
పొన్నారం పాఠశాల ప్రత్యేక తరగతుల్లో చదువుతున్న విద్యార్థులు
మందమర్రిరూరల్ : మండలంలోని జిల్లా పరిషత్ పాఠశాల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలల దీటుగా ఉపాధ్యాయులు విద్యబోధన చేస్తున్నారు. వార్షిక పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించే దిశగా ఉపాధ్యాయ బృందం విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. మండలంలో మొత్తం తొమ్మిది పాఠశాలలున్నాయి. ఐదు జిల్లా పరిషత్ హైస్కూల్స్ కాగా, రెండు ఎయిడెడ్, ఒకటి మోడల్æస్కూల్, ఒకటి కస్తూర్బా పాఠశాల. మొత్తం 450 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ పాఠ్యాంశాల్లో సందేహాలను ఉపాధ్యాయులు నివృత్తి చేస్తున్నారు. గత సంవత్సరం వార్షిక ఫలితాల్లో 85 శాతం ఉత్తీర్ణత సాధించగా, మోడల్ స్కూల్ విద్యార్థిని జిల్లా టాపర్‌గా నిలిచింది.
ఉపాధ్యాయుల ప్రత్యేక శ్రద్ధ
విద్యార్థులు ‘పది’లో ఉత్తీర్ణత శాతం సాధించేందుకు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. చదువులో వెనుకబడినవారిపై శ్రద్ధ తీసుకుంటున్నారు. వీరికి సులభపద్ధతిలో బోధన చేస్తున్నారు. ఈ విద్యా సంవత్సరం పది పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా ఉపాధ్యాయ బృందం కృషిచేస్తోంది.
సులభ పద్ధతిలో బోధన
నేను పొన్నారం జెడ్పీ ఉన్నత పాఠశాల పదో తరగతి చదువుతున్నా. ఉపాధ్యాయులు పాఠ్యాంశాలను సులభపద్ధతిలో అర్ధమయ్యే విధంగా బోధిస్తున్నారు. చదువులో వెనుకబడినవారికి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు.
– నెండుగురి సాయినికిత్,పదోతరగతి పొన్నారం పాఠశాల
వంద శాతం ఉత్తీర్ణత సాధిస్తాం
మండలంలోని తొమ్మిది పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత శాతం సాధించే దిశగా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. త్రీఆర్స్ బోధన పద్ధతి ద్వారా విద్యార్థులకు అర్దమయ్యేలా పాఠాలు చెప్పించాం.
– జాడి పోచయ్య,ఎంఈవో, మందమర్రి
Comments
Please login to add a commentAdd a comment