రసవత్తరంగా ఎద్దుల బల ప్రదర్శన
జంగహేశ్వరపురం(గురజాలరూరల్): జంగమహేశ్వరపురం గ్రామంలో పలనాటి తిరుమలగా ప్రసిద్ధి చెందిన శ్రీవేంకటేశ్వరస్వామి తిరునాళ్ల సందర్భంగా రైతుసంఘ కమిటీ వారు ఎద్దుల బండలాగు పోటీలను ఆదివారం రాత్రి వరకు నిర్వహించారు. సేద్యపు విభాగాలకు జాతీయ స్థాయిలో పోటీలను నిర్వహిస్తున్నట్లు, ప్రతి విభాగంలో 5 బహుమతులు అందిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.
సేద్యపు విభాగంలో: దాచేపల్లి మండలం, కేసానుపల్లి గ్రామానికి చెందిన నెల్లూరి రామకోటయ్య ఎద్దులు 3500 అడుగుల లాగి రూ. 30,000 మొదటి బహుమతి, కృష్ణా జిల్లా గన్నవరం మండలం మెట్లపల్లి గ్రామానికి చెందిన చికలపాటి రాజీవ్ ఎద్దులు 3250 అడుగులు లాగి రూ. 25,000 రెండోహుమతిని, కర్నూలు జిల్లా పాణ్యం మండలం, కుండజూటూరు గ్రామానికి చెందిన సద్దల సూర్యనారాయణరెడ్డి ఎద్దులు 3059 అడుగులు లాగి రూ. 15,000 మూడవ బహుమతిని, పత్తిపాడుకు చెందిన కాకాని శ్రీహరిరావు ఎద్దులు 3016 అడుగులు లాగి రూ.10,000 నాల్గో బహుమతిని, మాచవరం మండలం, కొత్తపాలెం గ్రామానికి చెందిన యామని మోహన్‌శ్రీ ఎద్దులు 3000 అడుగులు లాగి రూ. 8,000 ఐదో బహుమతిని గెలుపొందాయి.
న్యాయనిర్ణేతలుగా పి.సుబ్బారెడ్డి, గూడ శ్రీనివాసరావు పాల్గొన్నారు. కార్యక్రమంలో
నిర్వహణ కమిటీ, చవ్వా చౌరెడ్డి, రెక్కల యలమందారెడ్డి, భవనాసి పకీరరెడ్డి, ఎనుముల వెంకటరెడ్డి, అడుసుమల్లి కోటయ్య, ఎనుముల సుబ్బారెడ్డి ,గొల్లపల్లి సత్యం, ఆవుల లక్ష్యారెడ్డి, గ్రామపెద్దలు, ఎడ్లపోటీలను లకించేందుకు చుట్టు పక్కల గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.