సాక్షి, హైదరాబాద్ : కరోనా వ్యాప్తి, నియంత్రణ చర్యలపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వైద్యాదికారులతో చర్చించారు. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ శ్రీనివాసరావు, కాళోజీ యూనివర్సిటీ వి సి కరుణాకర్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు. వీడియో కాన్సరెన్స్ ద్వారా అధికారులతో మాట్లాడిన మంత్రి.. జ్వరం వచ్చిన వారందరిని వీలైనంత త్వరగా గుర్తించి పరీక్షలు చేయాలని సూచించారు. దీని ద్వారా వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయినా ప్రాణనష్టం జరగకుండా కాపాడొచ్చని పేర్కొన్నారు.
ఇప్పటికే మసూచి, సార్స్ వంటి అనేక రకాల వైరస్‌లను ఎదుర్కొన్నామని, ప్రస్తుతం కరోనా వస్తే చావే అన్న భయాన్ని అధిగమించామన్నారు. వైద్య సిబ్బంది ప్రజల ప్రాణాలు కాపాడటానికి చాలా శ్రమిస్తున్నారని, ఊపిరితిత్తులు , శ్వాసకోస సంబంధిత సమస్యలు ఉన్నవారికే కరోనా ఎక్కువ ప్రమాదకరంగా మారిందన్నారు. అయితే ప్రతీ ఒక్కరూ విధిగా భౌతికదూరం పాటించడం, మాస్కులు ధరించడం వంటి నిబంధనలు పాటిస్తే కరోనా దరిచేరకుండా ఉండొచ్చని తెలిపారు. రాష్ర్టంలో రాపిడ్ టెస్టులు అందుబాటులోకి వచ్చాక టెస్టింగ్ కెపాసిటీ పెరిగిందిని మంత్రి ఈటల పేర్కొన్నారు. (ఉస్మానియా పాత భవనానికి సీల్ )
Comments
Please login to add a commentAdd a comment