నీట్ పై సుప్రీంలో పిటిషన్
Published Wed, May 25 2016 11:07 AM | Last Updated on Sat, Oct 20 2018 5:44 PM
న్యూఢిల్లీ : జాతీయ స్థాయిలో వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే అర్హత పరీక్ష (నీట్) పై వివాదం అప్పుడే ముగిసేలా కనబడటం లేదు. నీట్ పై తాజాగా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ను వ్యతిరేకిస్తూ సంకల్స్ చటర్జీ ట్రస్ట్ ఈ పిటిషన్ ను దాఖలు చేసింది. ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధమని, దీని వల్ల వైద్య విద్యలో సంస్కరణలు నిలిచిపోయే అవకాశం ఉందని పిటిషనర్ ఆరోపించారు .
Advertisement
Advertisement