వాయిదాకే అవకాశం..! | Oppurtunity | Sakshi
Sakshi News home page

వాయిదాకే అవకాశం..!

Published Sat, May 2 2015 2:29 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM

Oppurtunity

సాక్షి ప్రతినిధి, కడప: డీసీసీబీ చైర్మన్ ఎన్నిక శనివారం నిర్వహించనున్నారు. చైర్మన్‌గిరి మాదంటే మాదేనని ఎవరికి వారు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరుపక్షాల క్యాంపులు కడపకు చేరుకున్నాయి. వాస్తవానికి ఏ క్యాంపులోనూ కోరానికి సరిపడా డెరైక్టర్లు లేనట్లు రూఢీ అవుతోంది. అయినప్పటికీ చైర్మన్ గిరిని కైవసం చేసుకుంటామని టీడీపీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది.
 
 అయితే వారి పరిధిలో ఏడుగురు డెరైక్టర్లే ఉన్నట్లు తెలుస్తోంది. శనివారం చైర్మన్ ఎన్నిక వాయిదాపడే సూచనలే మెండుగా కన్పిస్తున్నాయి. డీసీసీబీ చైర్మన్ ఐ. తిరుపేలురెడ్డి పదవి రద్దు కావడంతో వైస్ చైర్మన్ ఆంజనేయులుయాదవ్ ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈలోగా అతని డెరైక్టర్ పదవిని రద్దు చేస్తూ అధికార యంత్రాంగం నిర్ణయించింది. హైకోర్టును ఆశ్రయించడంతో తిరిగి పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే శనివారం ఎన్నిక నిర్వహించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆమేరకు చైర్మన్ ఎన్నికకు సర్వసిద్ధం చేసినట్లు డీసీఓ ఫోమేనాయక్ తెలిపారు.
 
 ఎవరి వ్యూహాల్లో వారు..
 డీసీసీబీ చైర్మన్ ఎన్నిక శనివారం వాయిదా పడునున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. 21 మంది డెరైక్టర్లు ఉండగా వారిలో 11మంది హాజరైతేనే కోరం ఉన్నట్లుగా నిర్ధారించనున్నారు. ప్రస్తుతం 17 మంది డెరైక్టర్లు మాత్రమే ఉన్నారు. వారిలో టీడీపీ శిబిరంలో ఏడుగురు, వైఎస్సార్‌సీపీ శిబిరంలో ఎనిమిది మంది ఉన్నట్లు సమాచారం. మరో ఇరువురు ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు ఎంవీ రమణారెడ్డి వర్గీయులు. ఆ ఇరువురు ఆయన అదుపాజ్ఞల్లో ఉన్నట్లు తెలుస్తోంది. రెండు క్యాంపులు కడప చేరుకొని చైర్మన్ ఎన్నికను వ్యూహరచన చేస్తున్నారు.
 
 ఇంతకాలం ఆళ్లగడ్డలో టీడీపీ క్యాంపు నిర్వహించగా, శుక్రవారం రాత్రికే నగరంలోని ఓ హోటల్‌కు చేరినట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి తన కార్యకలాపాలు ఎంచుకుంటున్నట్లు సమాచారం. కాగా టీడీపీలోని ఓ వర్గం క్యాంపునకు వ్యతిరేకంగా పావులు కదుపుతోన్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. కోరం మేరకు డెరైక్టర్లు హాజరైతే ముందుగా ఖాళీ ఉన్న ముగ్గురు డెరైక్టర్లును (ఇరువురు మృతి, ఎస్టీ డెరైక్టర్ పెండింగ్) ముందుగా ఎన్నుకొని తర్వాత చైర్మన్‌ను ఎన్నుకోనున్నారు. కోరం లేకపోతే మరుసటి రోజుకు వాయిదా వేసి ఎంతమంది హాజరైతే వారితోనే చైర్మన్ ఎన్నిక నిర్వహించాలని సహకారశాఖ యాక్టు వివరిస్తోంది. ఆమేరకు డీసీఓ ఫోమేనాయక్ సైతం ధ్రువీకరించారు.
 
 కీలకంగా మారిన రమణారెడ్డి
 వర్గీయులు...
 వైఎస్సార్‌సీపీ నుంచి చైర్మన్ గిరిని ఎలాగైనా దక్కించుకోవాలనే తలంపుతో టీడీపీ కుయుక్తులకు పాల్పడింది. అధికారాన్ని అడ్డుపెట్టుకొని సహకారశాఖలో ఉన్న లొసుగుల ఆధారంగా అన్యూహ్యంగా చైర్మన్ పదవిని రద్దు చే యించింది. అలాగే మరో ఇరువురి డెరైక్టర్లు పదవులు కూడ రద్దు అయ్యాయి. అయితే హైకోర్టు ఉత్తర్వులు కారణంగా ఆ ఇరువురు ఓటింగ్ అర్హులైయ్యారు. వారిలో ఒకరైన సరస్వతీపల్లె డెరైక్టర్ చిన్న ఓబులేసు  మృతి చెందారు. ఈ క్రమంలో టీడీపీకి  ఏడుగురు, వైఎస్సార్‌సీపీకి ఎనిమిది మంది డైరె క్టర్లు ఓటు హక్కుదారులుగా ఉన్నారు. మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యే ఎంవి రమణారెడ్డి వర్గీయులు కావడం విశేషం.
 
 ఆ ఇద్దరూ.. ఏ క్యాంపును ఆశ్రయించకుండా ఆయన నేతృత్వంలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తరుణంలో వారు కీలకమైయ్యారు. వారు ఎవ్వరికి మద్దతు ప్రకటిస్తే ఆ క్యాంపు చైర్మన్ సీటులో కూర్చోనుంది. అయితే మాజీ ఎమ్మెల్యే సీనియర్ నేత ఎంవీ రమణారెడ్డి మద్దతు వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఉంటుందనే ఆత్మవిశ్వాసం ఆపార్టీలో వ్యక్తమౌతోంది. ఆయన కోడలు మల్లేల ఝాన్సీరాణీ ప్రొద్దుటూరు రూరల్ మండల పరిషత్ అధ్యక్షరాలుగా వైఎస్సార్‌సీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తోంది. పెపైచ్చు వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి బంధుత్వం సైతం ఉంది. ఎటుచూసినా ఎంవి రమణారెడ్డి వర్గీయులు వైఎస్సార్‌సీపీకి మద్దతు ప్రకటిస్తారని విశ్లేషకులు సైతం భావిస్తున్నారు. అంతేకాక చైర్మన్‌గిరి ఆశిస్తున్న టీడీపీ నేతలతో వ్యక్తిగత వైరం ఉండడం కూడ ఒక అంశంగా వారు పేర్కొంటున్నారు. మొత్తానికి జిల్లాలో డీసీసీబీ చైర్మన్ ఎన్నిక తీవ్ర ఉత్కంఠతను కొనసాగిస్తోంది.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement