై జిల్లావ్యాప్తంగా జోరుగా చర్చ సాగుతోంది. జిల్లా పరిషత్ పీఠం బీసీ మహిళకు రిజర్వ్ కాగా.. సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని మెదక్ జిల్లాకు చెందిన మనోహరాబాద్‌కు దక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ స్థానంలో టీఆర్ఎస్ తరఫున జెడ్పీటీసీ అభ్యర్థిగా బరిలో నిలిచిన హేమలతా శేఖర్‌గౌడ్ 5,579 ఓట్ల భారీ మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్‌గౌడ్‌పై విజయం సాధించారు. ఆమెకే జిల్లా పరిషత్ తొలి పీఠం దక్కుతుందని స్థానిక టీఆర్ఎస్ నేతలు సైతం పూర్తి విశ్వాసంతో ఉండడం విశేషం. -
క్యాంపులు పెడితే వేటు
సాక్షి, హైదరాబాద్: జెడ్పీ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు, ఎంపీపీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్ పదవులకు నిర్వహించే ఎన్నికలకు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎన్నికైన ప్రజాప్రతినిధులతో పరోక్ష, ప్రత్యక్ష పద్ధతుల్లో ఎలాంటి క్యాంప్‌లు నిర్వహించొద్దని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) ఆదేశించింది. ఈ పదవులకు పరోక్ష పద్ధతుల్లో ఎన్నికల నిర్వహణకు 48 గంటల ముందు ఎలాంటి ప్రచారం నిర్వహించొద్దని, స్థానిక సంస్థల పదవులకు ఎన్నికలు పూర్తయ్యే వరకు ఈ ప్రచారంపై నిషేధం అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు ఎస్ఈసీ కార్యదర్శి అశోక్‌కుమార్ ఆదేశాలు జారీ చేశారు. గతంలో ఈ పదవులకు జరిగిన ఎన్నికల్లో వివిధ రాజకీయ పార్టీలు.. డబ్బు, అంగబలమున్న అభ్యర్థులు ఇళ్లు, రిసార్ట్‌లలో క్యాంప్‌లు నిర్వహించి గెలిచిన ప్రజాప్రతినిధులను సుదీర్ఘకాలం పాటు ఎక్కడో ఉంచడం తమ దృష్టికి వచ్చినట్లు పేర్కొంది. అధికారంలో ఉన్న పార్టీకి అదనపు అవకాశాలుండటంతో ప్రభుత్వ యంత్రాంగా న్ని ఉపయోగించి ఏదోక రూపంలో ప్రభావితం చేసేందుకు ఎక్కువ అవకాశాలున్నాయని పేర్కొంది. ఇలాంటి పద్ధతుల కారణంగా కొత్తగా ఎన్నికైన సభ్యులు ప్రలోభాలకు లొంగి, విప్‌లను ధిక్కరించి ఓటేసే పరిస్థితులు ఉన్నట్లు పేర్కొంది. ప్రలోభాల నివారణకు.. జెడ్పీ చైర్పర్సన్లు, ఎంపీపీ అధ్యక్షులు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లను పరోక్ష పద్ధతుల్లో ఎన్నుకునేటప్పుడు స్థానిక ప్రజాప్రతినిధులను వివిధ రూపాల్లో ప్రలోభాలకు గురిచేయకుండా ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో ప్రత్యేక సెక్షన్‌ను ఎస్ఈసీ చేర్చింది. పరిషత్ (జెడ్పీపీ, ఎంపీపీ పదవులకు), పట్టణ స్థానిక సంస్థల్లో (యూఎల్బీ)ని పదవులకు పరోక్ష పద్ధతుల్లో నిర్వహించే ఎన్నికలకు సంబంధించి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఈ మేరకు సవరించింది. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించే వారిపై ఆయా నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకునే అంశాన్ని చేరుస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ ఎన్నికల కోడ్ స్థానిక ఫలితాల వెల్లడి నుంచి మొదలై పరోక్ష పద్ధతుల్లో జెడ్పీపీ, ఎంపీపీ, మున్సిపాలిటీల్లో ఆయా పదవులకు ఎన్నికలు ముగిసే వరకు అమల్లో ఉం టుందని స్పష్టం చేసింది. జెడ్పీ చైర్పర్సన్లు, వైస్చైర్మన్లు, ఎంపీపీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, మున్సిపల్ చైర్పర్సన్, వైస్‌చైర్‌పర్సన్, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు (ప్రత్యక్ష లేదా పరోక్ష పద్ధతుల్లో) కోరుకునే ఏ రాజకీయపార్టీకి చెందినవారైనా ప్రజాప్రాతినిథ్య చట్టంలో పొందుపరిచిన లంచం ఇతరత్రా రూపాల్లోని ప్రలోభాలకు పాల్పడొద్దని పేర్కొంది. పార్టీలు ఇచ్చిన విప్‌ను ధిక్కరించి ప్రజాప్రతినిధులు ఓటేసేలా ఒత్తిళ్లు తేవొద్దని తెలిపింది. విప్‌ను ధిక్కరిస్తే పదవి కానీ ప్రోత్సాహకం కానీ ఇస్తామన్న ప్రలోభాలకు పాల్పడొద్దని హెచ్చరించింది. అధికార పార్టీ లేదా ప్రభుత్వ ప్రతినిధులు తమ అధికార హోదా లేదా పదవులను ఉపయోగించి కాంట్రాక్ట్‌ల కల్పన, పెండింగ్ బిల్లుల చెల్లింపులు, లైసెన్సులు, సర్టిఫికెట్లు అందజేయడం, పెండింగ్‌కేసుల ఎత్తివేత వంటి వాటికి పాల్పడొద్దని స్పష్టంచేసింది. -
ఉపకరణాలు అందించేందుకు వైద్యపరీక్షలు
జిల్లావ్యాప్తంగా 25 వరకు శిబిరాల నిర్వహణ ధవళేశ్వరం : ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు ఉపకరణాలు అందించేందుకు ఈ నెల 25 తేదీ వరకు జిల్లావ్యాప్తంగా వైద్యశిబిరాలు నిర్వహిస్తున్నట్టు సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టు ఆఫీసర్ టీవీఎస్ గంగాధర్ కుమార్, సర్వశిక్షా అభియాన్ ఐఈ కో ఆర్డినేటర్ వై.లక్ష్మణ్æకుమార్ తెలిపారు. ధవళేశ్వరం భవిత కేంద్రంలో బుధవారం ప్రత్యేక అవసరాలుగల విద్యార్థులకు ఉపకరణాలను అందించేందుకు వైద్యపరీక్షలు నిర్వహించారు. లక్ష్మణ్‌కుమార్ మాట్లాడుతూ బుధవారం నుంచి ఈ నెల 25వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని భవితా కేంద్రాల్లో వైద్యశిబిరాలు నిర్వహించి, ఉపకరణాలు అవసరమైన వారిని గుర్తిస్తామన్నారు. జిల్లావ్యాప్తంగా సుమారు 8,500 మంది ప్రత్యేక అవసరాలుగల చిన్నారులు ఉన్నారన్నారు. ఒకసారి ఉపకరణాలు తీసుకున్న వారు మూడేళ్ల తర్వాత మళ్లీ తీసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో రాజమహేంద్రవరం రూరల్ ఎంఈవో కె.నరసింహారెడ్డి, ఐఈఆర్టీలు గంటా సత్యనారాయణ, కె.కమలాకర్ పాల్గొన్నారు. కాగా.. వైద్యశిబిరాల సమాచారం కోసం ఆయా మండలాల ఎంఈవోలను సంప్రదించవచ్చు. వైద్యశిబిరాలు జరిగే తేదీలు 20–10–2016 : రాజోలు, ఏలేశ్వరం, బిక్కవోలు, కోరుకొండ 21–10–2016 : అడ్డతీగల, తుని, రావులపాలెం, మండపేట 22–10–2016 : అమలాపురం , పిఠాపురం, సామర్లకోట, చింతూరు, 24–10–2016 : పి.గన్నవరం, జగ్గంపేట, కరప, రంపచోడవరం, 25–10–2016 : కాకినాడ అర్బన్ -
సిరియన్ శరణార్థుల గోస
-
'సాక్షి' ఆధ్వర్యంలో 'ఆధార్ అనుసంధానం' క్యాంప్
హైదరాబాద్‌సిటీ : సాక్షి ఆధర్యంలో కొనసాగుతున్న ఓటరు కార్డుకు ఆధార్ నంబర్ అనుసంధానం కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తోంది. బుధవారం నగరంలోని రాయదుర్గం, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో సాక్షి మీడియా ఏర్పాటు చేసిన కేంద్రాలకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆధార్ నంబర్ ను అనుసంధానం చేసుకున్నారు. సాక్షి మీడియా ఇలాంటి ప్రజాహిత కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఓటర్లు ప్రశంసించారు. -
విశ్వవ్యాప్తంగా..
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శిబిరాలు న్యూఢిల్లీ: తొలి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఆదివారం దాదాపు అన్ని రాష్ట్రాల్లో భారీ ప్రదర్శనలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో పలువురు ముఖ్యమంత్రులు, గవర్నర్లు, కేంద్ర మంత్రులు, రాష్ర్ట మంత్రులు, ఉన్నతాధికారులు, ఇతర ప్రముఖులతోపాటు సామాన్యులు కూడా ఆసనాలు వేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు యోగా డేని ప్రతిష్టాత్మకంగా తీసుకొని భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాయి. గుజరాత్లో 29 వేల ప్రాంతాల్లో 1.25 కోట్ల మంది ఆసనాలు వేశారు. హైదరాబాద్‌లో జరిగిన యోగా డేలో కేంద్ర మంత్రి జేపీ నడ్డా, మరో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ పాలుపంచుకున్నారు. పట్నాలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా నేతృత్వంలోని జరిగిన శిబిరంలో పెద్దఎత్తున రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. లక్నోలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆధ్వర్యంలో జరిగిన శిబిరంలో 15 వేలమందికిపైగా పాల్గొన్నారు. ఇక్కడ పెద్ద ఎత్తున ముస్లింలు కూడా ఆసనాలు వేశారు. హర్యానా ప్రభుత్వం వెయ్యి గ్రామాల్లో యోగ, వ్యాయామశాలలను నెలకొల్పుతూ నిర్ణయం తీసుకుంది. జైపూర్‌లో 25వేల మందితో నిర్వహించిన కార్యక్రమం ఆకట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఘనంగా యోగా డే లండన్: అంతర్జాతీయ యోగా డే ప్రారంభ వేడుకలను పురస్కరించుకొని ఆదివారం ప్రపంచవ్యాప్తంగా వేలాది ఔత్సాహికులు ప్రాచీన భారతీయ యోగ కళను అభ్యసించారు. యోగా సార్వజనీనతను చాటుతూ వివిధ రకాల ఆసనాలను వేసి చూపారు. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో 500 మందికిపైగా ఔత్సాహికులు సూర్య నమస్కారాలు చేశారు. లండన్‌లో థేమ్స్ నది ఒడ్డున వందలాదిప్రజలు యోగా డే వేడుకల్లో పాల్గొన్నారు. చైనాలోని ప్రఖ్యాత పెకింగ్ యూనివర్సిటీ, గీలీ యూనివర్సిటీలలో యోగా కార్యక్రమాలు నిర్వహించారు. సింగపూర్‌లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో 4 వేల మందికిపైగా ప్రజలు పాల్గొన్నారు. థాయ్‌లాండ్, నేపాల్, వియత్నాం, జపాన్, ఫ్రాన్స్, మలేసియా, ఫిలిప్పీన్స్ తదితర దేశాల్లోనూ యోగా డేను పాటించారు. -
వాయిదాకే అవకాశం..!
సాక్షి ప్రతినిధి, కడప: డీసీసీబీ చైర్మన్ ఎన్నిక శనివారం నిర్వహించనున్నారు. చైర్మన్‌గిరి మాదంటే మాదేనని ఎవరికి వారు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరుపక్షాల క్యాంపులు కడపకు చేరుకున్నాయి. వాస్తవానికి ఏ క్యాంపులోనూ కోరానికి సరిపడా డెరైక్టర్లు లేనట్లు రూఢీ అవుతోంది. అయినప్పటికీ చైర్మన్ గిరిని కైవసం చేసుకుంటామని టీడీపీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. అయితే వారి పరిధిలో ఏడుగురు డెరైక్టర్లే ఉన్నట్లు తెలుస్తోంది. శనివారం చైర్మన్ ఎన్నిక వాయిదాపడే సూచనలే మెండుగా కన్పిస్తున్నాయి. డీసీసీబీ చైర్మన్ ఐ. తిరుపేలురెడ్డి పదవి రద్దు కావడంతో వైస్ చైర్మన్ ఆంజనేయులుయాదవ్ ఇన్చార్జ్గా బాధ్యతలు స్వీకరించారు. ఈలోగా అతని డెరైక్టర్ పదవిని రద్దు చేస్తూ అధికార యంత్రాంగం నిర్ణయించింది. హైకోర్టును ఆశ్రయించడంతో తిరిగి పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే శనివారం ఎన్నిక నిర్వహించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆమేరకు చైర్మన్ ఎన్నికకు సర్వసిద్ధం చేసినట్లు డీసీఓ ఫోమేనాయక్ తెలిపారు. ఎవరి వ్యూహాల్లో వారు.. డీసీసీబీ చైర్మన్ ఎన్నిక శనివారం వాయిదా పడునున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. 21 మంది డెరైక్టర్లు ఉండగా వారిలో 11మంది హాజరైతేనే కోరం ఉన్నట్లుగా నిర్ధారించనున్నారు. ప్రస్తుతం 17 మంది డెరైక్టర్లు మాత్రమే ఉన్నారు. వారిలో టీడీపీ శిబిరంలో ఏడుగురు, వైఎస్సార్సీపీ శిబిరంలో ఎనిమిది మంది ఉన్నట్లు సమాచారం. మరో ఇరువురు ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు ఎంవీ రమణారెడ్డి వర్గీయులు. ఆ ఇరువురు ఆయన అదుపాజ్ఞల్లో ఉన్నట్లు తెలుస్తోంది. రెండు క్యాంపులు కడప చేరుకొని చైర్మన్ ఎన్నికను వ్యూహరచన చేస్తున్నారు. ఇంతకాలం ఆళ్లగడ్డలో టీడీపీ క్యాంపు నిర్వహించగా, శుక్రవారం రాత్రికే నగరంలోని ఓ హోటల్‌కు చేరినట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి తన కార్యకలాపాలు ఎంచుకుంటున్నట్లు సమాచారం. కాగా టీడీపీలోని ఓ వర్గం క్యాంపునకు వ్యతిరేకంగా పావులు కదుపుతోన్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. కోరం మేరకు డెరైక్టర్లు హాజరైతే ముందుగా ఖాళీ ఉన్న ముగ్గురు డెరైక్టర్లును (ఇరువురు మృతి, ఎస్టీ డెరైక్టర్ పెండింగ్) ముందుగా ఎన్నుకొని తర్వాత చైర్మన్‌ను ఎన్నుకోనున్నారు. కోరం లేకపోతే మరుసటి రోజుకు వాయిదా వేసి ఎంతమంది హాజరైతే వారితోనే చైర్మన్ ఎన్నిక నిర్వహించాలని సహకారశాఖ యాక్టు వివరిస్తోంది. ఆమేరకు డీసీఓ ఫోమేనాయక్ సైతం ధ్రువీకరించారు. కీలకంగా మారిన రమణారెడ్డి వర్గీయులు... వైఎస్సార్సీపీ నుంచి చైర్మన్ గిరిని ఎలాగైనా దక్కించుకోవాలనే తలంపుతో టీడీపీ కుయుక్తులకు పాల్పడింది. అధికారాన్ని అడ్డుపెట్టుకొని సహకారశాఖలో ఉన్న లొసుగుల ఆధారంగా అన్యూహ్యంగా చైర్మన్ పదవిని రద్దు చే యించింది. అలాగే మరో ఇరువురి డెరైక్టర్లు పదవులు కూడ రద్దు అయ్యాయి. అయితే హైకోర్టు ఉత్తర్వులు కారణంగా ఆ ఇరువురు ఓటింగ్ అర్హులైయ్యారు. వారిలో ఒకరైన సరస్వతీపల్లె డెరైక్టర్ చిన్న ఓబులేసు మృతి చెందారు. ఈ క్రమంలో టీడీపీకి ఏడుగురు, వైఎస్సార్సీపీకి ఎనిమిది మంది డైరె క్టర్లు ఓటు హక్కుదారులుగా ఉన్నారు. మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యే ఎంవి రమణారెడ్డి వర్గీయులు కావడం విశేషం. ఆ ఇద్దరూ.. ఏ క్యాంపును ఆశ్రయించకుండా ఆయన నేతృత్వంలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తరుణంలో వారు కీలకమైయ్యారు. వారు ఎవ్వరికి మద్దతు ప్రకటిస్తే ఆ క్యాంపు చైర్మన్ సీటులో కూర్చోనుంది. అయితే మాజీ ఎమ్మెల్యే సీనియర్ నేత ఎంవీ రమణారెడ్డి మద్దతు వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉంటుందనే ఆత్మవిశ్వాసం ఆపార్టీలో వ్యక్తమౌతోంది. ఆయన కోడలు మల్లేల ఝాన్సీరాణీ ప్రొద్దుటూరు రూరల్ మండల పరిషత్ అధ్యక్షరాలుగా వైఎస్సార్సీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తోంది. పెపైచ్చు వైఎస్సార్సీపీ సీనియర్ నేత నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి బంధుత్వం సైతం ఉంది. ఎటుచూసినా ఎంవి రమణారెడ్డి వర్గీయులు వైఎస్సార్సీపీకి మద్దతు ప్రకటిస్తారని విశ్లేషకులు సైతం భావిస్తున్నారు. అంతేకాక చైర్మన్‌గిరి ఆశిస్తున్న టీడీపీ నేతలతో వ్యక్తిగత వైరం ఉండడం కూడ ఒక అంశంగా వారు పేర్కొంటున్నారు. మొత్తానికి జిల్లాలో డీసీసీబీ చైర్మన్ ఎన్నిక తీవ్ర ఉత్కంఠతను కొనసాగిస్తోంది. -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
స్టేషన్‌ఘన్‌పూర్ టౌన్ : ప్రస్తుత సీజన్లో అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, సీజనల్ వ్యాధులపై వైద్యులు, ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్ఓ డాక్టర్ శ్రీరామ్ ఆదేశించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ క్లస్టర్ ఆస్పత్రిలో క్లస్టర్ పరిధిలోని పీహెచ్‌సీలకు చెందిన వైద్యులు, వైద్య సిబ్బందితో శనివారం సాయంత్రం ఆయన ప్రత్యేకంగా సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా ఆయా పీహెచ్‌సీల్లో వైద్యుల పనితీరు, సీజనల్ వ్యాధులు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో వైద్యశిబిరాల నిర్వహణ, టీకాల కార్యక్రమం, కుటుంబ నియంత్రణ క్యాంపులు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు, డెంగ్యూ, మలేరియా, టీబీ, కుష్టువ్యాధి కేసులు తదితర అంశాలపై పీహెచ్‌సీల పరిధిలవారిగా సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైద్యులు, సిబ్బంది ఆస్పత్రులకు వేళకు రావాలని, విధిగా సమయపాలన పాటించాలన్నారు. డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ రాజయ్య సొంత నియోజకవర్గం కావడంతో అందరి దృష్టి ఆస్పత్రులపైనే ఉంటుందని, వైద్యులు అంకితభావంతో, బాధ్యతగా పనిచేయాలని సూచించారు. సమీక్షలో ఎన్ఆర్హెచ్ఎం(నేషనల్ రూరల్ హెల్త్ మిషన్) డీపీఓ రాజారెడ్డి, క్లస్టర్ వైద్యాధికారి డాక్టర్ పద్మశ్రీ, సీహెచ్ఓ బొడ్డు ప్రసాద్, వైద్యులు చందు, ప్రసన్నకుమార్, సుధాకర్, సాజిత్, బజన్,జమాల్, విజయ్‌తో పాటు క్లస్టర్ పరిధిలోని జఫర్గడ్, కూనూరు, వేలేరు, ఘన్పూర్, మల్కాపూర్, తాటికొండ పీహెచ్‌సీల సూపర్వైజర్లు, హెచ్‌ఈఓలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
విస్తరణ దిశగా ‘పాస్‌పోర్ట్’
కొత్తగా 12 కౌంటర్లు ఏర్పాటు రీజనల్ కార్యాలయంలో రెండు అంతస్తులు కేటాయింపు పదిహేను రోజుల్లో ప్రణాళిక సిద్ధం నవంబర్ 1న పాస్‌పోర్ట్ మేళా సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం పాస్‌పోర్ట్ కేంద్రం మరింత విస్తరించనుంది. మన రాష్ట్రంలోని 13జిల్లాలకు కేంద్ర బిందువుగా మారనుంది. ఇందుకు అనుగుణంగా ప్రాంతీయ కార్యాలయాన్ని అభివృద్ధి చేయనున్నారు. అధికారులు 15 రోజుల్లో ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు. ఈ విస్తరణ పూర్తయితే పాస్‌పోర్ట్ పొందడం అత్యంత సరళతరమయ్యే అవకాశం ఉంది. నగరంలోని పాస్‌పోర్ట్ కార్యాలయం సేవలు గడిచిన ఐదునెలల కాలంలో వేగాన్ని పుంజుకున్నాయి. గతంలో 42 పనిదినాల్లో వచ్చే పాస్‌పోర్ట్ ప్రస్తుతం 30 పనిదినాల్లోనే అందుతోంది. ప్రతి శనివారం పాస్‌పోర్ట్ మేళాలు, క్యాంపులు నిర్వహిస్తూ రోజుకి దాదాపు 900 దరఖాస్తులను పరిష్కరిస్తున్నారు. దానిలో భాగంగా వచ్చే నెల 1వ తేదీన విశాఖలో పాస్‌పోర్ట్ మేళాను నిర్వహించనున్నారు. ఆ మేళాలో పాస్‌పోర్ట్ పొందాలనుకునే వారికి బుధవారంతో అపాయింటమెంట్ గడువు ముగిసింది. సాధారణంగా మేళా జరిపడానికి మూడు రోజుల ముందే అపాయింట్మెంట్స్ ముగిస్తుంటారు. ఇలా మేళాలలో పాస్‌పోర్ట్‌లు ఇవ్వడంతో పాటు ఆ సంఖ్యను పెంచాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం పాస్‌పోర్ట్ సేవాకేంద్రంలో 18 కౌంటర్లున్నాయి. వాటికి తోడు మరో 12 కౌంటర్లను కొత్తగా నెలకొల్పనున్నారు. అయితే పాస్‌పోర్ట్ సేవా కేంద్రంలో ఆ మేరకు అవకాశం లేకపోవడంతో రీజనల్ కార్యాలయం భవనంలోని రెండు అంతస్ధులను ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు. దీని కోసం ప్రభుత్వానికి ఇప్పటికే ప్రతిపాధనలు పంపించారు. 15 రోజుల్లో పూర్తి స్థాయి అనుమతులు సాధించి పనులు ప్రారంభించనున్నారు. పాస్‌పోర్ట్ పొందడం ప్రజల హక్కు ఈ నెల 25,26 తేదీల్లో తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో క్యాంపు నిరహించి పాస్‌పోర్ట్ మంజూరు చేశాం. భవిష్యత్‌లోనూ అనేక జిల్లాలో మేళాలు జరుపనున్నాం. నగరంలోని పాస్‌పోర్ట్ కౌంటర్లను పెంచనున్నాం. ప్రస్తుతం 18 కౌంటర్ల ద్వారా రోజుకి 40 స్లాట్లు అందిస్తున్నాం. అంతకన్నా ఎక్కువ ఇవ్వడానికి సాంకేతికంగా ఇబ్బందులు ఉన్నాయి. దీంతో కౌంటర్లు పెంచాలని నిర్ణయించాం. తద్వారా స్లాట్లు పెరిగి దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి తక్కువ సమయంలో పని జరిగే వెసులుబాటు లభిస్తుంది. - ఎన్ఎల్పి చౌదరి, పాస్‌పోర్ట్ అధికారి, విశాఖపట్నం -
కార్పొరేషన్లో ఖాళీ కుర్చీలు
సాక్షి, నెల్లూరు : తమకు కేటాయించిన క్యాబిన్లో కనిపించని అధికారులు.. ఎప్పుడు వెళ్లినా ఖాళీగా కనిపించే కుర్చీలు.. ఇదేమని ప్రశ్నిస్తే ఆధార్ సీడింగ్ లేదా క్యాంపులు అంటూ సమాధానం. ఘనత వహించిన నెల్లూరు నగరపాలక కార్యాలయానికి వె ళ్లే ప్రజలకు నిత్యం ఎదురయ్యే పరిస్థితి ఇది. అధికారులు అందుబాటులో ఉండకపోవడంతో ఎప్పుడు వెళ్లినా కార్పొరేషన్లో ఖాళీ కుర్చీలే దర్శనమిస్తున్నాయి. దీంతో ప్రజలు పగలంతా పడిగాపులు కాస్తూ సాయంత్రం పనులుకాక ఉసూరుమంటూ వెనుదిరుగుతున్నారు. అసలు అధికారులు కార్యాలయానికే రారనుకుంటే పొరపాటు. కీలక అధికారులంతా సాయంత్రమవగానే ఆఫీసుకు నింపాదిగా వస్తారు. అలాగని ప్రభుత్వ కార్యాలయాల ముగింపు సమయం 5.30 గంటల్లోగా వెళతారనుకుంటే పొరపాటే. రాత్రి 10 గంటలైనా సరే ఇంటిముఖం పట్టరు. అలాని చెప్పి ఆఫీసు కార్యకలాపాలు చక్కపెడతారనుకుంటే పొరబడినట్లే. అలాంటిదేమీ ఉండదు. కాంట్రాక్టర్లు, దళారులతో బిజీబిజీగా గడుపుతారు. తమ పనులు చక్కబెట్టుకునేందుకు సమయం వెచ్చిస్తారు. వీరి చీకటి దందా తెలిసిన ప్రజలు చేసేదేమీలేక వారు కూడా దళారుల సహకారంతో చీకటి పడ్డాకే కార్పొరేషన్ కార్యాలయానికి తరలివస్తున్నారు. దీంతో కార్పొరేషన్ కార్యాలయం పగటిపూట ఖాళీగా.. రాత్రిపూట కళకళలాడుతూ కనిపిస్తోంది. -
సదరం.. గందరగోళం
6 నె లలుగా ఊసే లేని క్యాంపులు వైద్యులకు నిలిచిపోయిన చెల్లింపులు శిబిరాలకు ముఖం చాటేస్తున్న డాక్టర్లు సంతకాల్లేక జారీ కాని వైకల్య నిర్ధారణ సర్టిఫికెట్లు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న వికలాంగులు పరీక్షల కోసం 15 వేల మంది నిరీక్షణ హన్మకొండ అర్బన్ : డీఆర్డీఏ పింఛన్ల విభాగం ఆధ్వర్యంలో ఇంతకాలం జిల్లాలో కొనసాగిన సదరం వైద్యశిబిరాల పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా తయారైంది. వికలాంగుల వైకల్య శాతం నిర్ధారణకు నిరంతరం కొనసాగాల్సిన శిబిరాలు ఆరు నెలలుగా మూతబడ్డాయి. ఫలితంగా ప్రతి సోమవారం కలెక్టరేట్ ప్రజావాణికి వచ్చే వికలాంగుల సంఖ్య పెరుగుతోంది. నిధుల మంజూరులో సెర్ప్ అధికారుల నిర్లక్ష్యం... వైద్యశాఖ, డీఆర్డీఏ అధికారుల సమన్వయ లోపం వికలాంగుల పాలిట శాపంగా మారింది. సదరం వైద్య శిబిరాల నిర్వహణ ఎప్పుడు ప్రారంభమవుతాయో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. వైద్యులకు రూ.4 లక్షల బకాయిలు.. జిల్లాలో సదరం వైద్య పరీక్షల కోసం మహ బూబాబాద్, జనగామ, ఏటూరునాగారం, ఎంజీఎంలో ప్రత్యేక మెడికల్ బో ర్డులు ఏర్పాటు చేశారు. వీటిలో ఈఎన్టీ, ఆర్థో, సైకియాట్రిస్ట్, ఎంఆర్ వైద్యులు ఉంటారు. ప్రతి వైద్యుడు రోజుకు సుమారు 70 మంది వరకు రోగులను పరీక్షించడంతోపాటు వారికి సర్టిఫికెట్లు జారీ చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు ఒక్కో పేషెంట్‌కు కొంత చొప్పున డీఆర్డీఏ ద్వారా సంబంధిత బోర్డులోని వైద్యులకు చెల్లింపులు చేయూలి. కానీ... చాలాకాలంగా అవి పెండింగ్‌లో పడ్డారుు. సుమారు రూ.4లక్షలకు పైగా బకాయిలు ఉండడంతో సదరం శిబిరాల నిర్వహణ,సర్టిఫికెట్ల జారీపై వైద్యులుఆసక్తి చూపడం లేదు. మూలకుపడ్డ 3 వేల సర్టిఫికెట్లు.. చేసిన పనికి డబ్బులు రాకపోవడంతో డాక్టర్లు శిబిరాల వైపు కన్నెత్తి చూడడం లేదు. చెల్లింపులు చేయనిదే సంతకాల విషయంలో వైద్యులను అడిగే ధైర్యం డీఆర్డీఏ అధికారులు చే యలేకపోతున్నారు. ఫలితంగా గతంలో సదరం పరీక్షలు చేయించుకున్న వారికి సంబంధించి సుమారు 3 వేల సర్టిఫికెట్లు వైద్యుల ధ్రువీకరణ సంతకాలు లేక మూలకుపడ్డాయి. దీంతో వికలాంగులు పింఛన్, ప్రభుత్వ పథకాల కోసం నెలల తరబడి ఎదురుచూస్తూ.. ఇబ్బందులు పడుతున్నారు. తమ గోడు ఎవరికి చెప్పాలో తెలియక ప్రతి సోమవారం కలెక్టరేట్ గ్రీవెన్స్‌సెల్‌లో వినతిపత్రాలు ఇస్తున్నారు. పరీక్షల కోసం 15 వేల మంది నిరీక్షణ.. ఒక వైపు పరీక్షలు చేయించుకున్నవారు సర్టిఫికెట్ల కోసం నిరీ క్షిస్తుండగా... మరో వైపు కొత్తగా పరీక్షలు చేయించుకోవాల్సిన వారు, గతంలో తమకు అన్యాయం జరిగిందంటూ రీ అసెస్మెంట్కు దరఖాస్తు చేసుకున్నవారు జిల్లాలో 15వేల మంది వరకు ఉన్నారు. వీరందరూ క్యాంపులు ఎప్పుడు నిర్వహిస్తారా.. అని రోజు ఎదురుచూస్తున్నారు. మూడేళ్లుగా తిప్పుకుంటున్నారు.. నాకు చెముడు ఉంది. ఎడమ చేతికి రెండు వేళ్లు కూడా లేవు. 2011 నుంచి వికలాంగుల పింఛన్ రావడంలేదు. సదరం క్యాంపులకు వెళ్లి పరీక్షలు చేయించుకున్నా. ఎంజీఎంకు, డీఆర్డీఏ కార్యాలయూనికి తిరిగినా.. సర్టిఫికెట్ ఇవ్వలేదు. మొదటిసారి 39 శాతం ఉందని తొలగించారు. అప్పుడు చెముడు ఒక్కటే పరిశీలించారు. చేతి వేళ్లు లేని విషయం పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో తక్కువ శాతం వైకల్యం ఉంది. ఈ విషయం చెప్పి మళ్లీ సదరం పరీక్ష చేయాలని ఎన్నిసా ర్లు తిరిగినా... మేమే సమాచారం ఇస్తామంటున్నారు. మూడేళ్లుగా ఇదే పరిస్థితి. - సాదినేని శివకుమార్, కడిపికొండ సదరం శిబిరం నిరంతరం ఉండాలి వికలాంగులకు వైకల్య శాతం నిర్దారించేందుకు క్యాంపుల కోసం ఎదురుచూసే పరిస్థితి ఉండొద్దు. అలా ఉంటే వికలాంగులు నష్టపోవాల్సి వస్తుంది. పింఛన్లు, రేషన్‌కార్డులు, ఇంటి స్థలాల వంటివి ఒకసారి మంజూరు చేస్తే... మళ్లీ రెండు మూడేళ్లవరకు అవకాశం ఉండదు. ఈ మేరకు సదరం శిబిరాలను ఆటంకం లేకుండా నిరంతరం కొనసాగేలా చర్యలు తీసుకోవాలి. - లక్కిరెడ్డి సత్యం, వీహెచ్పీఎస్ జిల్లా అధ్యక్షుడు త్వరలో పరిష్కరిస్తాం... సదరం క్యాంపుల నిర్వహణలో కొంత ఇబ్బందులు ఉన్న మాట వాస్తవమే. వైద్యులకు చెల్లించాల్సిన మొత్తం సెర్ప్ నుంచి రావాల్సి ఉంది. అవి రాగానే ఇస్తాం. డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో సంతకాలు కాక సర్టిఫికెట్లు మూలకుపడ్డాయి. ఈ సమస్య ను కూడా త్వరలో పరిష్కరిస్తాం. క్యాంపుల నిర్వహణ బాధ్యత పూర్తిగా ఎంజీఎం మెడికల్ బోర్డుకే అప్పగించారు. చెల్లింపులు కాగానే... వారితో సంప్రదించి తదుపరి క్యాంపు తేదీలు ఖరారు చేస్తాం. - పద్మప్రియ, డీఆర్డీఏ,ఐకేపీ వికలాంగుల విభాగం డీపీఎం -
వేసవి శిక్షణ శిబిరాలపై నీలినీడలు
శ్రీకాకళం స్పోర్ట్స్, న్యూస్‌లైన్, జిల్లాలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. మే 1 నుంచి శిక్షణ శిబిరాలు ప్రారంభం కావా ల్సి ఉన్నా.. ఇప్పటివరకు ప్రణాళిక కూడా సిద్ధం కాకపోవటం క్రీడా సంఘాలకు, క్రీడాకారులకు ఆందోళన కలిగిస్తోంది. శిక్షణ శిబి రాల ఫైలును సిద్ధం చేసి తనకు పంపాలని వారం రోజుల కిందట కోడి రామ్మూర్తి స్టేడియాన్ని సందర్శించిన కలెక్టర్ సౌరభ్ గౌర్ ఆదేశించినప్పటికీ క్రీడాధికారులు పట్టించుకోకపోవటం విస్మయం కలిగిస్తోంది. వారి తీరుపై క్రీడాకారులు మండిపడుతున్నారు. ఇదీ పరిస్థితి ఇప్పటికే పదో తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షలు పూర్తయ్యాయి. పాఠశాల తరగతుల చిన్నారులకు ప్రస్తుతం వార్షిక పరీక్షలు జరుగుతున్నాయి. ఈ నెల 24వ తేదీకల్లా పరీక్షల సందడి ముగుస్తుంది. దీంతో వేసవి సెలవుల్లో తమకిష్టమైన క్రీడాంశంలో శిక్షణ పొందేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతారు. ఇలాంటివారి కోసం ఏటా మే 1 నుంచి 31వ తేదీ వరకు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నారు. వీటిలో 8 ఏళ్ల నుంచి 16 ఏళ్లలోపు చిన్నారులకు శిక్షణ ఇస్తారు. ఈ ఏడాది శాప్ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో 20 శిబిరాలు.. శ్రీకాకుళం, ఆమదాలవల స, ఇచ్ఛాపురం, పలాస, రాజాం మునిసిపాలిటీల్లో ఐదేసి చొప్పున శిబిరాలు నిర్వహించాలనే ప్రతిపాదన ఉంది. అయితే ఏయే కేంద్రాల్లో ఏయే క్రీడాం శాల్లో శిక్షణ ఇవ్వాలి? శిక్షకులుగా ఎవరెవరిని నియమించాలి? ఎంతమంది క్రీడాకారులు హాజరుకానున్నారు? అనే అంశాలపై అధికారులు ఇంతవరకు కసరత్తు చేయలేదని సమాచారం. మరోవైపు నిధులు లేవన్న సాకుతో శిబిరాల సంఖ్యను తగ్గించేందుకు వారు యత్నిస్తున్నారని తెలుస్తోంది. దీనిపై క్రీడా సంఘాల ప్రతినిధులు, క్రీడాకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని క్రీడాంశాలపై శీతకన్ను హాకీ, అథ్లెటిక్స్, ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, హ్యాండ్‌బాల్, బాక్సింగ్, తైక్వాండో, ఆర్చరీ, ఫుట్‌బాల్, వెయిట్ లిఫ్టింగ్ క్రీడాంశాల్లో మాత్రమే తర్ఫీదు ఇచ్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. చెస్, బాస్కెట్‌బాల్, స్విమ్మింగ్ తదితర క్రీడాంశాలను పక్కన పెట్టనున్నారని తెలుస్తోంది. అయితే వీటితోపాటు క్రికెట్, బాల్‌బ్యాడ్మింటన్, షటిల్‌బ్యాడ్మింటన్, జూడో అంశాలలో సొంతంగా శిక్షణ ఇవ్వాలని ఆయా క్రీడాసంఘాలు సన్నాహాలు చేస్తున్నాయి.