NEET PG 2022: Supreme Court Refuses To Postpone NEET PG Exam - Sakshi
Sakshi News home page

NEET PG 2022: నీట్‌ పీజీ-2022 పరీక్ష వాయిదాకు సుప్రీంకోర్టు నిరాకరణ

Published Fri, May 13 2022 1:09 PM | Last Updated on Fri, May 13 2022 3:33 PM

NEET PG 2022: Supreme Court Refuses To Postpone NEET PG Exam - Sakshi

న్యూఢిల్లీ: జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్‌ పీజీ 2022 వాయిదాకు సుప్రీంకోర్టు నిరాకరించింది. నీట్‌ పీజీ- 2022 పరీక్షలను వాయిదా వేస్తే విద్యార్థులకు ఇబ్బంది అవుతుందని ధర్మాసనం పేర్కొంది. పరీక్షల వాయిదా గందరగోళం అనిశ్చితితోపాటు వైద్యుల కొరత కూడా ఏర్పడే అవకాశం ఉందని, కాబట్టి పరీక్ష వాయిదా వేయలేమని తెలిపింది. కాగా నీట్‌ పీజీ-2021 కౌన్సిలింగ్‌ ఉన్నందున చదువుకోవడానికి తగినంత సమయం లేకపోవడంతో పరీక్షలు వాయిదా వేయాలని కోరుతూ వైద్యుల బృందం పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే పిటిషనర్ల వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

ఈ మేరకు జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్‌పై విచారణ జరిపి శుక్రవారం తీర్పును వెల్లడించింది. నీట్‌ పీజీ 2022 పరీక్షలు వాయిదా వేయడం సరైన ఆలోచన కాదని, దీని వల్ల ఈ పరీక్ష రాసే 2 లక్షల మంది విద్యార్థులకు నష్టం వాటిల్లే అవకాశం ఉందనిసనం తెలిపింది. నీట్ పీజీ 2022 పరీక్ష వాయిదా వేయడం వల్ల రోగి సంరక్షణ, వైద్యుల కెరీర్ పై ప్రభావం చూపుతుందని బెంచ్ పేర్కొంది. ఈ పరిస్థితుల్లో ఎలా.పరీక్షను వాయిదా వేస్తామని కోర్టు ప్రశ్నించింది. కాగాఈ ఏడాది మే 21న  నీట్ పీజీ పరీక్షను నిర్వహించనున్నారు. అడ్మిట్ కార్డ్‌లు మే 16, 2022 నుంచి అధికారిక వెబ్‌సైట్ nbe.edu.in లో అందుబాటులో ఉండనున్నాయి.
చదవండి:చత్తీస్‌గఢ్‌లో కుప్పకూలిన హెలికాప్టర్.. ఇద్దరు పైలట్ల మృతి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement