స్టేషన్‌ఘన్‌పూర్ టౌన్ : ప్రస్తుత సీజన్‌లో అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, సీజనల్ వ్యాధులపై వైద్యులు, ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ శ్రీరామ్ ఆదేశించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ క్లస్టర్ ఆస్పత్రిలో క్లస్టర్ పరిధిలోని పీహెచ్‌సీలకు చెందిన వైద్యులు, వైద్య సిబ్బందితో శనివారం సాయంత్రం ఆయన ప్రత్యేకంగా సమీక్ష సమావేశం నిర్వహించారు.
ముందుగా ఆయా పీహెచ్‌సీల్లో వైద్యుల పనితీరు, సీజనల్ వ్యాధులు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో వైద్యశిబిరాల నిర్వహణ, టీకాల కార్యక్రమం, కుటుంబ నియంత్రణ క్యాంపులు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు, డెంగ్యూ, మలేరియా, టీబీ, కుష్టువ్యాధి కేసులు తదితర అంశాలపై పీహెచ్‌సీల పరిధిలవారిగా సమీక్ష నిర్వహించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ వైద్యులు, సిబ్బంది ఆస్పత్రులకు వేళకు రావాలని, విధిగా సమయపాలన పాటించాలన్నారు. డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ రాజయ్య సొంత నియోజకవర్గం కావడంతో అందరి దృష్టి ఆస్పత్రులపైనే ఉంటుందని, వైద్యులు అంకితభావంతో, బాధ్యతగా పనిచేయాలని సూచించారు. సమీక్షలో ఎన్‌ఆర్‌హెచ్‌ఎం(నేషనల్ రూరల్ హెల్త్ మిషన్) డీపీఓ రాజారెడ్డి, క్లస్టర్ వైద్యాధికారి డాక్టర్ పద్మశ్రీ, సీహెచ్‌ఓ బొడ్డు ప్రసాద్, వైద్యులు చందు, ప్రసన్నకుమార్, సుధాకర్, సాజిత్, బజన్,జమాల్, విజయ్‌తో పాటు క్లస్టర్ పరిధిలోని జఫర్‌గడ్, కూనూరు, వేలేరు, ఘన్‌పూర్, మల్కాపూర్, తాటికొండ పీహెచ్‌సీల సూపర్‌వైజర్లు, హెచ్‌ఈఓలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.