ఈ కామర్స్ రంగంలో ప్రపంచ బాస్‌గా ఉన్న అమెజాన్‌కి ఎదురు దెబ్బ తగిలింది. సోల్డ్ బై అమెజాన్ బిజినెస్ మోడల్‌పై దాఖలైన పిటిషన్‌పై కనీసం పోరాటం చేయకుండానే తోక ముడిచింది.
ఇది స్కీం
చిరు వ్యాపారులకు ఈ కామర్స్ ఫ్లాట్‌ఫామ్‌పై వేదిక కల్పించే లక్ష్యంతో 2018లో సోల్డ్ బై అమెజాన్‌ను తెర మీదకు తెచ్చింది. రెండేళ్ల పాటు ఈ పథకం అమలు చేసింది. చిరు వ్యాపారులకు తమ వస్తువులను ఈ బిజినెస్ మోడల్ ద్వారా ఆమెజాన్‌లో విక్రయాలు చేపట్టవచ్చు. అయితే ఆయా ఉత్పత్తుల ధరను అమెజాన్ నిర్ణయిస్తుంది. నిర్ణీత మొత్తం పూర్తయ్యే వరకు ఇదే ధర అమల్లో ఉంటుంది. నిర్ణీత మెత్తంలో అమ్మకాలు పూర్తయిన తర్వాత ఆయా ప్రొడక్టుల మీద వచ్చే లాభంలో అమెజాన్ తగ్గించుకుంటుంది.
వివాదం
సోల్డ్ బై అమెజాన్ ప్రొగ్రామ్‌లో చిన్న విక్రేతలకు సంబంధించిన ఉత్పత్తుల ధర నిర్ణయ అధికారం అమెజాన్ దగ్గర ఉండటం సరికాదంటూ అమెరికాలో కింగ్ కంట్రీ సుపీరియర్ కోర్టులో 2022 జనవరి 26న పిటిషన్ నమోదు అయ్యింది. సోల్డ్ బై అమెజాన్ ప్రోగ్రామ్ యాంటీ ట్రస్ట్ లా చట్టాల స్ఫూర్తికి విఘాతం కలిగిస్తోందన్నారు. థర్డ్ పార్టీ సెల్లర్స్ మధ్య పోటీని నియంత్రిస్తూ అమెజాన్‌కు అధిక లాభాలు తెచ్చిపెడుతోందంటూ పిటీషన్‌లో పేర్కొన్నారు. వెంటనే వాషింగ్టన్ అటార్నీ జనరల్ బాబ్ ఫెర్గుసన్ ఈ పిటిషన్‌పై విచారణకు సిద్ధమయ్యారు.
రద్దు చేస్తున్నాం
తమ బిజినెస్ మోడల్‌పై విచారణ ప్రారంభం అవుతుందని తెలిసిన వెంటనే సోల్డ్ బై అమెజాన్ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్టు అమెజాన్ ప్రకటించింది. అంతేకాదు యాంటీ ట్రస్టు చట్టాలను మరింత సమర్థంగా అమలు చేసేందుకు మద్దతుగా వాషింగ్టన్ అటార్నీ జనరల్ కార్యాలయానికి 2.25 మిలియన్ డాలర్లు హడావుడిగా జమ చేసింది. కోర్టులో దాఖలైన వాజ్యంతో సంబంధం లేకుండా ఈ రెండు నిర్ణయాలు తీసుకున్నట్టు ప్రకటించిన అమెజాన్ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించింది.
వెనక్కి తగ్గిన..
థర్డ్ పార్టీ సెల్లర్స్‌కి భారీ ఈ కామర్స్ వేదికను అందుబాటులోకి తెచ్చినట్టుగా సోల్డ్ బై అమెజాన్ కనిపించినా.. వాస్తవంలో పోటీని నియంత్రించి ఈ కామర్స్‌లో మోనోపలికి దారి తీస్తుందనే విమర్శలు ఆది నుంచి వినిపించాయి. చివరకు వాషింగ్టన్ అటార్నీ జనరల్ విచారణ ప్రారంభించడంతో అమెజాన్ పూర్తిగా వెనక్కి తగ్గింది.
చదవండి:బాయ్‌కాట్ అమెజాన్.. జాతీయ పతాకానికి అవమానం!
Comments
Please login to add a commentAdd a comment