లండన్: బ్రిటన్‌లో విపక్షాల నుంచి ఇప్పటికే తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్న ప్రధాన మంత్రి థెరెసా మేకు మరిన్ని చిక్కులు తప్పేలా లేవు. ఆమెపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సొంత పార్టీ ఎంపీలే సిద్ధమవుతున్నారు. థెరెసా మేపై అవిశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ ఇవ్వాల్సిన లేఖపై సంతకం పెట్టేందుకు ఇప్పటికే 40 మంది కన్జర్వేటివ్ పార్టీ ఎంపీలు సిద్ధంగా ఉన్నారు. మొత్తం 48 మంది ఎంపీలు సంతకం పెడితే ఆమెపై అవిశ్వాస తీర్మానం ఇవ్వొచ్చు. ఇటీవలే వివిధ ఆరోపణలపై థెరెసా మంత్రివర్గంలోని ఇద్దరు మంత్రులు రాజీనామా చేయడం తెలిసిందే. అంతర్జాతీయ వ్యవహారాల మంత్రిగా ఉన్న ప్రీతీ పటేల్... ఇజ్రాయెల్ అధికారులతో అనధికారికంగా భేటీ అయ్యి, గతవారం రాజీనామా చేశారు. అంతకు కొన్నిరోజుల ముందే మరో మంత్రి మైకేల్ ఫాల్లొన్ చెడు ప్రవర్తన కారణంగా వైదొలిగారు. తాజాగా మరో ఇద్దరు మంత్రుల రాజీనామాకు కూడా ప్రతిపక్ష లేబర్ పార్టీ డిమాండ్ చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment