health staff
-
కోల్‌కతా ఘటనపై నిరసన.. ఏపీ సర్కారు నోటీసులు
విజయవాడ, సాక్షి: రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతున్న ఏపీలో.. ఉద్యోగులపై వేధింపులు నానాటికీ పెరిగిపోతున్నాయి. తాజాగా.. వైద్య, ఆరోగ్య సిబ్బందికి బెదిరింపులు తారాస్థాయికి చేరాయి. ఆడబిడ్డకు అన్యాయం జరిగితే సానుభూతి చూపించాల్సిన ప్రభుత్వమే అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. దేశాన్ని కుదిపేసిన కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనకు నిరసనగా.. సంఘీభావ ర్యాలీలో పాల్గొన్నారని నోటీసులు పంపించింది. ఉద్యోగులపై కక్ష సాధింపులకు దిగిన కూటమి ప్రభుత్వం.. తాజాగా వైద్య సిబ్బందిని లక్ష్యంగా చేసుకుంది. పలు జిల్లాల్లో వైద్య సిబ్బందికి కోల్‌కతా ఘటనకి సంఘీభావం తెలిపారని నోటీసులు జారీ చేసింది. ఇందులో.. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ౩౩ మంది మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లకి నోటీసులు జారీ చేసింది. ముందస్తు అనుమతి తీసుకోకుండా ర్యాలీలో పాల్గొన్నారని, 24 గంటల్లోగా లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామని డీఎం అండ్ హెచ్‌వో పేరిట ఆ నోటీసులు జారీ అయ్యాయి. నోటీసులు అందుకున్న 33 మందిలో 31 మంది మహిళా సిబ్బందే ఉండడం గమనార్హం. కేవలం ఐఎంఏ పిలుపు మేరకు కోల్ కత్తా ఘటనపై నిరసనగా ర్యాలీ నిర్వహించామని, ఉద్దేశపూర్వకంగా తామేమీ తప్పు చేయలేదని మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లు వాపోతున్నారు. ఇక.. సత్యసాయి జిల్లాలో వైద్య సిబ్బందిపై మరో తరహా వేధింపులకు దిగింది. సమస్యలేవైనా ఉంటే.. వాటిని మంత్రులు, కలెక్టర్ల దృష్టికి అస్సలు తీసుకెళ్లకూడదని ఉత్తర్వులు జారీ చేసింది. అలా చేస్తే చర్యలు తప్పవని, శాశ్వత, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులెవరైనా తమ సమస్యలని మెడికల్ ఆఫీసర్ల స్థాయికి మాత్రమే చేరవేయాలని స్పష్టం చేసింది. ఆ వినతుల్ని పైకి పంపించే బాధ్యత మెడికల్ ఆఫీసర్లకు మాత్రమే ఉంటుందని పేర్కొంది. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలంటూ బెదిరింపులు జారీ చేసింది. ఎన్నికల ముందు ఉద్యోగులకి అండగా ఉంటామని చంద్రబాబుతో పాటు లోకేష్ గొప్పలు చెప్పారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులపై వేధింపులు దిగారు. దీంతో.. కూటమి ప్రభుత్వ తీరుపై వైద్య ఆరోగ్య శాఖలో ఆందోళన వ్యక్తం అవుతోంది. -
అజ్ఞాతవాసులు.. ఏ తల్లి కన్న బిడ్డలో!
పేరూ తెలియదు.. ఊరూ తెలియదు.. ఎక్కడి నుంచో సడన్‌గా ఊడిపడతారు. పరీక్షలు చేస్తారు. మందులు ఇస్తారు. జాగ్రత్తలూ చెప్తారు. వీళైతే మంచి తిండి కూడా అందిస్తారు. వాళ్ల ధ్యాసంతా అవతలి ప్రాణం కాపాడాలనే. కానీ, వాళ్ల ప్రాణం పోతుందన్న భయం మాత్రం వాళ్లకు ఉండట్లేదు ఎందుకనో!. ఈ కరోనా కష్టకాలంలో వైద్య సిబ్బంది పడుతున్న పాట్లు అంతా ఇంతా కాదు. వేవ్‌ల వారీగా విరుచుకుపడుతున్నా.. ఫ్రంట్ లైన్ వారియర్లుగా వాళ్లందించిన సేవల్ని అంత త్వరగా మరిచిపోలేం కూడా. అయితే వైరస్‌ను మించిన ముప్పు నుంచి తప్పించుకుంటూ తిరుగుతూ సేవలందిస్తున్నారు మయన్మార్‌లో వైద్యసిబ్బంది. ఈ ప్రయాణంలో నిర్బంధాలతోపాటు ప్రాణాలు సైతం పొగొట్టుకుంటున్నారు. ఏ తల్లి కన్నబిడ్డలో పాపం.. ఇప్పుడు వేలమంది ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు . చేతిలో బ్యాగు. బ్యాగు నిండా మందుల సరంజామా. ఒక చోటు నుంచి మరో చోటుకి గప్‌చుప్ ప్రయాణం. దొరికితే మాత్రం ఆయువు ముడినట్లే!. మయన్మార్‌లో హెల్త్ వర్కర్స్ క్షణమోక నరకంగా గడుపుతున్నారు. సైన్యం చేతిలో పదుల సంఖ్యలో వైద్య సిబ్బంది ప్రాణాలు పొగొట్టుకున్నట్లు గణాంకాలు చెప్తున్నాయి. ఫిబ్రవరిలో ఉవ్వెత్తున చెలరేగిన మయన్మార్ సైన్య దురాగతాలు.. 1500 మంది దాకా బలిగొన్నట్లు ఒక అంచనా(అనధికారికం). అప్పటి నుంచి ఆస్పత్రులు సిబ్బంది లేకుండా బోసిపోతున్నాయి. నిరసనకారుల్లో ఉన్న వైద్య సిబ్బందిని సైతం నిర్దాక్షిణ్యంగా మట్టుబెట్టింది జుంటా సైన్యం. జుంటా నుండి దాక్కున్న అనేక మంది మయన్మార్ నర్సులు కోవిడ్ రోగులకు చికిత్స చేయడానికి తాత్కాలిక క్లినిక్‌లను నడుపుతున్నారు. మిలిటరీ చెక్పాయింట్ల గుండా అక్రమంగా రవాణా చేయబడిన మందులతో సైన్యం కళ్లు కప్పి తిరుగుతున్నారు. సంబంధిత వార్త: మయన్మార్ నియంతల ఆగడం అడవుల్లో మకాం, పాడుబడ్డ స్కూళ్లలో.. మయన్మార్‌లో సైన్యం ఆరాచకాలు మొదలయ్యాక.. చాలామంది ప్రాణ భీతితో దేశం విడిచి పారిపోయే ప్రయత్నాలు చేశారు. వైద్య సిబ్బంది మాత్రం అక్కడే ఉండిపోయారు. మిలిటరీ-నిరసనకారుల మధ్య పోరు తారాస్థాయికి చేరడంతో.. వాళ్లలో చాలామంది అడవుల్లో తలదాచుకున్నారు. అదే టైంలో రోజూ 40వేల చొప్పున నమోదు అవుతూ వస్తున్న రోజూవారీ కొవిడ్ కేసుల్ని తగ్గించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. పాడుబడ్డ ఇళ్లలో, స్కూళ్లలో క్యాంపెయిన్లు నిర్వహిస్తున్నారు. పల్లెల్లో ఉన్న సౌకర్యాలతోనే పాపం వాళ్లు టెస్టులు, చికిత్స కొనసాగిస్తున్నారు. ఇప్పటిదాకా ఒమిక్రాన్ కేసు నమోదు కాలేదని, ఒకవేళ విజృంభణ మొదలైతే మాత్రం జనాలకు ఇబ్బందులు తప్పవని వాళ్లు జాగ్రత్తలు సూచిస్తున్నారు. సైన్యం ఆరాచకం కరోనా సోకినా పౌరులకు సైన్యం నుండి అందే వైద్యసాయం ఘోరంగా ఉంటోంది. బతికితే బతుకుతారు. చస్తే చస్తారు. అదే టైంలో సైన్యంలో ఎవరికైనా కరోనా సోకితే మాత్రం.. అత్యవసర సేవల కింద చికిత్స అందిస్తున్నారు. మరోవైపు అజ్ఞాతంలో ఉన్న వైద్య సిబ్బందికి మందులు చేరకుండా ఉండేందుకు వీలైనన్ని ఎక్కువ చెక్ పోస్టుల ద్వారా అడ్డుకుంటోంది సైన్యం. ఆరునెలలుగా కొనసాగుతున్న సైన్యం ఆరాచకాల్లో 190 మంది వైద్య సిబ్బందిని అరెస్ట్ చేయగా.. 25 మందికి దారుణాతిదారుణంగా హతమార్చినట్లు ఓ నివేదిక సారాంశం. వైద్య సిబ్బంది కుటుంబాలు సైతం తమ ప్రాణాలకు తెగించి.. పేషెంట్ల కోసం కృషి చేస్తుండడం ఈ పరిణామాల్లో అసలైన కొసమెరుపు. చదవండి: ఒక పోరాట యోధుడి అస్తమయం -
వైద్య సిబ్బందిపై ఈటల ఆసక్తికర ట్వీట్..
సాక్షి, హైదరాబాద్: భూకబ్జాల ఆరోపణల నేపథ్యంలో ఈటల రాజేందర్‌ను వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖమంత్రి పదవి నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈటల తాను ఆరోగ్య మంత్రిగా పని చేసిన కాలంలో తనకు సహకారం అందించిన ప్రతి ఒక్కరికి ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. ‘‘కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి, కుటుంబాలను వదిలిపెట్టి ప్రజలకు కరోనా చికిత్స అందించిన వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతధికారులు, డాక్టర్స్, నర్సులు, సెక్యూరిటీ, శానిటరీ, నాలుగవ తరగతి సిబ్బంది, గ్రామాల్లో పని చేస్తున్న ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు అందరికీ శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను’’ అన్నారు ఈటల. అంతేకాక ‘‘గత రెండు సంవత్సరాలుగా ముఖ్యంగా గత 395 రోజులుగా ఒక్క రోజు కూడా విరామం లేకుండా పనిచేస్తూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా నాకు సహకారం అందించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు’’ అంటూ ఈటల ట్వీట్ చేశారు. కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి, కుటుంబాలను వదిలిపెట్టి ప్రజలకు కరోనా చికిత్స అందించిన వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతధికారులు, డాక్టర్స్, నర్సులు, సెక్యూరిటీ,శానిటరీ, నాలుగవ తరగతి సిబ్బంది, గ్రామాల్లో పని చేస్తున్న ANM లు, ఆశా వర్కర్లు అందరికీ శిరస్సు వంచి ధన్యవాదములు తెలుపుతున్నాను. — Eatala Rajender (@Eatala_Rajender) May 1, 2021 చదవండి: ఏ శాఖ లేకున్నా ప్రజలకు సేవ చేస్తాను: ఈటల -
ఉస్మానియా ఆస్పత్రి సిబ్బంది నిర్వాకం
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రిలో రోగులు అవస్థలు పడుతున్నారు. సరైన సౌకర్యాలు కల్పించని ఆస్పత్రి సిబ్బంది నిర్వాకంతో రోగులు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారు. ఆస్పత్రిలో కావాల్సినన్ని గ్లూకోజ్ స్టాండ్లు అందుబాటులో లేకపోవడంతో పేషెంట్లు గ్లూకోజ్ స్టాండ్‌కి బదులు బెడ్స్ కర్ర సహాయంతో సెలైన్ బాటిల్స్‌ను ఎక్కించుకుంటున్నారు. ఈ దయనీమైన పరిస్ధితి గురించి మీడియాకి సమాచారం అందడంతో అప్రమత్తమైన సిబ్బంది రోగులకు గ్లూకోజ్ స్టాండ్లు తెప్పించారు. -
శిరస్సు వంచి నమస్కరించిన అమితాబ్
ముంబై: కరోనా బారినపడి ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బిగ్ బీ అమితాబ్ బచ్చన్ వైద్య సిబ్బందిని దేవుడితో పోల్చారు. దేవుళ్లు తెల్లకోటు వేసుకుని డాక్టర్ల రూపంలో ప్రజలకు సేవ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. వైద్యుల సేవలపట్ల ఆయన శిరస్సు వంచి నమస్కరించారు. ఆయన సెల్ఫీ వీడియోలో మాట్లాడుతూ.. నానావతి ఆస్పత్రి సిబ్బంది ఈ కష్టకాలంలో చేస్తున్న అద్భుత సేవలను అభినందిస్తున్నా. కొద్ది రోజుల క్రితం సూరత్‌లో ఒక బిల్ బోర్డు చూశాను. గుడులు ఎందుకు మూతబడ్డాయో తెలుసా? భగవంతుడు ఆలయాలు వీడి తెల్లకోటు వేసుకుని ఆస్పత్రుల్లో సేవ చేస్తున్నారు. ఆస్పత్రుల్లో పనిచేస్తున్న అందరిలోనూ దేవుడు ఉన్నాడు. మీ సేవలతో మానవత్వాన్ని కాపాడుతున్నారు. మీ సేవలకు శిరస్సువంచి నమస్కరిస్తున్నా. మీరే లేకపోతో మానవత్వం ఏమయ్యేదో. ఈ కరోనా కష్టకాలంలో ఎవరూ నిరాశ చెందొద్దు. ఆందోళన పడొద్దు. కలిసికట్టుగా పనిచేసి కరోనాకష్టాల నుంచి బయటపడదాం. నా ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు. కరోనాపై పోరాడుతున్న వారందరూ భగవంతుని స్వరూపాలు’అని అమితాబ్ పేర్కొన్నారు. (చదవండి: నటుడి కుటుంబంలో నలుగురికి కరోనా) ఇక నానావతి ఆస్పత్రిలోని రెస్పిరేటరీ ఐసోలేషన్ యూనిట్లో చికిత్స పొందుతున్న అమితాబ్, అభిషేక్‌ల ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని వైద్యులు తెలిపారు. వారిద్దరికీ స్వల్పస్థాయిలోనే వైరస్ లక్షణాలు ఉన్నాయని వెల్లడించారు. బిగ్ బీ, అభిషేక్ చికిత్స నేపథ్యంలో నానావతి ఆస్పత్రి వద్ద పోలీసు అధికారులు భద్రతను పెంచారు. ఇక తండ్రీ కొడుకులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో అమితాబ్ నివాసం ‘జల్సా’ వద్ద బీఎంసీ అధికారులు శానిటైజేషన్ పనులను పర్యవేక్షించారు. జల్సాను కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించి మెయిన్ గేట్‌కు బ్యానర్ అంటించారు. (అమితాబ్‌కు మెగాస్టార్ చిరు ట్వీట్) -
శిరస్సు వంచి నమస్కరించిన అమితాబ్
-
క్వారంటైన్‌కు వెళ్లకుండా నేరుగా డ్యూటీకి!
సాక్షి, నిజామాబాద్/భిక్కనూరు: కరోనా పాజిటివ్ వచ్చిన వారి ప్రైమరీ కాంట్రాక్టు వ్యక్తుల్లో కరోనా లక్షణాలు కనిపించకున్న హోంక్వారంటైన్లో ఉండాలని సూచించే వైద్య సిబ్బందే నిబంధనలను ఉల్లంఘించారు. క్యారంటైన్‌కు వెళ్లకుండా వైద్య సిబ్బంది విధులకు హాజరైయ్యారు. వివరాలు.. భిక్కనూరు ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్న వైద్యురాలికి శుక్రవారం కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో సదరు వైద్యురాలికి సంబందించి 33మంది ప్రైమరీ కాంట్రాక్టు వ్యక్తులను గుర్తించారు. వీరిలో 29 మంది వైద్య సిబ్బంది, ఆసుపత్రిలో పనిచేసేవారు కాగా, మిగతా నలుగురు వైద్య సిబ్బంది సంబదికులుగా ఉన్నారు. వీరందరి నమూనాలను ఈనెల 12న క రోనా పరీక్షలకు పంపిస్తారు. ఈక్రమంలో వీరంద రూ ఫలితాలు వచ్చే వరకు హోం క్వారంటైన్లో ఉండాల్సి ఉంటుంది. (చదవండి: నిర్లక్ష్యంపై బిగుసుకుంటున్న ఉచ్చు!) కానీ, శనివారం యథావిధిగా ఆ సుపత్రిలో పనిచేసే పలువురు సిబ్బంది విధులకు వచ్చారు. ఇలా విధులకు రావడం కొవిడ్ నిబందనల కు విరుద్దమని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సుపత్రిలో పనిచేసే సిబ్బంది ఇతర ప్రాంతాల్లో ని వాసం ఉంటారని వారు బస్సులో విధులు నిర్వర్తించేందుకు వచ్చారని ఒకవేళ ఈ సిబ్బందిలో ఎవరికైన కరోనా పాజిటివ్ ఉంటే బస్సులో ప్రయాణించిన మిగత ప్రయాణికుల పరిస్థితి ఏమి కావాలని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైద్యశాఖ ఉన్న తాధికారుల ఆదేశాల మేరకే తాము విధలుకు వచ్చా మని సిబ్బంది తెలిపారు. నిబంధనలు పాటించాలని,కరోనా ఫలితాలు వెలువడే వ రకు ప్రైమరీ కాంట్రాక్టు వ్యక్తులు హోంక్వారంటైన్లో ఉండా లని చె ప్పే వైద్య సిబ్బందే ఇలా నిబంధనలు పాటించకుండా విధులకు హాజరవ్వడం మండలంలో చర్చనీయంశమైంది. (కరోనాను జయించినా.. మరణం తప్పలేదు) -
32 మంది వైద్య సిబ్బందికి కరోనా!
సాక్షి, హైదరాబాద్: కరోనా పోరాటంలో ముందు వరుసలో ఉండే పోలీసు, వైద్య సిబ్బందిలో వైరస్ వ్యాప్తి కలకలం రేపుతోంది. సోమవారం జరిపిన పరీక్షల్లో పేట్ల బురుజు ప్రసూతి ఆస్పత్రిలో 32 మంది వైద్య సిబ్బందికి వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు తెలిసింది. వారిలో 18 మంది వైద్యులు, 14 మంది సిబ్బంది ఉన్నారు. కాగా, పూర్తిస్థాయి జాగ్రత్తలు, పీపీఈ కిట్లు ధరించినప్పటికీ వైద్య సిబ్బందికి కరోనా సోకవడం ఆందోళన కలిగిస్తోంది. (చదవండి: వారియర్స్‌లో వర్రీ!) ఇప్పటికే ఉస్మానియా వైద్య కళాశాల అనుబంధ ఆస్పత్రులతో పాటు, నిమ్స్, కింగ్ కోఠి, గాంధీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో పదుల సంఖ్యలో వైద్య సిబ్బంది వైరస్ బారినపడిన సంగతి తెలిసిందే. మరోవైపు ప్రభుత్వ యంత్రాంగంలో కీలకంగా వ్యవహరించే ప్రజా ప్రతినిధులూ కోవిడ్ బారినపడుతున్నారు. జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిగిరి రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాకు పాజిటివ్‌గా తేలింది. (చదవండి: 30 నియోజకవర్గాల పరిధిలో 50 వేల పరీక్షలు) -
ఆరోగ్య సిబ్బందికి ఎన్–95 మాస్కులు, పీపీఈ కిట్లు: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కరోనాపై పోరులో భాగంగా వైద్య సిబ్బందికి కీలకమైన ఎన్–95 మాస్కులు, పీపీఈ (పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్) కిట్ల ఉత్పత్తి పెరిగింది. గత మార్చికి, ఇప్పటికి దేశీయంగా తయారవుతున్న ఈ ఉత్పత్తులు మూడింతలు పెరిగాయి. ఈ విషయాన్ని కేం ద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘దేశం లో కరోనా కేసులు పెరుగుతుండటంతో రోగులకు చికిత్స అందించడానికి ఎన్–95 మాస్కులు, పీపీఈ అవసరం పెరిగింది. దీనిపై పలు రాష్ట్రాల్లో వైద్యులు ఆందోళన కూడా వ్యక్తంచేశారు. మార్చి 30వ తేదీన అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. ఒక రోజుకు 68,350 ఎన్–95 మాస్కులు, 3,312 పీపీఈ కిట్లు మాత్రమే ఉత్పత్తి చేయగలిగేవాళ్లం. కానీ, ఏప్రిల్ 30నాటికి పరిస్థితి పూర్తిగా మారింది. ఇపుడు రోజుకు 2,30,500 ఎన్–95 మాస్కులు, 1,86,472 పీపీఈ కిట్లు ఉత్పత్తి చేస్తున్నాం’ అని వివరించారు. వీటిని కరోనా విధుల్లో ఉన్న ఆరోగ్య సిబ్బందికి అందజేస్తామని కిషన్‌రెడ్డి తెలిపారు. -
ఒకవేళ తక్కువ రేటుకు ఏ రాష్ట్రానికైనా అమ్మితే...
-
వైద్య సిబ్బందిపై మరోదాడి!
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని మోరీదాబాద్‌లో వైద్య ఆరోగ్య సిబ్బందిపై దాడి చేసిన వారిపై వెంటనే కేసులు నమోదు చేయాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ ఆదేశించారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అనుమానితులను క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. అయితే ఈ క్రమంలో వైద్య ఆరోగ్య సిబ్బందిపైన దాడులు చేస్తున్న ఘటనలు దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. అంతకు ముందు వైద్యుల పై జరిగిన దాడిని మరువక ముందే ఉత్తరప్రదేశ్‌లోని మోరీదాబాద్‌లో వైద్యాఆరోగ్య సిబ్బందిపై రాళ్లదాడికి పాల్పడ్డారు. మోరీదాబాద్‌లో ఇద్దరు కరోనా అనుమానితులు ఉన్నారనే సమాచారంతో వారిని తీసుకువచ్చేందుకు ప్రయత్నించిన వైద్య ఆరోగ్య సిబ్బందిపై అక్కడి వారు రాళ్ల దాడిచేశారు. అంతేకాకుండా వారిని రక్షించడానికి వచ్చిన పోలీసులపై కూడా ఇదే తరహాలో రాళ్లదాడికి పాల్పడ్డారు. #UPDATE Today a very unfortunate incident took place in Moradabad. A team of doctors had gone to take family of #COVID19 positive patient (who died recently), to take them to a quarantine facility. 3 people injured including a doctor & pharmacist: Dr SP Garh,Chief Medical Officer https://t.co/BFh2Ply4fO pic.twitter.com/tDgI9cLWmE — ANI UP (@ANINewsUP) April 15, 2020 ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన వారందరిని గుర్తించి వారిపై నేషనల్ సెక్యూరిటి యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని సీఎం యోగి ఆదిత్యనాధ్ పోలీసులను ఆదేశించారు. ప్రభుత్వఆస్తులు ధ్వంసం కావడంతో అవి కూడా వారితోనే కట్టించాలని ఆదేశించారు. ఈ దాడికి పాల్పడిన 10 మందిని గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. ఇప్పటి వరకు భారత్‌లో 12,380 కరోనా కేసులు నమోదు కాగా 414 మంది మరణించారు. -
ఫుట్‌బాలర్ జాహా ఔదార్యం
లండన్: కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు నిరంతరాయంగా శ్రమిస్తోన్న వైద్యులకు సాంత్వన కల్పించేందుకు ఐవరీకోస్ట్ యువ ఫుట్‌బాలర్ విల్ఫ్రెడ్ జాహా ముందుకొచ్చాడు. లండన్‌లో తనకున్న 50 వాణిజ్య ప్రాపర్టీలను ఉచితంగా వైద్యుల వసతి కోసం కేటాయించాడు. ప్రీమియర్ లీగ్ క్లబ్లో క్రిస్టల్ ప్యాలెస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించే జాహా ఈ లీగ్ ద్వారా వారానికి కోటి రూపాయలకు పైగా ఆర్జిస్తాడు. ఈ ప్రాపర్టీలను కార్పొరేట్ క్లయింట్ల అవసరాల కోసం అందుబాటులో ఉంచే జాహా... వీటిని ఇంటికి వెళ్లేంత సమయం లేని వైద్యుల వసతి కోసం ఇస్తున్నట్లు పేర్కొన్నాడు. ‘మనం మంచి చేస్తే మనకు అదే తిరిగి వస్తుంది. నాకు జాతీయ ఆరోగ్య సేవా సంస్థలో పనిచేసే స్నేహితులు ఉన్నారు. వారు ఎలాంటి పరిస్థితుల్లో పనిచేస్తారో నాకు తెలుసు. ఆరోగ్య శాఖలో పనిచేసే వారు వీటిని ఉపయోగించుకోవచ్చు’ అని జాహా పేర్కొన్నాడు. జాహా కన్నా ముందు మాంచెస్టర్ యునైటైడ్ మాజీ స్టార్ ప్లేయర్ గ్యారీ నెవెలీ తన హోటల్స్‌లోని 176 గదులను, చెల్సీ యజమాని రోమన్ అబ్రామోవిచ్ 72 గదులను వైద్యుల కోసం కేటాయించారు. -
వైద్యసిబ్బందిని నియమిస్తాం
వైద్య విధాన పరిషత్ జిల్లా కో–ఆర్డినేటర్ సుబ్బారావు రాపూరు: రాపూరు ప్రభుత్వ వైద్యశాలలో వైద్య సిబ్బందిని నియమిస్తామని వైద్యవిధాన పరిషత్ జిల్లా కో–ఆర్డినేటర్ సుబ్బారావు పేర్కొన్నారు. రాపూరు ప్రభుత్వ వైద్యశాలను శుక్రవారం తనిఖీ చేసిన జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి వైద్యసిబ్బంది లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీంతో జిల్లా కోఆర్డినేటర్ రాపూరు ప్రభుత్వ వైద్యశాలను శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యశాలలో సరిపడా వైద్యులను నియమించినట్లు తెలిపారు. కొంత మంది సెలవులో వెళ్లడంతో సమస్య తలెత్తిందన్నారు. నర్సులు కొరత ఉందని, డిప్యుటేషన్‌పై నర్సులను నియమిస్తామన్నారు. వైద్యశాల భవనం నిర్మాణంలో ఉన్నందున పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందించలేకపోతున్నామన్నారు. భవనాలు అందుబాటులోకి వస్తే పూర్తి స్థాయిలో వైద్యసేవలు అందిస్తామని తెలిపారు. ఆయన వెంట వైద్యులు శ్రీనివాసరావు, ప్రతిమ ఉన్నారు. -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
ఖానాపూర్ : వర్షాకాలం సీజన్ ప్రారంభం అయినందున ఆరోగ్యశ్రీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా మలేరియా అధికారి అల్హం రవి అన్నారు. శుక్రవారం ఖానాపూర్లోని సీహెచ్ఎన్సీ క్లస్టర్ కార్యాలయంలో పెంబి, కడెం, దస్తురాబాద్, మామడ పీహెచ్‌సీల సిబ్బందితో సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో ప్రజల ఆరోగ్య పరిస్థితులు, జ్వరాల గురించి ఎప్పటికప్పుడు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. గత ఏడాది మలేరియా, డెంగ్యూ కేసులు ఈ ప్రాంతంలో అదికంగా నమోదయిన కారణంగా ముందే అప్రమత్తంగా ఉండాలన్నారు. హెల్త్ సూపర్వైజర్లు ఈసీజన్లో విధిగా గ్రామాల్లో పర్యటించాలన్నారు. ఆరోగ్య సిబ్బంది, సమన్వయంతో టీం వర్క్చేసినపుడే వ్యాదులు ప్రబలకుండా పరిస్థితి అదుపులో ఉంటుందన్నారు. మామడ, పెంబి పీహెచ్‌సీల్లో పనితీరు మెరుగుపడాల్సి ఉందన్నారు. ప్రధానంగా వర్షాకాలం సీజన్లో హెల్త్ సూపర్వైజర్లు పంచాయతీ అధికారులు, సిబ్బందితో సమన్వంగా ముందుకెళ్తూ పారిశుధ్య నిర్మూలనపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. నిర్మల్ ఏరియా ఆసుపత్రిలో డెంగ్యూ, జ్వర పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని గ్రామాల్లో ఆరోగ్య సిబ్బంది రక్తనమూనాలు సేకరించి మలేరియా డెంగ్యూ పరీక్షలపై ప్రజలకు తెలియపరుచాలన్నారు. కార్యక్రమంలో ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ సీఎం వేణుగోపాలకృష్ణ, కడెం పీహెచ్సీ వైద్యాదికారి మానస, సీహెచ్‌వో లింబాద్రి, పెంబి హెచ్‌ఈవో తుఫ్రాన్ వేణుగోపాల్, గాడ్పు రవి, గోపాల, సదయ్య, మహెందర్, బోజరెడ్డి తదితరులున్నారు. -
చిన్నారుల ప్రాణాలతో చెలగాటం
సాక్షి నిఘా * చల్లదనంలో ఉంచాల్సిన పోలియో వ్యాక్సిన్ కిట్లు గ్రామాల్లోనే.. * ఆ వ్యాక్సిన్ వేస్తే ..వికటించే ప్రమాదమంటున్న ఆరోగ్య సిబ్బంది * రవాణా ఖర్చులు మింగుతున్న వైనం * కొరవడిన అధికారుల పర్యవేక్షణ తిప్పర్తి: పోలియో రహిత సమాజ స్థాపన కోసం కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి రెండు పర్యాయాలు పల్స్‌పోలియో చుక్కలు వేసే విధంగా వ్యాక్సిన్లను పంపిణీ చేస్తోంది. వైద్య, ఆరోగ్య సిబ్బంది, అధికారులు నిర్లక్ష్యంతో చిన్నారులకు ప్రాణాలకే ముప్పు ఏర్పడుతోంది. ఎప్పుడు చల్లదనంలో ఉండాల్సిన వ్యాక్సిన్లను (కిట్) ఆయా గ్రామాల్లోని అంగన్వాడీ, ఆశ వర్కర్ల వద్దనే ఉంచుతున్నారు. 3 రోజుల పాటు నిర్వహించే ఈ పల్స్ పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమం సందర్భంగా ప్రతి రోజు పీహెచ్సీ నుంచి కిట్లను తీసుకొని వాహనాల ద్వారా ఆయా గ్రామాలకు పంపిణీ చేయాలి. మొదటి రోజునే ఆ కిట్లను ఇచ్చేసి 3వ రోజు తిరిగి వాటిని తెస్తున్నారు. దీంతో ‘‘వ్యాక్సిన్’’ వికటించే అవకాశం ఉంటుందని కొంతమంది ఆరోగ్య సిబ్బంది అంటున్నారు. కిట్లను సరఫరా చేసేందుకు ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులను మింగేందుకే ఇలా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వ్యాక్సిన్ కూలింగ్ ఇలా... పోలియో చుక్కల వ్యాక్సిన్‌ను ఎప్పుడు చల్లని ప్రదేశంలో భద్రపరచాలి. వ్యాక్సిన్ ఫ్రీజ్‌లో ఉంచి బయటకు తీసుకెళ్లెటప్పుడు కిట్ (డబ్బ)లో నాలుగు ఐస్ప్యాడ్ల నడుమ వ్యాక్సిన్ ఉంచి మరో ఐస్గడ్డల ప్యాకెట్లను రెండింటిని వేస్తారు. ఇలా ఐస్ ప్యాడ్స్లు ఢీ ఫ్రీజ్‌లో -2, -8 సెంటి డిగ్రీల చల్లదనంలో కూల్ అయిన తర్వాత కిట్‌లో ఉంచుతారు. దీంతో 8 గంటల వరకు ఈ చల్లదనం ఉంటుంది. పోలియో చుక్కలు వేసిన అనంతరం కిట్స్‌ను, ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి ఢీ ఫ్రీజ్‌లో ఐస్ ప్యాడ్లను, వ్యాక్సిన్లను కూలింగ్ పెట్టి మరునాడు ఆయా గ్రామాలకు సరఫరా చేయాలి. ఇలా 3 రోజుల పాటు ఈ పోలియో చుక్కల వ్యాక్సిన్లను ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కూలింగ్ పెట్టాలి. చల్లదనం లేకుంటే.. పోలియో వ్యాక్సిన్ తయారీ నుంచి పంపిణీ చేసేంత వరకు చల్లదనంలోనే ఉంటుంది. అయితే సరైన చల్లదనం లేనప్పుడు స్టేజీల వారీగా వి.వి.ఎం. శాతం పడిపోతుంది. అందులో 1వ, 2వ స్టేజీల వరకు పోలియో చుక్కలను చిన్నారులకు వేసుకోవచ్చు. తర్వాత స్టేజీలో ఆ చుక్కలు వేసిన పనిచేయకపోవడం, వికటించే అవకాశం ఉంటుంది. రవాణా ఖర్చులు నొక్కేసేందుకే ? పోలియో చుక్కల కార్యక్రమం 3 రోజులు మండల కేంద్రంలోని పీహెచ్సీ నుంచి కిట్లను ఆయా గ్రామాలకు సరఫరా చేసేందుకు ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తంలోనే నిధులు వస్తాయని వాటిని కాజేసేందుకే ఇలా ఒక్క రోజు మాత్రమే కిట్స్ సరఫరా చేసి ఆయా గ్రామాలలోని అంగన్వాడీ, ఆరోగ్య సిబ్బందికి కిట్స్ ఇస్తున్నారు. దీంతో మొదటి రోజు - 2, -8 డిగ్రీల చల్లదనంతో ఇచ్చిన ఐస్ప్యాడ్లు కరిగి నీరుగా మారి కూలింగ్ శాతం తక్కువ అవుతుంది. ఇలా కిట్లను తమవద్దనే ఉంచుకునేందుకు కొంత మంది అంగన్వాడీ వర్కర్లు సంసిద్ధత వ్యక్త చేస్తున్నా పట్టించుకోకుండా వైద్యాధికారులు, సిబ్బంది అలాగే వదిలేసి వెళుతున్నారు. దీంతో ‘‘వ్యాక్సిన్’లో వి.వి.ఎం. (వ్యాక్సిన్, వైల్, మానిటర్) శాతం తక్కువై ఆ చుక్కలు వేసినా ఉపయోగం ఉండకపోవడంతో పాటు వికటించే అవకాశం ఉంటుంది. ఓ ఉద్యోగి కనుసన్నల్లోనే.. మండల కేంద్రంలో పనిచేసే ఓ సూపర్వైజర్ ఈ తతంగం అంతా నడిపిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మండలంలో మొత్తం 50 పోలియో చుక్కల బూత్‌లు ఉండగా వాటిని 5 రూట్లుగా విభజించి సూపర్వైజర్లు ప్రతి రోజు ఆయా బూత్‌లకు వ్యాక్సిన్ కిట్లను తీసుకువెళ్లాలి. కానీ రవాణా ఖర్చులను నొక్కేసేందుకు ఓ సూపర్వైజర్ ఒక్క రోజు కిట్లను ఇచ్చేసి చివరి రోజు తెచ్చుకునేలా రెండు ఆటోలను మాట్లాడినట్లు తెలిసింది. అయితే పర్యవేక్షించాల్సిన వైద్యాధికారులు పట్టించుకోకపోవడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. ఇలా జిల్లా మొత్తంలో కూడా సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నట్లు కొంతమంది అంగన్వాడీలు, ఆరోగ్య సిబ్బంది అంటున్నారు. -
విషజ్వరాలతో గ్రామాలు విలవిల
మంగళగిరి : విష జ్వరాలు విసృ్తతంగా వ్యాపిస్తున్నాయి. దీంతో రాజధాని గ్రామాలు మంచం పడుతున్నాయి. తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాలతో పాటు దుగ్గిరాల మండలంలోని పలు గ్రామాలలో విష జ్వరాలు ప్రబలడంతో ప్రజలు విలవిలలాడిపోతున్నారు. ప్రధానంగా గ్రామాల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల్లో ఇంటికి ఒకరిద్దరు చొప్పున విష జ్వరాలతో బాధ పడుతున్నారు. మంగళగిరి మండలంలో నిడమర్రు, బేతపూడి, కురగల్లు గ్రామాలతో పాటు తాడేపల్లి, ఉండవల్లి, వడ్డేశ్వరం తుళ్లూరు మండలం పెదపరిమి, మందడం, దుగ్గిరాల మండలం మంచికలపూడిలతో పాటు పలు గ్రామాలలో జ్వరాలు ప్రబలడంతో ప్రజలు భయాందోళన లు వ్యక్తం చేస్తున్నారు. కామెర్లతో ముగ్గురు మృతి.. దుగ్గిరాల మండలం మంచికలపూడిలో వైద్యశిబిరాలు కొనసాగుతుండగా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామంలో గత పది రోజుల వ్యవధిలో జ్వరాలు, కామెర్లతో ముగ్గురు మృతి చెందారు. ఆయా గ్రామాల నుంచి జ్వరాలతో తాడేపల్లి మండలంలో 72 మంది, దుగ్గిరాల మండలంలో 200 మంది, మంగళగిరి మండలంలో 64 మంది, తుళ్లూరు మండలంలో 42 మంది వెరసి మొత్తం 378 మంది జ్వరాలతో బాధ పడుతున్నట్లు అధికారిక లెక్కలే చెబుతుండగా, మరో 300కుపైగా రోగులు వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. జ్వరంతో ప్రైవేటు ఆసుపత్రికి వెళ్తే ఇదే అదనుగా డెంగీ అని భయపెడుతూ పరీక్షలు, చికిత్సల పేరుతో దోచుకుంటున్నారు. ఆర్ఎంపీ వైద్యుడు దగ్గరికి వెళ్లినా పరీక్షలు చేయించుకోవాలని అతనికి తెలిసిన ఆసుపత్రిలో చేరుస్తూ కమీషన్లు వసూల్ చేసుకుంటున్నారు. డెంగీ, చికెన్‌గున్యా, మలేరియా పేర్లతో ఆయా ఆసుపత్రుల్లో దోపిడీ చేస్తున్నారని పేద రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టించుకోని పంచాయతీలు.. పది రోజులుగా గ్రామాల్లోని ప్రజలు జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధ పడుతున్నా ఆరోగ్య సిబ్బందిగానీ, పంచాయతీ సిబ్బందిగానీ పట్టించుకున్న దాఖలాల్లేవు. ఆయా కాలనీల్లో డ్రైనేజి కాలువలు సక్రమంగా లేకపోవడంతో వర్షం నీరు, మురుగునీరు ఎక్కడికక్కడే రోడ్లపై నిలిచిపోయాయి. వర్షాల కారణంగా తాగునీరు సైతం కలుషితం అయ్యాయి. ప్రజలు బోర్ల నీటినే తాగుతున్నారు. బావుల్లో కనీసం బ్లీచింగ్ కూడా చల్లటం లేదు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి గ్రామాల్లోని ఎస్సీ,ఎస్టీ కాలనీలతో పాటు బీసీ కాలనీల్లో వందలాది మంది విష జ్వరాలతో బాధపడుతున్నారు. అధ్వానంగా ఉన్న పారిశుద్ధ్యం కారణంగా దో మలు పెరిగి జ్వరాలు వ్యాపిస్తున్నాయి. తక్షణమే ఆయా గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్మూలనకు చర్యలు తీసుకోవాలి. ప్రత్యే క వైద్య శిబిరాలు నిర్వహించి మందులు పంపిణీ చేయాలి. అందుబాటులో ఉన్న పీహెచ్‌సీల్లో అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలి. జిల్లా వైద్యాధికారి, కలెక్టర్ దృష్టికి కూడా సమస్యను తీసుకెళ్లాం. వెంటనే చర్యలు తీసుకోవాలని కోరాను. - ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే, మంగళగిరి -
లబ్ధిదారులందరికీ పింఛన్లు
- జిల్లాకు 2లక్షల 5 వేలు మంజూరు - జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ జక్రాన్‌పల్లి :అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆసరా పింఛన్లను అందజేస్తామని జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్ స్పష్టం చేశారు. జిల్లాకు రెండు లక్షల 5వేల మందికి ఆసరా పింఛన్లను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. గురువారం మండలంలోని పడకల్,మనోహరాబాద్,జక్రాన్‌పల్లి గ్రామాల్లో కలెక్టర్ పర్యటించారు. జక్రాన్‌పల్లి మండల పరిషత్తు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో పింఛన్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా పలువురు కలెక్టర్‌కు పింఛన్లు రావడంలేదని విన్నవించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. వృద్ధులు,వికలాంగులు ఎవరు కూడా నిరుత్సాహ పడవద్దన్నారు. పింఛన్లు రావని ఎవరు అపోహలకు గురికావద్దన్నారు. అర్హులైన లబ్ధిదారులకు తప్పనిసరిగా ఆసరా పింఛన్లను అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనంతరం ఎంపీడీఓ, తహశీల్దార్ కార్యాలయాల్లో ఆసరా పింఛన్లు,ఆహార భద్రత కార్డులకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదే సమయంలోఎలాంటి వివరాలు లేకుండా ఐకేపీ ఏపీఎం శ్యామ్ కార్యాలయానికి రావడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం మనోహరాబాద్ శివారులో గల విమానాశ్ర యం ప్రతిపాదిత స్థలాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఎయిర్‌పోర్టుకు స్థలం అనుకూలంగా ఉందని సంతృప్తి వ్యక్తం చేశారు. అదేవిధంగా పడకల్లో పరిశ్రమల స్థాపన కోసం 410 సర్వే నెంబర్లోని ప్రభుత్వ భూమిని కలెక్టర్ పరిశీలించారు. ఆరోగ్య సిబ్బందిపై ఆగ్రహం.. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. అధికారుల హాజరు పట్టికను పరిశీలించారు. మెడికల్ ఆఫీసర్లు అందుబాటులో లేకపోవడంతో, మెడికల్ ఆఫీసర్-1 సంతోష్‌కుమార్ వర్ని క్యాంపులో ఉన్నట్లు సిబ్బంది తెలిపారు. మరో మెడికల్ ఆఫీసర్ విజయ్‌కుమార్ సెలవులో ఉన్నారని చెప్పారు. కాగా సీనియర్ అసిస్టెంట్ సురేందర్‌రెడ్డి మాత్రం సెలవు లేకపోయినా, సీఎల్ వేసుకొని వెళ్లడంతో, ఎవరి అనుమతి లేకుండా సీఎల్ వేసుకోవ డం ఏంటని సిబ్బందిపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ వెంట ఆర్డీవో యాదిరెడ్డి,జడ్పీటీసీ సభ్యురాలు తనుజారెడ్డి,సర్పంచ్ల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గోర్త రాజేందర్,మనోహరాబాద్ సర్పంచ్ తిరుపతిరెడ్డి, అధికారులు ఉన్నారు. -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
స్టేషన్‌ఘన్‌పూర్ టౌన్ : ప్రస్తుత సీజన్లో అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, సీజనల్ వ్యాధులపై వైద్యులు, ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్ఓ డాక్టర్ శ్రీరామ్ ఆదేశించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ క్లస్టర్ ఆస్పత్రిలో క్లస్టర్ పరిధిలోని పీహెచ్‌సీలకు చెందిన వైద్యులు, వైద్య సిబ్బందితో శనివారం సాయంత్రం ఆయన ప్రత్యేకంగా సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా ఆయా పీహెచ్‌సీల్లో వైద్యుల పనితీరు, సీజనల్ వ్యాధులు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో వైద్యశిబిరాల నిర్వహణ, టీకాల కార్యక్రమం, కుటుంబ నియంత్రణ క్యాంపులు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు, డెంగ్యూ, మలేరియా, టీబీ, కుష్టువ్యాధి కేసులు తదితర అంశాలపై పీహెచ్‌సీల పరిధిలవారిగా సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైద్యులు, సిబ్బంది ఆస్పత్రులకు వేళకు రావాలని, విధిగా సమయపాలన పాటించాలన్నారు. డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ రాజయ్య సొంత నియోజకవర్గం కావడంతో అందరి దృష్టి ఆస్పత్రులపైనే ఉంటుందని, వైద్యులు అంకితభావంతో, బాధ్యతగా పనిచేయాలని సూచించారు. సమీక్షలో ఎన్ఆర్హెచ్ఎం(నేషనల్ రూరల్ హెల్త్ మిషన్) డీపీఓ రాజారెడ్డి, క్లస్టర్ వైద్యాధికారి డాక్టర్ పద్మశ్రీ, సీహెచ్ఓ బొడ్డు ప్రసాద్, వైద్యులు చందు, ప్రసన్నకుమార్, సుధాకర్, సాజిత్, బజన్,జమాల్, విజయ్‌తో పాటు క్లస్టర్ పరిధిలోని జఫర్గడ్, కూనూరు, వేలేరు, ఘన్పూర్, మల్కాపూర్, తాటికొండ పీహెచ్‌సీల సూపర్వైజర్లు, హెచ్‌ఈఓలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.