competation
-
బంపరాఫర్.. బరువు తగ్గితే సగం నెల జీతం బోనస్!
స్టార్టప్ నుంచి యూనికార్న్ కంపెనీగా ఎదిగిన జెరోదా ఆన్లైన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ ఉద్యోగులకు బంపరాఫర్ ప్రకటించింది. వరల్డ్ హెల్త్‌డేని పురస్కరించుకుని ఉద్యోగల మధ్య ఆసక్తికర పోటీకి ఆ కంపెనీ సీఈవో నితిన్ కామత్ తెర తీశారు. గతంలో ఫిట్‌గా ఉన్న ఉద్యోగులకు రూ. 10 లక్షలు బోనస్ అందించాడు నితిన్ కామత్. జెరోదా కంపెనీ ఫౌండర్ కమ్ సీఈవో నితిన్ కామత్ ఆది నుంచి భిన్నమైన నిర్ణయాలు తీసుకోవడంలో దిట్ట. తాజాగా ఆ కంపెనీ ఉద్యోగుల మధ్య విచిత్రమైన పోటీ పెట్టారు. ఏ ఉద్యోగి బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) 25 కంటే తక్కువగా ఉంటుందో వాళ్లకి సగం నెల జీతం బోనస్‌గా ఇస్తానని ప్రకటించారు. అంతేకాదు ప్రస్తుతం తమ కంపెనీ ఉద్యోగుల సగటు బీఎంఐ 25.3గా ఉందని, దీన్ని 24 కిందకు తీసుకువస్తే ఉద్యోలందరికీ అర నెల జీతం బోనస్‌గా ఇస్తానంటూ కొత్త రకం కాంపిటీషన్ ప్రారంభించారు. ఆర్యోగంగా ఉంటే మిగిలిన అన్ని సాధించవచ్చు. అయితే ఫిట్‌గా ఉండేందుకు వర్కట్లు ప్రారంభించడమే కష్టమైన పని. అందుకే ఆరోగ్యం, ఫిట్నెస్కి సంబంధించి బీఎంఐ అనేది అంత శ్రేష్టమైన కొలమానం కాకపోయినప్పటికీ.. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవడానికి ఇది తేలికైన విధానం. ఈ కారణం చేతనే బీఎంఐ పోటీ పెడుతున్నట్టు నితిన్ కామత్ వివరణ ఇచ్చారు. అంతకాదు రోజు పది వేల అడుగుల నడకతో మీ పోటీని ప్రారంభించండంటూ ఉద్యోగులకు సూచించాడు. నితిన్ కామత్ తీసుకున్న నిర్ణయంపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్యం పట్ల ఉద్యోగులు శ్రద్ధ తీసుకునేలా మోటివేట్ చేయడం మంచి నిర్ణయమని కొందరు సానుకూలంగా స్పందించారు. మరికొందరు ఒక్కొక్కరి శరీర తత్వం ఒక్కోలా ఉంటుందని.. ఇలాంటి పోటీలు పెట్టడం వల్ల చివరికి మంచి కంటే చెడు ఎక్కువగా జరిగే అవకాశం ఉందని సూచిస్తున్నారు We are running a fun health program at @zerodhaonline. Anyone on our team with BMI -
తోక ముడిచిన అమెజాన్! ఇకపై ఆ సర్వీసులు బంద్
ఈ కామర్స్ రంగంలో ప్రపంచ బాస్‌గా ఉన్న అమెజాన్‌కి ఎదురు దెబ్బ తగిలింది. సోల్డ్ బై అమెజాన్ బిజినెస్ మోడల్‌పై దాఖలైన పిటిషన్‌పై కనీసం పోరాటం చేయకుండానే తోక ముడిచింది. ఇది స్కీం చిరు వ్యాపారులకు ఈ కామర్స్ ఫ్లాట్‌ఫామ్‌పై వేదిక కల్పించే లక్ష్యంతో 2018లో సోల్డ్ బై అమెజాన్‌ను తెర మీదకు తెచ్చింది. రెండేళ్ల పాటు ఈ పథకం అమలు చేసింది. చిరు వ్యాపారులకు తమ వస్తువులను ఈ బిజినెస్ మోడల్ ద్వారా ఆమెజాన్లో విక్రయాలు చేపట్టవచ్చు. అయితే ఆయా ఉత్పత్తుల ధరను అమెజాన్ నిర్ణయిస్తుంది. నిర్ణీత మొత్తం పూర్తయ్యే వరకు ఇదే ధర అమల్లో ఉంటుంది. నిర్ణీత మెత్తంలో అమ్మకాలు పూర్తయిన తర్వాత ఆయా ప్రొడక్టుల మీద వచ్చే లాభంలో అమెజాన్ తగ్గించుకుంటుంది. వివాదం సోల్డ్ బై అమెజాన్ ప్రొగ్రామ్‌లో చిన్న విక్రేతలకు సంబంధించిన ఉత్పత్తుల ధర నిర్ణయ అధికారం అమెజాన్ దగ్గర ఉండటం సరికాదంటూ అమెరికాలో కింగ్ కంట్రీ సుపీరియర్ కోర్టులో 2022 జనవరి 26న పిటిషన్ నమోదు అయ్యింది. సోల్డ్ బై అమెజాన్ ప్రోగ్రామ్ యాంటీ ట్రస్ట్ లా చట్టాల స్ఫూర్తికి విఘాతం కలిగిస్తోందన్నారు. థర్డ్ పార్టీ సెల్లర్స్ మధ్య పోటీని నియంత్రిస్తూ అమెజాన్‌కు అధిక లాభాలు తెచ్చిపెడుతోందంటూ పిటీషన్లో పేర్కొన్నారు. వెంటనే వాషింగ్టన్ అటార్నీ జనరల్ బాబ్ ఫెర్గుసన్ ఈ పిటిషన్‌పై విచారణకు సిద్ధమయ్యారు. రద్దు చేస్తున్నాం తమ బిజినెస్ మోడల్‌పై విచారణ ప్రారంభం అవుతుందని తెలిసిన వెంటనే సోల్డ్ బై అమెజాన్ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్టు అమెజాన్ ప్రకటించింది. అంతేకాదు యాంటీ ట్రస్టు చట్టాలను మరింత సమర్థంగా అమలు చేసేందుకు మద్దతుగా వాషింగ్టన్ అటార్నీ జనరల్ కార్యాలయానికి 2.25 మిలియన్ డాలర్లు హడావుడిగా జమ చేసింది. కోర్టులో దాఖలైన వాజ్యంతో సంబంధం లేకుండా ఈ రెండు నిర్ణయాలు తీసుకున్నట్టు ప్రకటించిన అమెజాన్ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించింది. వెనక్కి తగ్గిన.. థర్డ్ పార్టీ సెల్లర్స్‌కి భారీ ఈ కామర్స్ వేదికను అందుబాటులోకి తెచ్చినట్టుగా సోల్డ్ బై అమెజాన్ కనిపించినా.. వాస్తవంలో పోటీని నియంత్రించి ఈ కామర్స్‌లో మోనోపలికి దారి తీస్తుందనే విమర్శలు ఆది నుంచి వినిపించాయి. చివరకు వాషింగ్టన్ అటార్నీ జనరల్ విచారణ ప్రారంభించడంతో అమెజాన్ పూర్తిగా వెనక్కి తగ్గింది. చదవండి:బాయ్‌కాట్ అమెజాన్.. జాతీయ పతాకానికి అవమానం! -
యూఎస్ నేషనల్ సైన్స్ బీ పోటిల్లో రెండో స్థానంలో ఢిల్లీ బాలుడు
న్యూఢిల్లీ: ప్రఖ్యాత జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ నిర్వహించిన యూఎస్ నేషనల్ సైన్స్ బీ పోటిల్లో ఢిల్లీకి చెందిన ఎనిమిదేళ్ల బాలుడు అద్వాయ్ మిశ్రా రెండవ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. దీంతో ప్రపంచంతో అత్యంత ప్రతిభావంతులైన విద్యార్థులలో ఒకరిగా నిలిచాడు. నేషనల్ సైన్స్ బీ అనేది బయోలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఆస్ట్రనామీ, మ్యాథమెటిక్స్, తదితర శాస్త్ర రంగాలకి సంబంధించిన వ్యక్తిగత ప్రశ్నల బజర్ ఆధారిత సైన్స్ పోటీ. (చదవండి: క్యాన్సర్‌పై సంచలన వివరాలు వెల్లడించిన బ్రిటన్ శాస్త్రవేత్తలు) ఈ బజర్ ఆధారిత ప్రాంతీయ, నేషనల్ చాంపియన్ షిప్ పోటికి విద్యార్థులను రాతపరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. అద్యాయ్ మిశ్రా వచ్చే ఏడాది ఆగస్టులో జరగనున్న ఇంటర్నేషనల్ జాగ్రఫీ బీ వరల్డ్ చాంపియన్‌షిప్ పై దృష్టి సారించనున్నాడు. వృత్తి రీత్యా తల్లిదండ్రులు అమెరికాలో ఉండటంతో వారితో 2018 వరకు అమెరికాలోనే ఉన్నాడు. ప్రస్తుతం ఢిల్లీ పాఠశాలలో చదువు కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో మిశ్రా జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీకి చెందిన ప్రతిష్టాత్మక సెంటర్ ఫర్ టాలెంటడ్ యూత్ (సీటీవై)లో కూడా ప్రవేశం పొందాడు. ఈ యూనివర్సిటీలో మార్క్ జూకర్ బర్గ్ , గూగుల్ వ్యవస్థాపకులు రోడ్స్ స్కాలర్, మార్క్ ఆర్థర్ ఫెలోస్ తదితర ప్రముఖులు పూర్వ విద్యార్థలు కావడం విశేషం. (చదవండి: చావు నోట్లో తలపెట్టి వచ్చాడు.. బస్సు ఒక్క అడుగు ముందుకు కదిలినా..) -
Bala Editor Competition: పిల్లలను తారతమ్య భేదాలు లేకుండా పెంచాలి
సాక్షి, భూత్పూర్ (మహబూబ్‌నగర్): పిల్లలను పెంచడంలో తల్లిదండ్రులు తారతమ్య భేదాలు లేకుండా పెంచాలని, వారిలో నైపుణ్యం వెలికితీస్తే భవిష్యత్‌లో రాణిస్తారని ‘సాక్షి’ తెలంగాణ ఏజీఎం మల్లు శివకుమార్‌రెడ్డి అన్నారు. ఇటీవల ‘సాక్షి’ మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహించిన బాలఎడిటర్ పోటీల్లో విజేతలకు మహబూబ్‌నగర్ యూనిట్ కార్యాలయంలో సోమవారం బహుమతులు అందజేశారు. పాఠశాల స్థాయి విద్యార్థుల్లో నైపుణ్యం పెంచేందుకు, వినూత్న ఆలోచనలు కలిగే విధంగా పోటీలు నిర్వహించామని అన్నారు. రెండు కేటగిరీలుగా నిర్వహించగా, మంచి స్పందన వచ్చిందని తెలిపారు. మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాలో రాష్ట్ర, జిల్లాస్థాయి బహుమతులు గెలుపొందారని తెలిపారు. రాష్ట్రస్థాయిలో ఎ కేటగిరిలో ఒకరు, జిల్లా స్థాయి ఎ కేటగిరిలో ఐదుగురు విద్యార్థులు, బి కేటగిరిలో ఐదుగురు విద్యార్థులు ప్రతిభ కనబర్చారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహబూబ్‌నగర్ ‘సాక్షి’ యూనిట్ మేనేజర్ శ్యాంసుందర్‌రెడ్డి, సర్క్యులేషన్ మేనేజర్ లింగయ్య, స్టోర్స్ ఇన్చార్జ్ నరేష్, జూనియర్ ఆఫీసర్స్ నాగాంజనేయులు, సాయి, ఏసీఓ రమేష్ మరియు సర్క్యులేషన్ సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. గర్వంగా ఉంది విద్యార్థుల్లో ప్రతిభను గుర్తించడానికి ‘సాక్షి’ పత్రిక చేపడుతున్న పోటీ పరీక్షలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ‘సాక్షి’ కార్యాలయంలో బహుమతి తీసుకోవడం సంతోషంగా ఉంది. బాల ఎడిటర్లో బహుమతి రావడం గర్వంగా ఉంది. – సాధియా ఫాతిమా, గెలాక్సి హైస్కూల్, మహబూబ్‌నగర్ ఉపాధ్యాయుల ప్రోత్సాహం వల్లే.. ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో ఈ పోటీలో పాల్గొన్నాను. ఇలాంటి పోటీ పరీక్షల్లో పాల్గొంటే భయం పోయి, అవగాహన పెరుగుతుందని ఉపాధ్యాయులు మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. అందువల్లే బాలఎడిటర్ పోటీల్లో పాల్గొన్నాను. రాష్ట్ర, జిల్లాస్థాయిలో రెండు బహుమతులు గెలుపొందాను. చాలా సంతోషంగా ఉంది. – కౌషిక్, గెలాక్సి, హైస్కూల్, మహబూబ్‌నగర్ చాలా ఆనందంగా ఉంది బాలఎడిటర్ పోటీలో నాకు బహు మతి రావడంతో చాలా సంతోషంగా ఉంది. తల్లి దండ్రులు, ఉపాధ్యాయుల సమక్షంలో బహుమతి తీసుకోవడం గొప్పగా ఉంది. – వినయ్ కుమార్, ప్రజ్ఞ ఉన్నత పాఠశాల, మహబూబ్‌నగర్ పోటీతత్వం పెరిగింది బాల ఎడిటర్ కార్య క్రమంతో విద్యార్థుల్లో పోటీతత్వం పెరిగింది. మా పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థుల్లో ఒకరు రాష్ట్రస్థాయికి, మరొకరు జిల్లాస్థాయికి ఎంపిక కావడం ఆనందంగా ఉంది. ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేశారు. ‘సాక్షి’ యాజమాన్యానికి కృతజ్ఞతలు. – భాను ప్రకాశ్, ప్రిన్సిపాల్, గెలాక్సీ హై స్కూల్, మహబూబ్‌నగర్ ‘సాక్షి’కి అభినందనలు పోటీ పరీక్షలు నిర్వహించిన ‘సాక్షి’ యాజమాన్యానికి అభినందనలు. పాఠశాల విద్యార్థులకు బయట పోటీ పరీక్షలు ఎలా ఉంటాయో తెలిసివచ్చింది. బాల ఎడిటర్ కాంపిటీషన్లో పాల్గొనడంతో విద్యార్థులు చాలా సంతోషంగా ఉన్నారు. విలువైన బహుమతులు ఇవ్వడం కూడా బావుంది. – చల్మారెడ్డి, ప్రిన్సిపాల్, ప్రజ్ఞా హైస్కూల్,మహబూబ్‌నగర్ -
సముద్ర సదస్సుకు నైన్త్ క్లాస్ యష్మి..
యష్మి తొమ్మిదో తరగతి విద్యార్థిని. ఐక్యరాజ్యసమితి ‘సముద్ర సదస్సు’ కు ఎంపికైంది. ‘వాటర్ ఈజ్ సేక్రెడ్’ అనే అంశంపై కావేరీ నది మీద యష్మి తీసిన చిన్న డాక్యుమెంటరీ ఆమెకు ఈ అర్హతను కల్పించింది. త్వరలోనే హవాయిలో జరిగే సముద్ర సదస్సులో ప్రపంచంలోని ఆలోచనాపరులతో కలిసి యష్మి కూర్చోబోతోంది! కరోనా కారణంగా ఒకవేళ ఆ సదస్సు ఆన్లైన్లో జరిగినా తనేమీ నిరుత్సాహపడబోనని, యువతకు తన సందేశం వెళ్లింది అంతే చాలునని యష్మి సంతోషంగా చెబుతోంది. సముద్ర సదస్సుకు కావేరీ నదిని తీసుకెళుతున్న నావిక.. యష్మి. లాక్డౌన్లో తాగడానికి నీళ్లు లేక, ఊరికి బారెడు దూరంలో ఎక్కడో కొన్ని స్వచ్ఛమైన నీటి చుక్కలున్నా బయటికి వెళ్లే దారి లేక ఇంట్లోనే బావులు తవ్వుకున్నవాళ్లున్నారు! లాక్డౌన్ పర్యవసానాల విశ్వరూపానికి ఇదొక్క ఉదాహరణ చాలు. జీవికి గొంతు తడుపుకోడానికి నీళ్లు లేకపోవడం ఏమిటి! భూగోళమేమీ ఒట్టిపోలేదే?! నదులున్నాయి, చెరువులున్నాయి, ఊటలు, నీటి కుంటలూ ఉన్నాయి. ఉన్నాయి కానీ తాగేందుకు వీల్లేనంతగా కలుషితం అవుతున్నాయి! జలాశయాలు అడుగంటిపోతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే సమీప భవిష్యత్తులో? ‘భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహించండి’ అని ఐక్యరాజ్య సమితి స్కూల్ పిల్లలకు పోటీ పెట్టింది. ఆ ఊహ.. కథ చెప్పినట్లుగా ఉండాలి. ఊహ ‘వీడియో’ రూపంలో ఉండాలి. అదీ నిబంధన. 13–17 మధ్య వయసు గల పిల్లల కోసం జరిగిన ఈ పోటీలో అనేక కేటగిరీలు ఉన్నాయి. ‘వాటర్ ఈజ్ సేక్రెడ్’ అనేది వాటిల్లో ఒకటి. నీరు పవిత్రమైనదని అర్థం. ఆ కేటగిరీలో కొడగు విద్యార్థిని యష్మి విజేతగా నిలిచింది. యష్మి మైసూరులోని ఆచార్య విద్యాకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. కొడగులోని నెలజి ఆమె స్వగ్రామం. లాక్డౌన్లో తన ఊరు ఎలా ఉందో కళ్లారా చూసింది యష్మి. నీరు ఎంత విలువైందో కూడా అప్పుడే ఆమెకు తెలిసింది. తమ ఊరొక్కటే కాదు, రాష్ట్రంలోని అన్ని ఊళ్లూ అలానే ఉన్నాయని పత్రికల్లో చూసింది. నీటి చుక్కకు కరువేమీ లేదు. కలుషితం కాని నీరే.. ఎక్కడా లేదు! అసలే కరోనా. కలుషితమైన నీరు తాగడం వల్ల, గాలిలోని కాలుష్యాలను పీల్చడం వల్ల జబ్బున పడితే, అది కరోనా ఏమోనన్న భయం. ఈ పరిస్థితిని మార్చేందుకు తనేమీ చేయలేదు. ఏం చేయాలో కొంత చెప్పగలదు. కానీ ఎవరికి చెప్పాలో తెలియదు. రోజులు గడిచాయి. లాక్డౌన్ ముగిసింది. యష్మి ఎనిమిది నుంచి తొమ్మిదికి వచ్చింది. ఈ సమయంలో క్లాస్ టీచర్ ఓరోజు యు.ఎన్. హెచ్2ఒ 21 వాటర్ సమ్మిట్ గురించి చెప్పారు. హెచ్2ఒ 21 సమ్మిట్ పేరుతో ఐక్యరాజ్య సమితి టీనేజ్ విద్యార్థులకు భవిష్యత్తులో నీరు అనే టాపిక్ మీద ‘స్టోరీ టెల్లింగ్’ పోటీ పెడుతోంది. అందులో విజేతగా నిలిస్తే, ఆ తర్వాత యూఎస్‌లోని హవాయి రాష్ట్రంలో జరిగే ‘యు.ఎస్. ఓషన్ డికేడ్ సమ్మిట్’లో పాల్గొనేందుకు ఆహ్వానం లభిస్తుంది. అదేమీ మామూలు సంగతి కాదు. స్టోరీ టెల్లింగ్‌లో జల సంరక్షణ కోసం విజేతలు ఇచ్చిన సూచనలపై మేధావులు, ఆలోచన పరులు ఓషన్ సమ్మిట్ (సముద్ర సదస్సు)లో చర్చలు జరుపుతారు. అది చాలదా! ‘‘ఇదిగో ఈ అద్భుతమైన ఆలోచనను ఇచ్చింది ఈ అమ్మాయే’’ అని అంతా చప్పట్లు చరుస్తూ అభినందిస్తూ ఉంటే!! క్యాష్ ప్రైజ్, ప్రశంసాపత్రం ఎలాగూ ఉంటాయి. యష్మి వెంటనే ఆ పోటీలో పాల్గొంది. ‘వాటర్ ఈజ్ సేక్రెడ్’ అనే కేటగిరీని ఎంపిక చేసుకుంది. లాక్డౌన్లో తన అనుభవాలను పాయింట్లుగా రాసుకుంది. వాతావరణ మార్పులపై ప్రసిద్ధుల ప్రసంగాల నుంచి కొంత నోట్స్ సిద్ధం చేసుకుంది. పోటీలో పాల్గొనడానికి ముందు హెచ్2ఓ 21 నియమ నిబంధనల కోసం ఐక్యరాజ్య సమితి వరుసగా నాలుగు శని, ఆదివారాలు ఏర్పాటు చేసిన ఆన్లైన్ తరగతులకు హాజరు అయింది. అక్కడే కేటగిరీల కేటాయింపు జరుగుతుంది. యష్మి ‘వాటర్ ఈజ్ సేక్రెడ్’ కేటగిరీని ఎంపిక చేసుకోడానికి తగిన కారణమే ఉంది. కొడగులోని వాళ్లంతా కావేరీ నదిని దైవంలా పూజిస్తారు. అన్లైన్ తరగతులకు హాజరవుతున్నప్పుడే వాళ్లు చెబుతున్న విషయాలను బట్టి.. తల్లి కావేరి తమను కాపాడుతున్నంతగా, కావేరిని తాము కాపాడుకోవడం లేదని ఆమె గ్రహించింది. పైగా యష్మి కావేరి నదిని పూజించే కొడవ సామాజిక వర్గానికి చెందిన కుటుంబంలోని అమ్మాయి. వెంటనే ఆమె కొడగు వెళ్లిపోయి, కావేరీ నది అందాలను అనేక కోణాలలో షూట్ చేసింది. వాటిని కథానుగుణంగా ఎడిట్ చేసింది. నేపథ్య గీతంగా కొడవలకు ప్రత్యేకమైన భక్తి పాటను ఉంచింది. అంత అందమైన కావేరి నది.. కాలుష్యం కారణంగా ఎలా అంద విహీనం అయిపోతున్నదో చూపించింది. వీడియో చివర్లో ‘లెటజ్ హీల్ హర్. నాట్ ఫిక్స్ హర్’ అనే సందేశంతో.. యువతీ యువకులు కావేరి నది స్వచ్ఛత ను పునరుద్ధరించేందుకు చేస్తున్న ప్రయత్నాలను దృశ్యరూపకంగా జత చేసింది. ఇంత అద్భుతం గా చేశాక యష్మి విజేత కాకుండా ఉంటుందా! అయింది. త్వరలో హవాయి వెళ్లబోతోంది. ‘‘నా చిన్నప్పుడు మా అమ్మ చెబుతుండేది. అమ్మ చిన్నప్పుడు కొడగు ప్రాంతం ఎంతో అందంగా ఉండేదట. ‘భారీగా వర్షాలు పడేవి. చెరువులు స్వచ్ఛంగా ఉండేవి. నేను పెరిగి పెద్దయ్యేనాటికి వాతావరణంలో కాలుష్యాలు పెరిగినా వర్షాలేమీ తగ్గలేదు కానీ, నీటి స్వచ్ఛత తగ్గింది. నువ్వు పెద్దయి, నీ తర్వాతి తరం వచ్చాక నువ్వూ.. మా చిన్నప్పుడు ఇలా ఉండేది.. అని చెప్పకూడదని నా ఆశ. అందుకు మీ తరం వారే ఏదైనా చేయాలి. ఏదైనా కాదు. రెండు చేయాలి. కాలుష్యం తగ్గించాలి. పచ్చదనం పెంచాలి’’ అని అమ్మ చెబుతుండేది. అమ్మ చెప్పిన మాటలనే నేను హవాయిలో నా వీడియో ప్రెజెంటేషన్‌లో చెబుతాను’’ అంటోంది యష్మి. వీడియో తయారు చేయడానికి తన కజిన్ భువన, ఆమె తండ్రి తనకు సహాయపడ్డారట. యష్మి తల్లి నళిని, తండ్రి కుశలప్ప తమ కూతురి కి యూఎస్ వెళ్లే అవకాశం రావడంతో సంతోషం గా ఉన్నారు. కరోనా కారణంగా ఆమె వెళ్లబోయే ‘ఓషన్ డికేడ్ సమ్మిట్’ అన్లైన్లో జరిగే అవకాశాలున్నా.. ‘నా సందేశం వెళ్లింది. అంతే చాలు’ అని అంటోంది యష్మి. -
‘ప్రైవేట్’కు దీటుగా..
మందమర్రిరూరల్ : మండలంలోని జిల్లా పరిషత్ పాఠశాల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలల దీటుగా ఉపాధ్యాయులు విద్యబోధన చేస్తున్నారు. వార్షిక పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించే దిశగా ఉపాధ్యాయ బృందం విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. మండలంలో మొత్తం తొమ్మిది పాఠశాలలున్నాయి. ఐదు జిల్లా పరిషత్ హైస్కూల్స్ కాగా, రెండు ఎయిడెడ్, ఒకటి మోడల్æస్కూల్, ఒకటి కస్తూర్బా పాఠశాల. మొత్తం 450 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ పాఠ్యాంశాల్లో సందేహాలను ఉపాధ్యాయులు నివృత్తి చేస్తున్నారు. గత సంవత్సరం వార్షిక ఫలితాల్లో 85 శాతం ఉత్తీర్ణత సాధించగా, మోడల్ స్కూల్ విద్యార్థిని జిల్లా టాపర్‌గా నిలిచింది. ఉపాధ్యాయుల ప్రత్యేక శ్రద్ధ విద్యార్థులు ‘పది’లో ఉత్తీర్ణత శాతం సాధించేందుకు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. చదువులో వెనుకబడినవారిపై శ్రద్ధ తీసుకుంటున్నారు. వీరికి సులభపద్ధతిలో బోధన చేస్తున్నారు. ఈ విద్యా సంవత్సరం పది పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా ఉపాధ్యాయ బృందం కృషిచేస్తోంది. సులభ పద్ధతిలో బోధన నేను పొన్నారం జెడ్పీ ఉన్నత పాఠశాల పదో తరగతి చదువుతున్నా. ఉపాధ్యాయులు పాఠ్యాంశాలను సులభపద్ధతిలో అర్ధమయ్యే విధంగా బోధిస్తున్నారు. చదువులో వెనుకబడినవారికి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. – నెండుగురి సాయినికిత్,పదోతరగతి పొన్నారం పాఠశాల వంద శాతం ఉత్తీర్ణత సాధిస్తాం మండలంలోని తొమ్మిది పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత శాతం సాధించే దిశగా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. త్రీఆర్స్ బోధన పద్ధతి ద్వారా విద్యార్థులకు అర్దమయ్యేలా పాఠాలు చెప్పించాం. – జాడి పోచయ్య,ఎంఈవో, మందమర్రి -
సీఆర్సీ కళాసేవ అభినందనీయం
-ఎమ్మెల్యే చిర్ల, నటుడు ఎల్బీ శ్రీరామ్ -రాష్ట్రస్థాయి ఉగాది నాటిక పోటీలు ప్రారంభం రావులపాలెం : అంతరించి పోతున్న కళలను, కళాకారులను ప్రోత్సహించేందుకు సీఆర్సీ కాటన్ కళాపరిషత్ చేస్తున్న కృషి అభినందనీయం అని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, ప్రముఖ సినీనటుడు ఎల్బీ శ్రీ రామ్ ప్రశంసించారు. బుధవారం రాత్రి రావులపాలెంలోని కాస్మోపాలిటన్ రిక్రియేషన్ క్లబ్(సీఆర్సీ) కాటన్ కళాపరిషత్ ఆధ్వర్యంలో 19వ ఉగాది ఆహ్వాన రాష్ట్ర స్థాయి నాటిక పోటీలు ప్రారంభమయ్యాయి. సీఆర్సీ ఏసీ ఆడిటోరియంలో జగ్గిరెడ్డి, శ్రీరామ్ జ్యోతి ప్రజ్వలన చేసి, పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాపరిషత్ కన్వీనర్ డాక్టర్ గొలుగూరి వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే జగ్గిరెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రజలకు 19 వసంతాలుగా నాటికలను పరిచయం చేస్తు వారిలో ఆలోచన రేకెత్తిస్తున్న సీఆర్సీ సేవలు ప్రశంసనీయం అన్నారు. శ్రీరామ్ మాట్లాడుతూ స్వాతంత్రోద్యమం కాలంలో నాటక రంగం కీలక పాత్ర వహించిందన్నారు. అనంతరం బ్రహ్మశ్రీ చిర్రావూరి శ్రీరామ శర్మను ఎమ్మెల్యే జగ్గిరెడ్డి, ఎల్బీ శ్రీరామ్, సీఆర్సీ కార్యవర్గ సభ్యులు శాలువాలు, పూలమాలలతో సన్మానించారు. సినీ నటుడు జెన్నీ, రామచంద్రపురం డీఎస్సీ ఎన్బీ మురళీకృష్ణ, ఎంపీపీ కోట చెల్లయ్య, జెడ్పీటీసీ సాకా ప్రసన్నకుమార్, సీఆర్సీ అధ్యక్షుడు మల్లిడి కనికిరెడ్డి, కార్యదర్శి కర్రి ఆశోక్‌రెడ్డి, సేవా విభాగం డైరెక్టర్ కర్రి సుబ్బారెడ్డి, కళాపరిషత్ డైరెక్టర్ కుడుపూడి శ్రీనివాస్, సత్తి రామకృష్ణారెడ్డి(మారుతి), మల్లిడి వీర్రెడ్డి, నల్లమిల్లి వీరాఘవరెడ్డి, కొవ్వూరి నరేష్‌కుమార్‌రెడ్డి, మంతెన రవిరాజు, పలివెల త్రిమూర్తులు, మన్యం సుబ్రహ్మణ్శేశ్వరావు తదితరులు పాల్గొన్నారు. అలరించిన నాటికలు మొదటిరోజు ప్రదర్శించిన రెండు నాటికలు ప్రేక్షకులను అలరించాయి. గుంటూరు జిల్లా కట్రపాడు ఉషోదయ కళానికేతన్ ‘గోవు మాలచ్చిమి’ నాటికను చెరుకూరి సాంబశివరావు రచించి దర్శకత్వం వహించారు. ఒకప్పుడు సైకిల్ అద్దెకు తీసుకుని అద్దె చెల్లించేవాళ్ళమని ఇప్పుడు ఆడదాన్ని గర్భాన్ని అద్దెకు తీసుకుని వ్యాపారంగా మార్చి అమ్మతనాన్ని మంటకలుపుతున్నామని ఈ నాటిక ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అద్దె గర్భ వ్యాపారానికి సంకెళ్ళు వేసి సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలని తెలియజేప్పారు. అనంతరం హైదరాబాద్ శ్రీ మురళీ కళానిలయం వారు ప్రదర్శించిన ‘అం అః కం కః’ నాటిక హాస్యభరితంగా సాగింది. కష్టపడకుండా కోట్లు సంపాదించాలని దురాశతో అబద్ధాలు చెప్పి మోసాలు చేసి చివరకు బాకీదారులను తట్టుకోలేక చనిపోయినట్టు నాటకం ఆడిన విశ్వపతికి అప్పుల వాళ్ళు ఎలా బుద్ధి చెప్పారో చూపారు. ప్రేక్షకులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రదర్శనలను తిలకించారు. వారికి సీఆర్సీ సభ్యులు ఆల్పాహారం ఏర్పాటు చేశారు. పోటీలకు అదృష్టదీపక్, పోల్నాటి గోవిందరావు, బొడ్డు రాజబాబు నాయ్యనిర్ణేతలుగా వ్యవహరించారు. -
రసవత్తరంగా ఎద్దుల బల ప్రదర్శన
జంగహేశ్వరపురం(గురజాలరూరల్): జంగమహేశ్వరపురం గ్రామంలో పలనాటి తిరుమలగా ప్రసిద్ధి చెందిన శ్రీవేంకటేశ్వరస్వామి తిరునాళ్ల సందర్భంగా రైతుసంఘ కమిటీ వారు ఎద్దుల బండలాగు పోటీలను ఆదివారం రాత్రి వరకు నిర్వహించారు. సేద్యపు విభాగాలకు జాతీయ స్థాయిలో పోటీలను నిర్వహిస్తున్నట్లు, ప్రతి విభాగంలో 5 బహుమతులు అందిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. సేద్యపు విభాగంలో: దాచేపల్లి మండలం, కేసానుపల్లి గ్రామానికి చెందిన నెల్లూరి రామకోటయ్య ఎద్దులు 3500 అడుగుల లాగి రూ. 30,000 మొదటి బహుమతి, కృష్ణా జిల్లా గన్నవరం మండలం మెట్లపల్లి గ్రామానికి చెందిన చికలపాటి రాజీవ్ ఎద్దులు 3250 అడుగులు లాగి రూ. 25,000 రెండోహుమతిని, కర్నూలు జిల్లా పాణ్యం మండలం, కుండజూటూరు గ్రామానికి చెందిన సద్దల సూర్యనారాయణరెడ్డి ఎద్దులు 3059 అడుగులు లాగి రూ. 15,000 మూడవ బహుమతిని, పత్తిపాడుకు చెందిన కాకాని శ్రీహరిరావు ఎద్దులు 3016 అడుగులు లాగి రూ.10,000 నాల్గో బహుమతిని, మాచవరం మండలం, కొత్తపాలెం గ్రామానికి చెందిన యామని మోహన్శ్రీ ఎద్దులు 3000 అడుగులు లాగి రూ. 8,000 ఐదో బహుమతిని గెలుపొందాయి. న్యాయనిర్ణేతలుగా పి.సుబ్బారెడ్డి, గూడ శ్రీనివాసరావు పాల్గొన్నారు. కార్యక్రమంలో నిర్వహణ కమిటీ, చవ్వా చౌరెడ్డి, రెక్కల యలమందారెడ్డి, భవనాసి పకీరరెడ్డి, ఎనుముల వెంకటరెడ్డి, అడుసుమల్లి కోటయ్య, ఎనుముల సుబ్బారెడ్డి ,గొల్లపల్లి సత్యం, ఆవుల లక్ష్యారెడ్డి, గ్రామపెద్దలు, ఎడ్లపోటీలను లకించేందుకు చుట్టు పక్కల గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
రసవత్తరంగా ముగిసిన ఎడ్ల పోటీలు
సబ్ జూనియర్స్ విభాగంలో ప్రథమస్థానంలో కృష్ణా జిల్లా ఎడ్లు సీనియర్స్ విభాగంలో సత్తాచాటిన ప్రకాశం జిల్లా గిత్తలు ప్రత్తిపాడు(గుంటూరు) : నియెజకవర్గ కేంద్రంలో ఈనెల 5వ తేదీ నుంచి నిర్వహిస్తున్న నందమూరి తారక రామారావు మెమోరియల్ ఒంగోలు జాతి గిత్తల బండలాగుడు ప్రదర్శన పోటీలు శుక్రవారం రాత్రితో ముగిశాయి. సబ్‌జూనియర్స్ విభాగంలో.. గురువారం జరిగిన సబ్‌జూనియర్స్ విభాగంలో గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాలకు చెందిన ఏడు ఎడ్ల జతలు పోటీల్లో పాల్గొన్నాయి. కష్ణా జిల్లా పెనమలూరు మండలం కానూరు గ్రామానికి చెందిన డీవీఆర్ మెమోరియల్ దేవభక్తు సుబ్బారావు జత 3,732.7 అడుగులు లాగా ప్రదమస్థానంలో, పెదకాకాని మండలం కొప్పురావూరు గ్రామానికి చెందిన టీఎస్ఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ సాయిశ్రీ కనస్ట్రక్షన్స్ తోట శ్రీనివాసరావు జత 3119.1 అడుగులు లాగి ద్వితీయ స్థానాన్ని, చేబ్రోలు మండలం నారాకోడూరు గ్రామానికి చెందిన వెలగా శ్రీనివాసరావు జత 3000 అడుగులు లాగి తతీయస్థానాన్ని, కృష్ణాజిల్లా మోపిదేవి మండలం బొబ్బర్లంక గ్రామానికి చెందిన కోనేరు నిరూప్బాబు జత 2954.2 అడుగులు లాగి నాల్గో స్థానాన్ని, వేమూరు మండలం కొచ్చెర్లపాడు గ్రామానికి చెందిన తాడికొండ సుధీర్‌బాబు జత 2869.2 అడుగులు లాగి ఐదో స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. సీనియర్స్ విభాగంలో.. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు సీనియర్స్ విభాగంలో పోటీలు జత జతకూ తీవ్ర ఉత్కంఠభరితంగా సాగాయి. గుంటూరు, ప్రకాశం, కృష్ణా, నల్గొండ, ఖమ్మం జిల్లాల నుంచి పదకొండు జతలు పోటీల్లో పాల్గొన్నాయి. వాటిలో ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం మద్దిరాలముప్పాళ్ల గ్రామానికి చెందిన కల్యాణ్ ఆక్వాఫామ్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్ జత 25 నిమిషాలలో 2416.7 అడుగులు లాగి ప్రదమస్థానంలో నిలిచాయి. కష్ణాజిల్లా పెనమలూరు మండలం కానూరు గ్రామానికి చెందిన డీవీఆర్ మెమోరియల్ దేవభక్తుని సుబ్బారావు జత 2407.2 అడుగులు లాగి ద్వితీయ స్థానంను, ఖమ్మంజిల్లా కామేపల్లి మండలం పాతలింగాల గ్రామానికి చెందిన ఆర్‌ఎన్‌రెడ్డి నంది బ్రీడింగ్ బుల్స్‌కు చెందిన (ఒకగిత్త) పెదకాకాని మండలం కొప్పురావూరు గ్రామానికి చెందిన టీఎస్ఆర్ ఇన్ప్రా డెవలపర్స్ (ఒకగిత్త)ల జత, కష్ణా జిల్లా పెనమలూరు మండలం యనమదలకుదురు గ్రామానికి చెందిన అనంతనేని శ్రీకావ్య శ్రీమధుల జతలు 2400 అడుగులు సమానంగా లాగి తతీయ స్థానంలో నిలిచాయి. వీరిద్దరికీ మూడు నాలుగు బహుమతులను కలిపి చెరిసమానంగా అందించనున్నట్లు కమిటీ తెలిపింది. తెనాలిటౌన్కు చెందిన బట్టా నాగసాయినిఖిల్గౌతమ్లు 1876 అడుగులు లాగి ఐదో స్థానంను దక్కించుకున్నారు. ప్రకాశం జిల్లా దొనకొండ మండలం పొల్లేపల్లి గ్రామంకు చెందిన బెజవాడ డేవిడ్ జత 1800 అడుగులు లాగి ఆరో స్థానం, కష్ణాజిల్లా గన్నవరానికి చెందిన కాసనేని పావనచౌదరి 1633 అడుగులు లాగి ఏడవ స్థానంలో నిలిచారు. వీరికి జీడీసీసీబీ చైర్మన్ ముమ్మనేని వెంకటసుబ్బయ్య బహుమతులను అందజేశారు. -
జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు
మునగపాక:జిల్లాస్థాయి ఆహ్వాన వాలీబాల్ పోటీలు ఆగస్టు 12నుంచి మూడు రోజులు నిర్వహిస్తున్నట్టు గ్రామీణ యువజన మందిరం అధ్యక్షుడు ఆడారి గంగమహేష్ తెలిపారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించే ఈ పోటీల వివరాలకు8008574728 నంబర్లో సంప్రదిచాలి.