సాక్షి, హైదరాబాద్: భూకబ్జాల ఆరోపణల నేపథ్యంలో ఈటల రాజేందర్‌ను వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖమంత్రి పదవి నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈటల తాను ఆరోగ్య మంత్రిగా పని చేసిన కాలంలో తనకు సహకారం అందించిన ప్రతి ఒక్కరికి ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. ‘‘కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి, కుటుంబాలను వదిలిపెట్టి ప్రజలకు కరోనా చికిత్స అందించిన వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతధికారులు, డాక్టర్స్, నర్సులు, సెక్యూరిటీ, శానిటరీ, నాలుగవ తరగతి సిబ్బంది, గ్రామాల్లో పని చేస్తున్న ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు అందరికీ శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను’’ అన్నారు ఈటల.
అంతేకాక ‘‘గత రెండు సంవత్సరాలుగా ముఖ్యంగా గత 395 రోజులుగా ఒక్క రోజు కూడా విరామం లేకుండా పనిచేస్తూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా నాకు సహకారం అందించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు’’ అంటూ ఈటల ట్వీట్ చేశారు.
కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి, కుటుంబాలను వదిలిపెట్టి ప్రజలకు కరోనా చికిత్స అందించిన వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతధికారులు, డాక్టర్స్, నర్సులు, సెక్యూరిటీ,శానిటరీ, నాలుగవ తరగతి సిబ్బంది, గ్రామాల్లో పని చేస్తున్న ANM లు, ఆశా వర్కర్లు అందరికీ శిరస్సు వంచి ధన్యవాదములు తెలుపుతున్నాను.
— Eatala Rajender (@Eatala_Rajender) May 1, 2021
Comments
Please login to add a commentAdd a comment