Antitrust Conclusion Notice
-
అవిశ్వాసం సరికాదు
సాక్షి, న్యూఢిల్లీ :ఈశాన్య ప్రాంత చిన్న రాష్ట్రమైన, దేశ సరిహద్దులో ఉన్న మణిపూర్‌లోని వివాదాస్పద అంశంపై విపక్షాలు కేంద్రానికి మద్దతుగా కలిసి రావాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ వి.విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. సరిహద్దు దేశాల కుట్రల దృష్ట్యా అందరూ సమష్టిగా ఉండాల్సిన అవసరం ఉందని, కేంద్రంపై ప్రవేశపెట్టిన అవిశ్వాసాన్ని తిప్పికొట్టాలని ఆయన అభిప్రాయపడ్డారు. శుక్రవారం రాత్రి ఓ జాతీయ మీడియా చర్చలో ఢిల్లీ ఆర్డినెన్స్, విపక్షాలు కేంద్రంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఆయన మాట్లాడారు. ఢిల్లీ ఆర్డినెన్స్‌కు సంబంధించి విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. ఢిల్లీ పూర్తిస్థాయి రాష్ట్రం కాదన్న విషయం గుర్తు చేశారు. కేంద్రం తీసుకొచ్చిన ఢిల్లీ ఆర్డినెన్స్ సమాఖ్య స్ఫూర్తిని ఏమాత్రం దెబ్బ తీయట్లేదని స్పష్టం చేశారు. ఢిల్లీ ఆర్డినెన్స్ సుప్రీంకోర్టు తీర్పును ఏమాత్రం ఉల్లంఘించడం లేదన్నారు. అందువల్లే ఈ రెండు అంశాలపై వైఎస్సార్సీపీ కేంద్రానికి మద్దతు ఇస్తోందన్నారు. -
తోక ముడిచిన అమెజాన్! ఇకపై ఆ సర్వీసులు బంద్
ఈ కామర్స్ రంగంలో ప్రపంచ బాస్‌గా ఉన్న అమెజాన్‌కి ఎదురు దెబ్బ తగిలింది. సోల్డ్ బై అమెజాన్ బిజినెస్ మోడల్‌పై దాఖలైన పిటిషన్‌పై కనీసం పోరాటం చేయకుండానే తోక ముడిచింది. ఇది స్కీం చిరు వ్యాపారులకు ఈ కామర్స్ ఫ్లాట్‌ఫామ్‌పై వేదిక కల్పించే లక్ష్యంతో 2018లో సోల్డ్ బై అమెజాన్‌ను తెర మీదకు తెచ్చింది. రెండేళ్ల పాటు ఈ పథకం అమలు చేసింది. చిరు వ్యాపారులకు తమ వస్తువులను ఈ బిజినెస్ మోడల్ ద్వారా ఆమెజాన్లో విక్రయాలు చేపట్టవచ్చు. అయితే ఆయా ఉత్పత్తుల ధరను అమెజాన్ నిర్ణయిస్తుంది. నిర్ణీత మొత్తం పూర్తయ్యే వరకు ఇదే ధర అమల్లో ఉంటుంది. నిర్ణీత మెత్తంలో అమ్మకాలు పూర్తయిన తర్వాత ఆయా ప్రొడక్టుల మీద వచ్చే లాభంలో అమెజాన్ తగ్గించుకుంటుంది. వివాదం సోల్డ్ బై అమెజాన్ ప్రొగ్రామ్‌లో చిన్న విక్రేతలకు సంబంధించిన ఉత్పత్తుల ధర నిర్ణయ అధికారం అమెజాన్ దగ్గర ఉండటం సరికాదంటూ అమెరికాలో కింగ్ కంట్రీ సుపీరియర్ కోర్టులో 2022 జనవరి 26న పిటిషన్ నమోదు అయ్యింది. సోల్డ్ బై అమెజాన్ ప్రోగ్రామ్ యాంటీ ట్రస్ట్ లా చట్టాల స్ఫూర్తికి విఘాతం కలిగిస్తోందన్నారు. థర్డ్ పార్టీ సెల్లర్స్ మధ్య పోటీని నియంత్రిస్తూ అమెజాన్‌కు అధిక లాభాలు తెచ్చిపెడుతోందంటూ పిటీషన్లో పేర్కొన్నారు. వెంటనే వాషింగ్టన్ అటార్నీ జనరల్ బాబ్ ఫెర్గుసన్ ఈ పిటిషన్‌పై విచారణకు సిద్ధమయ్యారు. రద్దు చేస్తున్నాం తమ బిజినెస్ మోడల్‌పై విచారణ ప్రారంభం అవుతుందని తెలిసిన వెంటనే సోల్డ్ బై అమెజాన్ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్టు అమెజాన్ ప్రకటించింది. అంతేకాదు యాంటీ ట్రస్టు చట్టాలను మరింత సమర్థంగా అమలు చేసేందుకు మద్దతుగా వాషింగ్టన్ అటార్నీ జనరల్ కార్యాలయానికి 2.25 మిలియన్ డాలర్లు హడావుడిగా జమ చేసింది. కోర్టులో దాఖలైన వాజ్యంతో సంబంధం లేకుండా ఈ రెండు నిర్ణయాలు తీసుకున్నట్టు ప్రకటించిన అమెజాన్ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించింది. వెనక్కి తగ్గిన.. థర్డ్ పార్టీ సెల్లర్స్‌కి భారీ ఈ కామర్స్ వేదికను అందుబాటులోకి తెచ్చినట్టుగా సోల్డ్ బై అమెజాన్ కనిపించినా.. వాస్తవంలో పోటీని నియంత్రించి ఈ కామర్స్‌లో మోనోపలికి దారి తీస్తుందనే విమర్శలు ఆది నుంచి వినిపించాయి. చివరకు వాషింగ్టన్ అటార్నీ జనరల్ విచారణ ప్రారంభించడంతో అమెజాన్ పూర్తిగా వెనక్కి తగ్గింది. చదవండి:బాయ్‌కాట్ అమెజాన్.. జాతీయ పతాకానికి అవమానం! -
ఫేస్‌బుక్‌కు భారీ ఊరట..!
వాషింగ్టన్: అమెరికాలో ప్రముఖ దిగ్గజ సంస్థలు ఫేస్బుక్, గూగుల్, అమెజాన్, ఆపిల్ కంపెనీలు యాంటీట్రస్ట్ బిల్లుల పేరిట విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. యాంటీ ట్రస్ట్ బిల్లుల విషయంలో ఫేసుబుక్పై నమోదైన వ్యాజ్యాలను సోమవారం యూఎస్ ఫెడరల్ కోర్టు తోసిపుచ్చింది. దీంతో అమెరికాలో ఫేసుబుక్కు భారీ ఊరట లభించింది. గతంలో ఫేసుబుక్ ఇన్స్టాగ్రామ్, వాట్సాప్‌లను బలవంతంగా కొనుగోలు చేశారనే విషయంలో ఫేస్‌బుక్‌పై యాంటీ ట్రస్ట్ వ్యాజ్యం నమోదైంది. వన్ ట్రిలియన్ డాలర్లకు ఎగిసినా మార్కెట్ విలువ.. 2012లో ఇన్‌స్టాగ్రామ్‌ను ఒక బిలియన్ డాలర్లకు, 2014లో వాట్సాప్‌ను 19 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఫేస్బుక్ బహిరంగ మార్కెట్లో గుత్తాధిపత్యాన్ని ప్రదర్శిస్తోందనే ఆరోపణలను యూఎస్ కోర్టులో ఎఫ్‌టీసీ నిరూపించలేకపోయింది.ఫేస్బుక్ కు యాంటీట్రస్ట్ విషయంలో సానుకూలంగా తీర్పు రావడంతో ఫేసుబుక్ షేర్లు దూసుకుపోయాయి. తీర్పు వెలువడిన తర్వాత ఫేస్బుక్ షేర్లు 4 శాతం కంటే ఎక్కువగా పెరిగాయి. దీంతో తొలిసారి ఫేసుబుక్ మార్కెట్ మూలధన విలువ ఒక ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. చదవండి: చరిత్ర సృష్టించిన మైక్రోసాఫ్ట్..! -
ఈ బిల్లులతో అమెజాన్ ప్రైమ్ ఫ్రీ షిప్పింగ్‌కు కాలం చెల్లనుందా..!
వాషింగ్టన్: దిగ్గజ టెక్ కంపెనీలకు రానున్న రోజుల్లో గడ్డుకాలం రానుందా..! అంటే బహుశా రావచ్చునని వ్యాపార నిపుణులు పేర్కొంటున్నారు. అమెరికా తన దేశంలో ఉన్న దిగ్గజ టెక్ కంపెనీలపై యాంటీ ట్రస్ట్ బిల్లుల పేరిట ఇటివలే అమెరికా ప్రతినిధుల సభలో ఐదు బిల్లులను ప్రవేశపెట్టింది. కాగా ప్రస్తుతం యూఏస్ హౌజ్ జ్యూడిషియరీ కమిటీ వచ్చేవారం ఓటు వేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని కమిటీ చైర్పర్సన్ జెర్రీ నాడ్లర్ బుధవారం తెలిపారు. ఈ బిల్లులకు అనుకూలంగా ఓటు వేయాలా వద్దా అనే విషయంపై ప్యానెల్ నిర్ణయించనుంది. గత వారం ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టిన రెండు బిల్లులు అమెజాన్, గూగుల్‌కు చెందిన ఆల్ఫాబెట్ దిగ్గజ కంపెనీలకు వ్యాపారం చేసుకోవడానికి ఒకే వేదికను క్రియేట్ చేసుకోవచ్చునని ప్యానెల్ పేర్కొంది. కాగా ఈ బిల్లులతో అమెజాన్ కంపెనీ అందిస్తోన్న ప్రైమ్ ఫ్రీ షిప్పింగ్‌కు కాలం చెల్లుతుందని వ్యాపార నిపుణులు భావిస్తున్నారు. అంతేకాకుండా ఐఫోన్ మొబైల్లో అందించే ఫ్రీ సర్వీసులు కూడా నిలిచిపోతాయి. ప్రస్తుతం ఈ బిల్లులపై చాలా వ్యతిరేకత వస్తోంది. వీటితో వినియోగదారులు తీవ్రంగా నష్టపోతారని నిపుణులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బిల్లులకు ఆమోదం వస్తే వినియోగదారులు అమెజాన్ నుంచి ఆర్డర్ చేసినప్పుడల్లా కచ్చితంగా డెలివరీ ఛార్జీలు పే చేయాల్సి ఉంటుంది. అంతేకాకుంగా ఆపిల్ ఐఫోన్లో అందించే పలు సర్వీసులకు కూడా పే చేయాల్సి వస్తోందని నిపుణుల పేర్కొన్నారు. ఆపిల్, అమెజాన్, గూగుల్, ఫేస్బుక్ కంపెనీలను నియత్రించడానికి ఈ బిల్లులను పరిచయం చేశారని తెలుస్తోంది. చదవండి: Bank Of America Report On IT Jobs: ఐటీ ఉద్యోగులకు ఆటోమేషన్ గండం! -
బ్రిటన్ ప్రభుత్వంలో ‘బ్రెగ్జిట్’ చిచ్చు
లండన్: బ్రిటన్ ప్రధాని థెరెసా మే తన సొంత పార్టీ ఎంపీల నుంచే అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్రెగ్జిట్ (యురోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి బ్రిటన్ వైదొలగడం) వ్యవహారంలో మే వైఖరిని వ్యతిరేకిస్తూ అధికార కన్జర్వేటివ్ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు థెరెసా మే ప్రభుత్వంపై గురువారం అవిశ్వాసం నోటీసులు ఇచ్చారు. అంతకుముందు ఈయూతో మే కుదుర్చుకుంటున్న బ్రెగ్జిట్ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ ఆమె మంత్రివర్గంలోని నలుగురు తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ ఒప్పందం అర్ధరహితంగా, బ్రిటన్‌కు నష్టం చేకూర్చేలా ఉందని వారంతా ఆరోపిస్తున్నారు. బ్రెగ్జిట్ ప్రక్రియ వచ్చే ఏడాది మార్చి నుంచి ప్రారంభమై 20 నెలల్లో ముగిసేలా ఓ ఒప్పందాన్ని థెరెసా మే ఈయూ తో కుదుర్చుకుంటున్నారు. అందుకు సంబంధించిన ముసాయిదా బిల్లు బుధవారం రాత్రే విడుదలైంది. బిల్లులోని నిబంధనలపై తన నిరసన తెలుపుతూ మొదటగా భారత సంతతి వ్యక్తి, ఉత్తర ఐర్లాండ్ శాఖ మంత్రి శైలేశ్ వర తన పదవికి రాజీనామా చేశారు. థెరెసా మేపై ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలపై చర్చ చేపట్టాలంటే మే ప్రత్యర్థులకు ఆమె సొంత పార్టీ నుంచే కనీసం 48 మంది ఎంపీల మద్దతు కావాలి. వారు ఎలాగోలా ఇంత మందిని కూడగట్టినా.. మేను పదవి నుంచి దించడానికి మాత్రం 158 మంది మద్దతు అవసరం. అంతమంది మే ప్రత్యర్థుల వైపు లేరని తెలుస్తోంది. -
‘అవిశ్వాసం’ పేరుతో మలేషియా టూర్‌కు సిద్ధం
స్థానిక సంస్థల అధ్యక్షులను అవిశ్వాస భయం వెంటాడుతోంది. నాలుగేళ్ల కాలపరిమితి ముగియడంతో ఇదే అదనుగా సభ్యులు.. అధ్యక్షుల ముందు పలు డిమాండ్లు పెడుతున్నారు. వారి గొంతెమ్మ కోరికలను తీర్చేందుకు పాలకపక్షం కూడా రెడీ అవుతోంది. ఇప్పటికే పలు మండలాల్లో అవిశ్వాస తీర్మా నం నోటీసు ఇవ్వడమే తరువాయి.. ఎంపీటీసీ సభ్యులు క్యాంపులుగా విడిపోయి పుణ్యక్షేత్రాలు, తీర్థయాత్రలకు బయలుదేరారు. తాజాగా జెడ్పీటీసీ సభ్యులు కూడా వీరి బాటలో విదేశీయాత్రకు సూటు, బూటు సిద్ధం చేసుకుంటున్నట్లు ప్రచారం.. అవిశ్వాసం మాట దేవుడెరుగు.. ఒక్క ఝలక్ ఇచ్చి పని చక్కబెట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి సతీమణి సునీత ప్రాతినిథ్యం వహిస్తున్నారు. యాలాల జెడ్పీటీసీగా టీఆర్ఎస్ తరుఫున గెలుపొందిన ఆమె అనూహ్య పరిణామాల నడుమ జడ్పీ పీఠాన్ని అధిరోహించారు. తగినంత సంఖ్యాబలం లేనప్పటికీ, టీడీపీ సభ్యుల మద్దతు కూడగట్టుకోవడం.. విపక్ష కాం గ్రెస్ పార్టీలో చీలిక తీసుకురావడం ద్వారా సునాయాసంగా విజయం సాధించారు. అనంతరం జరిగిన సమీకరణల నేపథ్యంలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు సభ్యులు కూడా గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ నేపథ్యంలో గత నాలుగేళ్లుగా జిల్లా పరిషత్ పాలన సజావుగా సాగుతోంది. అయితే, తాజాగా చోటుచేసుకున్న పరిణామల నేపథ్యంలో గతంలో అండగా నిలిచిన జెడ్పీటీసీలు తమ మాట చెల్లుబాటు కావడంలేదనే ప్రస్తుతం అసమ్మతి స్వరం వినిపిస్తున్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. ఈ క్రమంలోనే నాలుగేళ్ల కాలపరిమితి పూర్తి కావడం.. అవిశ్వాసం నోటీసు ఇచ్చేందుకు అవకాశం లభించడంతో కొందరు సభ్యులు చైర్‌పర్సన్‌పై ఈ దిశగాయోచిస్తున్నట్లు లీకులు వదిలారు. వాస్తవానికి అవిశ్వాసం ప్రకటించినా నెగ్గే పరిస్థితి లేనప్పటికీ, లీకుల ద్వారా ఎంతో కొంత వెనుకేసుకోవాలనే ఆలోచన చేసినట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో శిబిరాలు నిర్వహించిన అనుభవం..ఆర్థికంగా అదుకున్నారనే పేరు మంత్రి మహేందర్‌రెడ్డికి ఉండడంతో ఈ ఎత్తుగడ వేసినట్లు తెలు స్తోంది. ఈ క్రమంలోనే కొందరు సభ్యులు అవిశ్వాసం జోలికి వెళ్లకుండా విదేశీ టూర్‌కు వెళితే బాగుంటుందనే ప్రతిపాదన తెచ్చారు. మరో 11 నెలల్లో పదవీకాలం ముగిస్తున్నందున అనవసరపు ఖర్చేందుకు అని భావించి విదేశీయానమే బెటరనే నిర్ణయానికి వచ్చారు. పార్టీకతీతంగా ఈ ప్రతిపాదనకు ఓకే చేసిన సభ్యులు సింగపూర్, మలేషియా లేదా కొరియా పర్యటనకు వెళ్లే అం శాన్ని పరిశీలిస్తున్నారు. వచ్చే నెల 16న విదేశాలకేగాలని సూత్రప్రాయంగా నిర్ణయించిన సభ్యులు.. ఎక్కడి వెళ్లాలి? ఎన్నిరోజుల షెడ్యూల్ అనేదానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. -
ఎంపీపీపై అవిశ్వాస ప్రతిపాదన
తాండూరు రూరల్ : రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి సొంత ఇలాఖాలో అధికార పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. తాండూరు ఎంపీపీ లక్ష్మమ్మపై సొంత పార్టీ ఎంపీటీసీలు అవిశ్వాసానికి సిద్ధమయ్యారు. మండలంలో మొత్తం 15 మంది ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు. 9 మంది టీఆర్ఎస్, ఆరుగురు ఎంపీటీసీలు కాంగ్రెస్ నుంచి గెలుపొందారు. అప్పట్లో అంతారం–2 ఎంపీటీసీ సభ్యురాలు కోస్గి లక్ష్మమ్మను ఎంపీపీగా ఎన్నుకున్నారు. టీఆర్ఎస్లో కొనసాగుతున్న అంతర్గత కుమ్ములాట కారణంగా మంగళవారం అదే పార్టీకి చెందిన నలుగురు ఎంపీటీసీ సభ్యులు ఎంపీపీ లక్ష్మమ్మపై తిరుగుబాటు జెండా ఎగురువేశారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్‌కు చెందిన ఆరుగురు ఎంపీటీసీ సభ్యులతో కలిసి మంగళవారం తాండూరు ఆర్డీఓ వేణుమాధవ్‌ను కలిసి అవిశ్వాసం లేఖ అందజేశారు. వడ్డె శ్రీనుతో వేగలేకపోతున్నాం.. టీఆర్ఎస్కు చెందిన అసమ్మతి ఎంపీటీసీ సభ్యులు శేఖర్, వసంత్‌కుమార్, శోభ మాట్లాడుతూ.. ఎంపీపీ లక్ష్మమ్మ వర్గీయుడు, తాండూరు మండలంలో నూతనంగా ఎన్నికైన మార్కెట్ కమిటీ చైర్మన్ వడ్డె శ్రీను మండలంలో ఏకపక్షంగా, పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎంపీపీ వ్యవహారాల్లో అతనే ముందుండి నడిపిస్తున్నారని, తమను లెక్క చేయడం లేదని మండిపడ్డారు. ఆయనతోనే స్థానికంగా టీఆర్ఎస్ భ్రష్ఠుపట్టిందని, గ్రామాల్లో గ్రూపులను ప్రోత్సహిస్తున్నారన్నారు. తమకు మంత్రి మహేందర్‌రెడ్డి అంటే అభిమానమేనని.. కానీ వడ్డె శ్రీను ఒంటెత్తు పొకడతో ఎంపీపీపై అవిశ్వాసం పెట్టాల్సి వస్తోందని తెలిపారు. మంత్రి రంగంలోకి దిగినా ఫలితం శూన్యం.. తాండూరు మండలం ఎంపీపీ కోస్గి లక్ష్మమ్మపై అవిశ్వాస తీర్మానానికి సొంత పార్టీ ఎంపీటీసీ సభ్యులు సిద్ధమయ్యారనే విషయం తెలుసుకున్న మంత్రి మహేందర్‌రెడ్డి అప్రమత్తయ్యారు. సోమవారం మధ్యాహ్నం వైస్ ఎంపీపీ శేఖర్‌తోపాటు ఎంపీటీసీ సభ్యులు వసంత్‌కుమార్, మ్యాతరి శోభతో ఫోన్లో మాట్లాడారు. అంతర్గత సమస్యలు ఉంటే కూర్చొని మాట్లాడుందామని.. ఇలా రచ్చకెక్కడంతో పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని సర్దిచెప్పారు. మంత్రి మాటలు లెక్కచేయకుండా అసమ్మతి ఎంపీటీసీలు మంగళవారం ఆర్డీఓను కలిసి ఎంపీపీపై అవిశ్వాసం ప్రవేశపెట్టేందుకు లేఖ ఇచ్చారు. దీంతో మంత్రి మహేందర్‌రెడ్డి అసమ్మతి ఎంపీటీసీలను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. -
బ్రిటన్ ప్రధాని థెరెసాపై సొంతపార్టీలోనే అవిశ్వాసం
లండన్: బ్రిటన్‌లో విపక్షాల నుంచి ఇప్పటికే తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్న ప్రధాన మంత్రి థెరెసా మేకు మరిన్ని చిక్కులు తప్పేలా లేవు. ఆమెపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సొంత పార్టీ ఎంపీలే సిద్ధమవుతున్నారు. థెరెసా మేపై అవిశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ ఇవ్వాల్సిన లేఖపై సంతకం పెట్టేందుకు ఇప్పటికే 40 మంది కన్జర్వేటివ్ పార్టీ ఎంపీలు సిద్ధంగా ఉన్నారు. మొత్తం 48 మంది ఎంపీలు సంతకం పెడితే ఆమెపై అవిశ్వాస తీర్మానం ఇవ్వొచ్చు. ఇటీవలే వివిధ ఆరోపణలపై థెరెసా మంత్రివర్గంలోని ఇద్దరు మంత్రులు రాజీనామా చేయడం తెలిసిందే. అంతర్జాతీయ వ్యవహారాల మంత్రిగా ఉన్న ప్రీతీ పటేల్... ఇజ్రాయెల్ అధికారులతో అనధికారికంగా భేటీ అయ్యి, గతవారం రాజీనామా చేశారు. అంతకు కొన్నిరోజుల ముందే మరో మంత్రి మైకేల్ ఫాల్లొన్ చెడు ప్రవర్తన కారణంగా వైదొలిగారు. తాజాగా మరో ఇద్దరు మంత్రుల రాజీనామాకు కూడా ప్రతిపక్ష లేబర్ పార్టీ డిమాండ్ చేస్తోంది. -
ప్రజాకంటక సర్కారుపై అవిశ్వాసం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్ష వైఎస్సార్సీపీ అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చింది. గురువారం ఉదయం అసెంబ్లీ సమావేశం ప్రారంభం కావడానికి ముందే పార్టీ శాసనసభా పక్ష ఉపనేతలు జ్యోతుల నెహ్రూ, ఉప్పులేటి కల్పన నేతృత్వంలో పలువురు ఎమ్మెల్యేలు శాసనసభ కార్యదర్శి కె.సత్యనారాయణను కలసి 75వ నిబంధన కింద ఈ నోటీసును అందజేశారు. ‘ప్రస్తుత మంత్రిమండలిపై ఈ శాసనసభ అవిశ్వాసాన్ని ప్రకటిస్తున్నది’ అని అందులో పేర్కొన్నారు. అవిశ్వాసం నోటీసుపై వైఎస్సార్సీపీ శాసనసభాపక్ష ఉపనేతలతో పాటు ఎమ్మెల్యేలు సుజయ్ కృష్ణ రంగారావు, బూడి ముత్యాలనాయుడు, పీడిక రాజన్నదొర, పాముల పుష్పశ్రీవాణి, కిడారు సర్వేశ్వరరావు, విశ్వాసరాయి కళావతి, వరుపుల సుబ్బారావు, ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎస్వీ మోహన్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సంతకాలు చేశారు. రెండేళ్ల పాల నలో బాబు ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ పూర్తిగా విఫలమైందని, ఇంకా అధికారంలో కొనసాగితే రాష్ట్ర ప్రజలకు తీరని నష్టం కలుగుతుందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. ఎన్నికలప్పుడు ప్రజలకిచ్చిన ఒక్క హామీనీ నెరవేర్చకుండా ప్రజలను దారుణంగా మోసం చేశారని పాలకులపై మండిపడ్డారు. ఈ ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయింది : వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు బాబు ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజల విశ్వాసం కోల్పోయిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సుజయ్‌కృష్ణ రంగారావు, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఉప్పులేటి కల్పన పేర్కొన్నారు. గద్దెనెక్కి రెండేళ్లవుతున్నా ఒక్కహామీనీ టీడీపీ సర్కారు నెరవేర్చలేదని, అన్నివిధాలా విఫలమైన ఈ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టినట్లు వెల్లడించారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్లో వీరంతా మాట్లాడారు. అవిశ్వాస తీర్మానానికి ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్న అనేక మంది పాలకపక్షం ఎమ్మెల్యేల మద్దతు విషయమై చర్చ జరుగుతుందని ఆశిస్తున్నామన్నారు. వీలైనంత తొందరగా అవిశ్వాస తీర్మానాన్ని చర్చకు తీసుకోవాలని సభాపతిని సుజయ్ కృష్ణ రంగారావు కోరారు. ప్రజా శ్రేయస్సును విస్మరించారు.. బాబు వస్తే జాబు వస్తుందని చెప్పి ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన టీడీపీ.. చివరికి ప్రజా శ్రేయస్సును మరచి భూదందా గురిం చి ఆలోచిస్తోందని సుజయ్‌కృష్ణ మండిపడ్డారు. రాజధానిప్రాంతంలో పేద రైతుల నుంచి టీడీపీ నేతలు భూములు లాక్కొన్నారని అన్నారు. మాఫియా ప్రభుత్వం: చెవిరెడ్డి చంద్రబాబు ప్రభుత్వం మాఫియా ప్రభుత్వంగా మారిందని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తీవ్రంగా దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇసుక, లిక్కర్, ల్యాండ్ మాఫీయాలే కొనసాగుతున్నాయన్నారు. రాజధాని నిర్మాణంలో అక్రమాలకు పాల్పడడమే చంద్రబాబు సర్కారు విధానమన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు పాలన ‘దోచుకో.. దాచుకో’ అన్న రీతిగా కొనసాగుతోందంటూ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన నిప్పులు చెరిగారు. అవిశ్వాసాన్ని ఎదుర్కొందాం మంత్రివర్గ సమావేశంలో సీఎం బాబు ప్రభుత్వంపై శాసనసభలో ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ఇచ్చిన అవిశ్వాసం నోటీసును ఎదుర్కొందామని సీఎం చంద్రబాబు చెప్పారు. అవిశ్వాసంపై చర్చ సమయంలో మంత్రులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతిపక్షం ప్రస్తావించే ప్రతి అంశానికీ దీటుగా సమాధానం ఇవ్వాలన్నారు. శాసనసభ కమిటీ హాల్లో గురువారం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 2016-17 సంవత్సర వార్షిక బడ్జెట్‌ను మంత్రివర్గం ఆమోదించింది. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదిస్తూ వైఎస్సార్సీపీ ఇచ్చిన నోటీసుపై చర్చ జరిగింది. ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తోందని బాబు వివరించారు. అడ్డంకులు సృష్టించి, అప్రతిష్టపాలు చేసేందుకే విపక్షం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిందని ప్రజలకు వివరించాలని సూచించారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను కేంద్రం అమలు చేయడం లేదన్నారు. ఈ విషయాన్ని వివరించి సాయం చేయాలని కోరేందుకు తాను మరోసారి ఢిల్లీకి వెళ్తున్నానని చెప్పారు.