వాషింగ్టన్: అమెరికాలో ప్రముఖ దిగ్గజ సంస్థలు ఫేస్‌బుక్, గూగుల్, అమెజాన్, ఆపిల్ కంపెనీలు యాంటీట్రస్ట్ బిల్లుల పేరిట విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. యాంటీ ట్రస్ట్ బిల్లుల విషయంలో ఫేసుబుక్‌పై నమోదైన వ్యాజ్యాలను సోమవారం యూఎస్ ఫెడరల్ కోర్టు తోసిపుచ్చింది. దీంతో అమెరికాలో ఫేసుబుక్‌కు భారీ ఊరట లభించింది. గతంలో ఫేసుబుక్ ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లను బలవంతంగా కొనుగోలు చేశారనే విషయంలో ఫేస్‌బుక్‌పై యాంటీ ట్రస్ట్ వ్యాజ్యం నమోదైంది.
వన్ ట్రిలియన్ డాలర్లకు ఎగిసినా మార్కెట్ విలువ..
2012లో ఇన్‌స్టాగ్రామ్‌ను ఒక బిలియన్ డాలర్లకు, 2014లో వాట్సాప్‌ను 19 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఫేస్‌బుక్ బహిరంగ మార్కెట్‌లో గుత్తాధిపత్యాన్ని ప్రదర్శిస్తోందనే ఆరోపణలను యూఎస్ కోర్టులో ఎఫ్‌టీసీ నిరూపించలేకపోయింది.ఫేస్‌బుక్ కు యాంటీట్రస్ట్ విషయంలో సానుకూలంగా తీర్పు రావడంతో ఫేసుబుక్ షేర్లు దూసుకుపోయాయి. తీర్పు వెలువడిన తర్వాత ఫేస్‌బుక్ షేర్లు 4 శాతం కంటే ఎక్కువగా పెరిగాయి. దీంతో తొలిసారి ఫేసుబుక్ మార్కెట్ మూలధన విలువ ఒక ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది.
ఫేస్‌బుక్‌కు భారీ ఊరట..!
Published Tue, Jun 29 2021 11:32 AM | Last Updated on Tue, Jun 29 2021 11:33 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment