సాక్షి, హైదరాబాద్: భూ కబ్జా ఆరోపణల నేపథ్యంలో మంత్రి ఈటల రాజేందర్ నుంచి వైద్య ఆరోగ్య శాఖ, కుటుంబసంక్షేమ శాఖలను తొలగించిన సంగతి తెలిసిందే. దీనిపై ఆయన స్పందించారు. తనకు ఏ మంత్రి శాఖ లేకున్నా ప్రజలకు సేవ చేస్తాను అన్నారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. ‘‘సీఎంకు అన్ని శాఖాలపై సర్వాధికారాలుంటాయి. నన్ను మంత్రి పదవి నుంచి తొలగించినందుకు ధన్యవాదాలు. నాకు ఏ శాఖ లేకున్నా ప్రజలకు సేవ చేస్తాను. ప్లాన్ ప్రకారమే నాపై భూకబ్జా ఆరోపణలు చేశారు. తర్వలోనే నిజానిజాలు బయటకొస్తాయి. నా నియోజకవర్గ ప్రజలతో చర్చించి.. తదుపరి కార్యాచరణను ప్రకటిస్తాను’’ అన్నారు.
ఇక ఈటలపై భూ కబ్జా ఆరోపణల నేపథ్యంలో సీంఎ కేసీఆర్ తనను మంత్రి పదవులను నుంచి తొలగించాల్సిందిగా గవర్నరకు సిఫారసు చేశారు. ఈ క్రమంలో ఈటల నుంచి వైద్య ఆరోగ్య శాఖ, కుటుంబ సంక్షేమ శాఖను తొలగిస్తూ.. గవర్నర్ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment