సాక్షి, భూత్పూర్ (మహబూబ్‌నగర్): పిల్లలను పెంచడంలో తల్లిదండ్రులు తారతమ్య భేదాలు లేకుండా పెంచాలని, వారిలో నైపుణ్యం వెలికితీస్తే భవిష్యత్‌లో రాణిస్తారని ‘సాక్షి’ తెలంగాణ ఏజీఎం మల్లు శివకుమార్‌రెడ్డి అన్నారు. ఇటీవల ‘సాక్షి’ మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహించిన బాలఎడిటర్ పోటీల్లో విజేతలకు మహబూబ్‌నగర్ యూనిట్ కార్యాలయంలో సోమవారం బహుమతులు అందజేశారు. పాఠశాల స్థాయి విద్యార్థుల్లో నైపుణ్యం పెంచేందుకు, వినూత్న ఆలోచనలు కలిగే విధంగా పోటీలు నిర్వహించామని అన్నారు. రెండు కేటగిరీలుగా నిర్వహించగా, మంచి స్పందన వచ్చిందని తెలిపారు. మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాలో రాష్ట్ర, జిల్లాస్థాయి బహుమతులు గెలుపొందారని తెలిపారు. రాష్ట్రస్థాయిలో ఎ కేటగిరిలో ఒకరు, జిల్లా స్థాయి ఎ కేటగిరిలో ఐదుగురు విద్యార్థులు, బి కేటగిరిలో ఐదుగురు విద్యార్థులు ప్రతిభ కనబర్చారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహబూబ్‌నగర్ ‘సాక్షి’ యూనిట్ మేనేజర్ శ్యాంసుందర్‌రెడ్డి, సర్క్యులేషన్ మేనేజర్ లింగయ్య, స్టోర్స్ ఇన్‌చార్జ్ నరేష్, జూనియర్ ఆఫీసర్స్ నాగాంజనేయులు, సాయి, ఏసీఓ రమేష్ మరియు సర్క్యులేషన్ సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
గర్వంగా ఉంది
విద్యార్థుల్లో ప్రతిభను గుర్తించడానికి ‘సాక్షి’ పత్రిక చేపడుతున్న పోటీ పరీక్షలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ‘సాక్షి’ కార్యాలయంలో బహుమతి తీసుకోవడం సంతోషంగా ఉంది. బాల ఎడిటర్‌లో బహుమతి రావడం గర్వంగా ఉంది.
– సాధియా ఫాతిమా, గెలాక్సి హైస్కూల్, మహబూబ్‌నగర్
ఉపాధ్యాయుల ప్రోత్సాహం వల్లే..
ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో ఈ పోటీలో పాల్గొన్నాను. ఇలాంటి పోటీ పరీక్షల్లో పాల్గొంటే భయం పోయి, అవగాహన పెరుగుతుందని ఉపాధ్యాయులు మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. అందువల్లే బాలఎడిటర్ పోటీల్లో పాల్గొన్నాను. రాష్ట్ర, జిల్లాస్థాయిలో రెండు బహుమతులు గెలుపొందాను. చాలా సంతోషంగా ఉంది.
– కౌషిక్, గెలాక్సి, హైస్కూల్, మహబూబ్‌నగర్
చాలా ఆనందంగా ఉంది
బాలఎడిటర్ పోటీలో నాకు బహు మతి రావడంతో చాలా సంతోషంగా ఉంది. తల్లి దండ్రులు, ఉపాధ్యాయుల సమక్షంలో బహుమతి తీసుకోవడం గొప్పగా ఉంది.
– వినయ్ కుమార్, ప్రజ్ఞ ఉన్నత పాఠశాల, మహబూబ్‌నగర్
పోటీతత్వం పెరిగింది
బాల ఎడిటర్ కార్య క్రమంతో విద్యార్థుల్లో పోటీతత్వం పెరిగింది. మా పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థుల్లో ఒకరు రాష్ట్రస్థాయికి, మరొకరు జిల్లాస్థాయికి ఎంపిక కావడం ఆనందంగా ఉంది. ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేశారు. ‘సాక్షి’ యాజమాన్యానికి కృతజ్ఞతలు.
– భాను ప్రకాశ్, ప్రిన్సిపాల్, గెలాక్సీ హై స్కూల్, మహబూబ్‌నగర్
‘సాక్షి’కి అభినందనలు
పోటీ పరీక్షలు నిర్వహించిన ‘సాక్షి’ యాజమాన్యానికి అభినందనలు. పాఠశాల విద్యార్థులకు బయట పోటీ పరీక్షలు ఎలా ఉంటాయో తెలిసివచ్చింది. బాల ఎడిటర్ కాంపిటీషన్‌లో పాల్గొనడంతో విద్యార్థులు చాలా సంతోషంగా ఉన్నారు. విలువైన బహుమతులు ఇవ్వడం కూడా బావుంది.
– చల్మారెడ్డి, ప్రిన్సిపాల్, ప్రజ్ఞా హైస్కూల్,మహబూబ్‌నగర్
Comments
Please login to add a commentAdd a comment