challenged
-
హోంమంత్రి అనితకు మాజీ ఎంపీ నందిగం సురేష్ భార్య సవాల్
సాక్షి, గుంటూరు: తన భర్తపై తప్పుడు కేసు పెట్టి జైలుకి పంపారని మాజీ ఎంపీ నందిగం సురేష్ భార్య బేబిలత మండిపడ్డారు. ‘‘టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో ఒక్క ఆధారం చూపాలి. హోంమంత్రి అనిత తన పదవి కాపాడుకోవడం కోసం నా భర్తపై ఆరోపణలు చేస్తోంది’’ అని బేబిలత ధ్వజమెత్తారు.‘‘కృష్ణా నదికి వరద నా భర్తే తెచ్చాడా?. కృష్ణా నదిలొ కొట్టుకొచ్చిన బోట్లపై నా భర్త పేరు ఉందా?. అనిత తన బిడ్డలతో వస్తే.. నేను నా ఇద్దరు బిడ్డలతో వస్తా. తన బిడ్డల పై ప్రమాణం చేసి హోం మంత్రి అనిత నా భర్త పై చేసిన ఆరోపణలు నిరూపించాలి’’ అంటూ బేబీ లత సవాల్ విసిరారు. ఈ సవాల్ కి హోంమంత్రి అనిత సిద్ధమేనా?. మాజీ ఎంపీని వాడు వీడు అంటూ అనిత దిగజారి మాట్లాడుతుందంటూ బేబిలత ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: వైఫల్యం జంకుతోనే 'బోట్లపై బొంకు'! చంద్రబాబు సర్కార్ కుతంత్రం..కాగా, ఓ వైపు విజయవాడలో 7 లక్షల మందికిపైగా వరదలో చిక్కుకుని అల్లాడుతుంటే చంద్రబాబు సర్కార్ మాత్రం వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేందుకు ‘బోట్ల’ కుట్రకు తెరలేపింది. వాస్తవానికి బోట్లు వరద ధాటికి తాళ్లు తెగి కొట్టుకొచ్చి ప్రకాశం బ్యారేజీని ఢీకొన్నట్లు నీటిపారుదల శాఖ, పోలీసు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ విషయాన్ని వెల్లడించకుండా వైఎస్సార్సీపీపై బురద చల్లేందుకు ప్రభుత్వం వ్యూహం సిద్ధం చేసింది. బ్యారేజీని దెబ్బతీసేందుకే బోట్లను ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టేలా చేశారని కేసు నమోదు చేసి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు తెరతీసింది. వైఎస్సార్సీపీ నేతలు నందిగం సురేశ్, తలశిల రఘురాంను ఈ అక్రమ కేసులో ఇరికించాలన్నదే ప్రభుత్వ కుతంత్రం. -
మల్లారెడ్డి అవినీతిపై ఆధారాలివిగో!
సాక్షి, హైదరాబాద్: మంత్రి మల్లారెడ్డిపై తాను ఆధారాలతో సహా ఆరోపణలు చేస్తున్నానని.. ఆయనపై విచారణకు ఆదేశిస్తారో.. లేదో.. కేసీఆర్, కేటీఆర్ చెప్పాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ‘అవినీతికి ఆలవాలమైన మల్లా రెడ్డిని జైల్లో పెట్టకుండా మంత్రిని చేసి పక్కన కూర్చోబెట్టుకోవడం, న్యాక్ నిషేధించిన ఆయన కళాశాలలను వర్సిటీగా గుర్తించడం వంటి చర్యలతో సీఎం తెలంగాణ సమాజానికి ఏం సంకేతాలు ఇవ్వదల్చుకున్నారు’ అని ప్రశ్నించారు. శుక్రవారం గాంధీభవన్‌లో కాంగ్రెస్ సీనియర్ నేతలు బలరాం నాయక్, మల్లు రవి, నందికంటి శ్రీధర్, హర్కర వేణుగోపాల్, మానవతారాయ్, ఈర్ల కొమురయ్యలతో కలసి రేవంత్ మీడియాతో మాట్లాడారు. టి.రాజయ్య, ఈటలకు వర్తించిన నిబంధనలు మల్లారెడ్డికి వర్తించవా? అని సీఎంను ప్రశ్నించారు. ఆ భూములు ఎక్కడివి.. మల్లారెడ్డి వర్సిటీ అనుమతుల కోసం ప్రతిపాదించిన భూములు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని రేవంత్ డిమాండ్ చేశారు. ‘గుండ్లపోచంపల్లి పరిధి లోని సర్వేనంబర్ 650లో 1965–66 పహాణీ ప్రకా రం.. మొత్తం 22–08 ఎకరాల భూమి ఉంది. 2000–01 పహాణీలోనూ అంతే నమోదైంది. ధరణి పోర్టల్ వచ్చే సరికి 33–26 ఎకరాలకు పెరిగింది. ఈ సర్వే నంబర్లో 16 ఎకరాలు మల్లారెడ్డి బావమరిది. ప్రస్తుత గుండ్లపోచంపల్లి మున్సిపల్ చైర్మన్ భర్త శ్రీనివాసరెడ్డికి ఇదెలా వచ్చింది? శ్రీనివాసరెడ్డి ఈ భూమిని మల్లారెడ్డి ఎడ్యుకేషనల్ ట్రస్టుకు బదలాయిస్తే.. వారు వర్సిటీ కోసం ప్రతిపాదించారు. శ్రీనివాస్‌రెడ్డి ఆ భూమికి యజమాని ఎలా అయ్యా డో, వర్సిటీకి కేసీఆర్ ఎలా అనుమతిచ్చారో చెప్పాలి’ అని నిల దీశారు. ఇక జవహర్‌నగర్‌లోని 488 సర్వే నంబర్లోని 5 ఎకరాలు నిషేధిత జాబితాలో ఉందని.. అది ప్రభుత్వ భూమి అంటూ రెవెన్యూ అధికారులు బోర్డు కూడా పెట్టారని చెప్పారు. అయినా ఆ భూమిని మల్లారెడ్డి కోడలు శాలినీరెడ్డి పేరిట రిజిస్టర్ చేశారని, అందులో మల్లారెడ్డి హాస్పిటల్ నడుపుతున్నారని, ఈ వివరాలు కేసీఆర్‌కు తెలియవా అని ప్రశ్నించారు. అలాగే మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ గ్రేడింగ్ కోసం ఫోర్జరీ డాక్యుమెంట్లతో ప్రతిపాదనలు పంపిందని న్యాక్ ఆక్షేపించిందని.. ఇదే ఇంజనీరింగ్ కళాశాలకు ప్రైవేట్ వర్సిటీగా సీఎం గుర్తింపు ఇచ్చారని విమర్శించారు. కేటీఆర్... గోవా ఎందుకు వెళ్లారో? తాను హైకోర్టులో పిటిషన్ వేయడం వల్లే సినీతారల డ్రగ్స్ కేసులో ఈడీ నోటీసులు జారీ చేసిందని రేవంత్ చెప్పారు. ‘నాలుగైదు రోజులుగా మంత్రి కేటీఆర్ ఆందోళనలో ఉన్నట్టు కనిపిస్తోంది. ఆయన సహచరులు, సన్నిహితులపై ఆరోపణలు రావడంతో భయపడుతున్నారు. కేటీఆర్ ఎవరకీ చెప్పకుండా గోవా వెళ్లి వచ్చారా? లేదా?.. వెళితే అధికారికమా.. ప్రైవేటా.. చెప్పాలి’ అని ప్రశ్నించారు. డ్రగ్స్ వ్యవహారంలో ప్రభుత్వ పెద్దల సన్నిహితుల పాత్ర లేకపోతే.. కేంద్ర విచారణ సంస్థలను ఎం దుకు తిరస్కరించారో చెప్పాలన్నారు. ఈ వ్యవహారం నుంచి తప్పించుకునేందుకు ఇంటెలిజెన్స్ డీజీ ప్రభాకర్‌రావును తప్పించడం, సైబరాబాద్ సీపీగా స్టీఫెన్ రవీంద్రను నియమించడం వంటి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. దమ్ముంటే ముందస్తు ఎన్నికలకు రా.. తాను గెలిచిందే మల్లారెడ్డి అల్లుడి మీద అని.. ఇప్పుడు తాను రాజీనామా చేయాలని మల్లారెడ్డి డిమాండ్ చేయడం, దానిపై స్పందించాలని కేటీఆర్ అనడం హాస్యాస్పదమని రేవంత్ ఎద్దేవా చేశారు. ‘కేసీఆర్‌కు దమ్ముంటే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలి. అది ఇబ్బందిగా ఉంటే గజ్వేల్‌లో రాజీనామా చేయాలి. నువ్వో.. నేనో.. తేల్చుకుం దాం. చంద్రబాబు ఎంగిలి మెతుకులు తిన్నది కేసీఆరే. అసలు కేటీఆర్ పేరే ఉద్దెర పేరు..’’ అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ దత్తత ముసుగులో పేదోళ్ల కొంపలు కూల్చి తన ఫాంహౌస్‌కు 60 ఫీట్ల రోడ్లు వేయించుకున్నారని.. ఈ విషయాన్ని బయటపెడితే ఉన్మాదుల్లా విమర్శలు చేస్తున్నారని రేవంత్ మండిపడ్డారు. -
తొడగొట్టి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన మల్లారెడ్డి
-
పౌరసత్వ రద్దును సవాల్ చేసిన చెన్నమనేని
సాక్షి, హైదరాబాద్: తన పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోం శాఖ బుధవారం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని హైకోర్టును కోరారు. భారత పౌరసత్వ చట్టం–1955లోని సెక్షన్ 10 ప్రకారం ఆయన పౌరసత్వాన్ని రద్దు చేయడాన్ని సవాల్ చేశారు. కేంద్ర హోం శాఖ 2017 డిసెంబర్ 13న జారీ చేసిన ఆదేశాల తరహాలోనే తాజా ఉత్తర్వులు ఉన్నాయని, పూర్తిగా సాంకేతికంగానే కేంద్ర హోం శాఖ ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. 2017 నాటి రివ్యూ పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చిందని అదే తరహాలో తిరిగి జారీ చేసిన పౌరసత్వ రద్దు ఉత్తర్వులను కూడా కొట్టేయాలని కోరారు. గతంలో హైకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను అమలు చేయకుండానే సాంకేతికంగా ఉత్తర్వులు ఇవ్వడం చెల్లదని పేర్కొన్నారు. పౌరసత్వం రద్దుపై చెన్నమనేని హైకోర్టును ఆశ్రయిస్తే తనకు సమాచారం ఇవ్వాలని, తమ వాదనలు కూడా వినాలని కోరుతూ.. కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ హైకోర్టులో కేవియట్ దాఖలు చేశారు. -
మోదీకి ఛాలెంజ్ విసిరిన తేజస్వి యాదవ్
-
ఉపకరణాలు అందించేందుకు వైద్యపరీక్షలు
జిల్లావ్యాప్తంగా 25 వరకు శిబిరాల నిర్వహణ ధవళేశ్వరం : ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు ఉపకరణాలు అందించేందుకు ఈ నెల 25 తేదీ వరకు జిల్లావ్యాప్తంగా వైద్యశిబిరాలు నిర్వహిస్తున్నట్టు సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టు ఆఫీసర్ టీవీఎస్ గంగాధర్ కుమార్, సర్వశిక్షా అభియాన్ ఐఈ కో ఆర్డినేటర్ వై.లక్ష్మణ్æకుమార్ తెలిపారు. ధవళేశ్వరం భవిత కేంద్రంలో బుధవారం ప్రత్యేక అవసరాలుగల విద్యార్థులకు ఉపకరణాలను అందించేందుకు వైద్యపరీక్షలు నిర్వహించారు. లక్ష్మణ్‌కుమార్ మాట్లాడుతూ బుధవారం నుంచి ఈ నెల 25వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని భవితా కేంద్రాల్లో వైద్యశిబిరాలు నిర్వహించి, ఉపకరణాలు అవసరమైన వారిని గుర్తిస్తామన్నారు. జిల్లావ్యాప్తంగా సుమారు 8,500 మంది ప్రత్యేక అవసరాలుగల చిన్నారులు ఉన్నారన్నారు. ఒకసారి ఉపకరణాలు తీసుకున్న వారు మూడేళ్ల తర్వాత మళ్లీ తీసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో రాజమహేంద్రవరం రూరల్ ఎంఈవో కె.నరసింహారెడ్డి, ఐఈఆర్టీలు గంటా సత్యనారాయణ, కె.కమలాకర్ పాల్గొన్నారు. కాగా.. వైద్యశిబిరాల సమాచారం కోసం ఆయా మండలాల ఎంఈవోలను సంప్రదించవచ్చు. వైద్యశిబిరాలు జరిగే తేదీలు 20–10–2016 : రాజోలు, ఏలేశ్వరం, బిక్కవోలు, కోరుకొండ 21–10–2016 : అడ్డతీగల, తుని, రావులపాలెం, మండపేట 22–10–2016 : అమలాపురం , పిఠాపురం, సామర్లకోట, చింతూరు, 24–10–2016 : పి.గన్నవరం, జగ్గంపేట, కరప, రంపచోడవరం, 25–10–2016 : కాకినాడ అర్బన్ -
ప్రత్యేక అవసరాల పిల్లల తల్లిదండ్రులకు అవగహన కార్యక్రమం
పెద్దఅడిశర్లపల్లి : పీఏపల్లి మండల వనరుల కేంద్రంలో బుధవారం ప్రత్యేక అవసరాలు గల పిల్లల తల్లిదండ్రులకు సెన్సిటైజేషన్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్వశిక్ష అభియాన్ జిల్లా ఐఈ కోఆర్డినేటర్ ఆర్. రవి, ఎంఈఓ వేమారెడ్డిలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వివిధ రకాల వైకల్యాలను గురించి వారికి వివరించారు. వివిధ రకాల పరికరాలు, శస్త్ర చికిత్సలు, వైద్య శిబిరాలను వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీఎస్ పీఏపల్లి ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయుడు కె. మూనా, ఐఈఆర్పీ ఎం. ప్రేమ్‌సాగర్, ఆర్. రాందాస్, ఎంఐఎస్ జాహంగీర్, ఎల్డీఏ లచ్చిరాం తదితరులు పాల్గొన్నారు. -
వారున్నారని..మాకేం కాదనీ..!
♦ కనిగిరిలో ఖాకీలకు సవాల్‌గా మారిన చోరీ కేసులు ♦ పెండింగ్‌లో విశ్రాంత ఎస్సై ఇంట్లో దోపిడీ కేసు ♦ వీడని గొర్రెల కాపరి హత్య కేసు మిస్టరీ ♦ ఎర్రచందనం చోరీ కథ కంచికేనా? ♦ యథేచ్ఛగా దొంగల చేతివాటం అది జిల్లా జైలు. జిల్లా వ్యాప్తంగా వివిధ చోట్ల చోరీలకు పాల్పడిన దొంగలను పోలీసులు అరెస్టు చేసి అక్కడికి పంపారు. ఓ రోజు జైలులో దొంగలంతా సమావేశమయ్యూరు. దాదాపు 200 మంది దొంగలు పోగయ్యూరు. ఇంతలో దొంగల నేత మైకు అందుకుని తన ప్రసంగాన్ని ఇలా ప్రారంభించాడు.. రానురానూ దొంగతనాలు కష్టమయ్యూరుు. ఇలా చోరీ చేసి అటు వెళ్తున్నామో లేదో వెనుకాలే పోలీసులు వచ్చి పట్టుకుని కటకటాల వెనక్కి నెడుతున్నారు. జిల్లాలో అన్ని చోట్లా పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. చోరీ చేసిన సొత్తును సైతం ఇట్టే రికవరీ చేస్తున్నారని అన్నాడు. ఇంతలో ఓ దొంగ లేచి చోరీలు కష్టంగా ఉన్నాయని ఎలా చెబుతారంటూ సదరు దొంగల నేతను సూటిగా ప్రశ్నించాడు. మిగిలిన దొంగలంతా అతడి వైపు ఆసక్తిగా చూశారు. ఎవరితను.. ఎప్పుడూ చూడలేదే.. అంటూ ఒకరిలో ఒకరు గుసగుసలాడుకున్నారు.. మైకు అందుకున్న సదరు దొంగ.. తన ప్రసంగాన్ని ఇలా.. ప్రారంభించాడు.. నాది కనిగిరి. కనిగిరిలో నాతో పాటు సుమారు 20 మంది దొంగలం ఉన్నాం. మేం చాలా ఏళ్లుగా కనిగిరి, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో చోరీలు చేస్తునే ఉన్నాం. ఇప్పటికీ మాలో ఒక్కరిని కూడా పోలీసులు పట్టుకోలేదు సరికదా మా ఆనవాళ్లు కూడా వారివద్ద లేవు. చివరకు పోలీసుల ఇళ్లల్లో కూడా చోరీలు చేస్తున్నాం. మేం ఇంతవరకూ జైలుకు వెళ్లలేదు. మరి నువ్వే కేసులో ఇక్కడున్నావంటూ పెద్ద దొంగ అనుమానంగా అడిగాడు. ఓహ్.. అదా.. మొన్న ఓ పనిపై ఒంగోలు వచ్చి తిరిగి కనిగిరి వెళ్తున్నా. బస్సు ఎక్కేందుకు ఒంగోలు బస్టాండ్‌కు వెళ్లి అక్కడ ఓ మహిళ పర్సు కాజేశా. అంతే నిమిషాల్లో పోలీసులు వచ్చి నన్ను పట్టుకున్నారు. పెద్ద దొంగ మళ్లీ మైకు తీసుకుని ప్రియ దొంగలరా.. ఇక్కడి నుంచి విడుదలైన తర్వాత అంద రం కనిగిరి వైపు దృష్టి సారించి దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకుందాం.. అని సెలవిచ్చాడు. మిగిలిన దొంగలంతా ఆ కనిగిరి ప్రాంత దొంగను ఉద్దేశించి మాకు దారి చూపావంటూ అభినందించారు. కనిగిరి : కనిగిరి పరిధిలోని పలు చోరీ, హత్య కేసులు పోలీసులకు సవాల్‌గా మారారుు. కనిగిరి ప్రాంతంలో సం చలనం రేపిన పలు కేసుల్లో పురోగతి కనిపించడం లేదు. కేసులు ఏళ్ల తరబడి దర్యాప్తులో ఉండటంపై పలువురు పోలీసుల పనితీరును ప్రశ్నిస్తున్నారు. ఇదీ..ఎర్రచందనం దుంగల కథ అటవీశాఖ అధికారులు కనిగిరి రేంజ్‌లోని తుంగోడు, వెదుళ్ల చెరువు, చెన్నపునాయుని పల్లె బీట్లలో మొత్తం రూ.10 లక్షల విలువైన 135 ఎర్రచందనం దుంగలను పట్టుకుని వాటిని కనిగిరి అటవీ కార్యాలయంలో ఉంచారు. అవి 2012 జూలై 5న మాయమయ్యూరుు. అప్పట్లో ఈ చోరీ ఘటన జిల్లాలోనే సంచలనం రేపింది. ప్రాథమిక దర్యాప్తు అనంతరం ఆ శాఖ అధికారులు వాచ్‌మన్‌పై సస్సెండ్ వేటు వేసి కేసును మమ అనిపించారు. అప్పట్లో విచారణకు వచ్చిన పోలీసు అధికారులు మాత్రం దుంగల మాయంపై ఇంటి దొంగల ప్రమేయం ఉండి ఉండవచ్చని ప్రాథమికంగా అనుమానం వ్యక్తం చేశారు. ఎర్రచందనం అపహరణ కేసులో తొలుత హడావుడి చేసిన ఫారెస్ట్, పోలీసు అధికారులు ఆ తర్వాత మిన్నకుండిపోయారు. ఈ వ్యవహారంపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నారుు. అటవీశాఖ సబ్ డీఎఫ్ఓ, డీఎఫ్ఓ స్థాయి అధికారులు ఏడాది క్రితం అప్పటి ఎస్పీ చిరువోలు శ్రీకాంత్‌ను కలిసి ఎర్రచందనం దుంగల చోరీపై దర్యాప్తును వేగవంతం చేయూలని విన్నవించారు. కేసు దర్యాప్తును వేగవంతం చేయూలని సాక్షత్తు అప్పటి ఎస్పీ ఆదేశించినా స్థానిక పోలీసులకు చీమకుట్టినట్లు కూడా లేదు. బంగారు ఆభరణాల దోపిడీ కేసూ అంతే ఈ ఏడాది గత నెల 26న విశ్రాంత ఎస్సై పి.నారాయణ ఇంట్లో పోలీసు వేషధారణలో వచ్చిన దొంగలు ఆయన భార్య నాగమణిని తుపాకీతో బెదిరించి సుమారు 60 సవర్ల బంగారం, నగదు అపహరించుకెళ్లారు. ఈ ఘటన కూడా జిల్లాలో సంచలనం రేపింది. పోలీసులు, డాగ్ స్వ్కాడ్, క్లూస్‌టీం వచ్చి ఆధారాలు సేకరించినా ఫలితం లేకపోరుుంది. నిందితుల ఊహా చిత్రాలు విడుదల చేసి కేసును పలు కోణాల్లో దర్యాప్తు చే స్తున్నట్లు పోలీసులు చెప్పారేతప్ప అంతకుమించి వారు తీసుకున్న చర్యలు శూన్యం. దోపిడీ జరిగి నెల రోజులు దాడినా కేసులో ఇంకా పురోగతి లేదు. గొర్రెల కాపరిని చంపిందెవరు? హెచ్‌ఎంపాడు మండలంలో గొర్రెల కాపరి పెరుగు లక్ష్మీనారాయణ దారుణ హత్యకు గురయ్యూడు. ఈ కేసు కూడా ఇంకా మిస్టరీగానే ఉంది. కొత్తూరు సమీపంలో నిర్మానుష్య ప్రాంతంలో ఆయన మృతదేహం చెట్టుకు ఉరేసినట్లు ఉండటంతో పోలీసులు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేశారు. మృతుని భార్య మాత్రం తన భర్తది హత్యేనని పోలీసులకు ఫిర్యాదు చేసింది. మృతుని జేబులు బ్లేడు, శరీరంపై గాయాలు ఉండటంతో లక్ష్మీనారాయణది హత్య? లేక ఆత్మహత్య.. అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నారుు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. ఘటన జరిగి రెండు నెలలు దాటినా ఇప్పటికీ కేసు దర్యాప్తు ముందుకు సాగడం లేదు. దుంగల చోరీ కేసు దర్యాప్తులో ఉంది గతంలో మా కార్యాలయంలో ఎర్రచందనం దుంగలు మాయమైంది వాస్తవమే. నేను ఇటీవలే కనిగిరికి బదిలీపై వచ్చాను. దుంగల చోరీ కేసు పోలీసుల దర్యాప్తులోనే ఉంది. రూ.10 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలు ఇంకా రికవరీ కాలేదు. అప్పట్లో మా శాఖలోని కొందరు సిబ్బందిపై శాఖాపర మైన చర్యలు తీసుకున్నారు. - పోతురాజు, ఫారెస్ట్ రేంజర్, కనిగిరి -
నీట్ పై సుప్రీంలో పిటిషన్
న్యూఢిల్లీ : జాతీయ స్థాయిలో వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే అర్హత పరీక్ష (నీట్) పై వివాదం అప్పుడే ముగిసేలా కనబడటం లేదు. నీట్ పై తాజాగా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ను వ్యతిరేకిస్తూ సంకల్స్ చటర్జీ ట్రస్ట్ ఈ పిటిషన్ ను దాఖలు చేసింది. ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధమని, దీని వల్ల వైద్య విద్యలో సంస్కరణలు నిలిచిపోయే అవకాశం ఉందని పిటిషనర్ ఆరోపించారు . పిటిషనర్ తరఫు న్యాయవాది అమిత్ కుమార్ వాదనలు వినిపిస్తూ... న్యాయ స్థానం ఇచ్చిన తీర్పుపై కార్యనిర్వాహక శాఖ ఆర్డినెన్స్ జారీ చేయడం రాజ్యాంగ విరుద్ధమని కోర్టుకి తెలిపారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ యేడాది రాష్ట్ర ప్రభుత్వాలు మెడికల్ సీట్ల భర్తీకి సంబంధించి సొంతంగా పరీక్షను నిర్వహించుకునే ఆర్ఢినెన్స్ పై ఇటీవలే సంతకం చేశారు. తమిళనాడు సీఎం జయలలిత తమ రాష్ట్రాన్ని నీట్ నుంచి మినహాయించమని బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసింది .