సాక్షి, న్యూఢిల్లీ :ఈశాన్య ప్రాంత చిన్న రాష్ట్రమైన, దేశ సరిహద్దులో ఉన్న మణిపూర్‌లోని వివాదాస్పద అంశంపై విపక్షాలు కేంద్రానికి మద్దతుగా కలిసి రావాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ వి.విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు.
సరిహద్దు దేశాల కుట్రల దృష్ట్యా అందరూ సమష్టిగా ఉండాల్సిన అవసరం ఉందని, కేంద్రంపై ప్రవేశపెట్టిన అవిశ్వాసాన్ని తిప్పికొట్టాలని ఆయన అభిప్రాయపడ్డారు. శుక్రవారం రాత్రి ఓ జాతీయ మీడియా చర్చలో ఢిల్లీ ఆర్డినెన్స్, విపక్షాలు కేంద్రంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఆయన మాట్లాడారు.
ఢిల్లీ ఆర్డినెన్స్‌కు సంబంధించి విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. ఢిల్లీ పూర్తిస్థాయి రాష్ట్రం కాదన్న విషయం గుర్తు చేశారు. కేంద్రం తీసుకొచ్చిన ఢిల్లీ ఆర్డినెన్స్ సమాఖ్య స్ఫూర్తిని ఏమాత్రం దెబ్బ తీయట్లేదని స్పష్టం చేశారు. ఢిల్లీ ఆర్డినెన్స్ సుప్రీంకోర్టు తీర్పును ఏమాత్రం ఉల్లంఘించడం లేదన్నారు. అందువల్లే ఈ రెండు అంశాలపై వైఎస్సార్‌సీపీ కేంద్రానికి మద్దతు ఇస్తోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment