రసవత్తరంగా ముగిసిన ఎడ్ల పోటీలు
-
సబ్ జూనియర్స్ విభాగంలో ప్రథమస్థానంలో కృష్ణా జిల్లా ఎడ్లు
-
సీనియర్స్ విభాగంలో సత్తాచాటిన ప్రకాశం జిల్లా గిత్తలు
ప్రత్తిపాడు(గుంటూరు) : నియెజకవర్గ కేంద్రంలో ఈనెల 5వ తేదీ నుంచి నిర్వహిస్తున్న నందమూరి తారక రామారావు మెమోరియల్ ఒంగోలు జాతి గిత్తల బండలాగుడు ప్రదర్శన పోటీలు శుక్రవారం రాత్రితో ముగిశాయి.
సబ్‌జూనియర్స్ విభాగంలో..
గురువారం జరిగిన సబ్‌జూనియర్స్ విభాగంలో గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాలకు చెందిన ఏడు ఎడ్ల జతలు పోటీల్లో పాల్గొన్నాయి. కష్ణా జిల్లా పెనమలూరు మండలం కానూరు గ్రామానికి చెందిన డీవీఆర్ మెమోరియల్ దేవభక్తు సుబ్బారావు జత 3,732.7 అడుగులు లాగా ప్రదమస్థానంలో, పెదకాకాని మండలం కొప్పురావూరు గ్రామానికి చెందిన టీఎస్‌ఆర్ ఇన్‌ఫ్రా డెవలపర్స్ సాయిశ్రీ కనస్ట్రక్షన్స్ తోట శ్రీనివాసరావు జత 3119.1 అడుగులు లాగి ద్వితీయ స్థానాన్ని, చేబ్రోలు మండలం నారాకోడూరు గ్రామానికి చెందిన వెలగా శ్రీనివాసరావు జత 3000 అడుగులు లాగి తతీయస్థానాన్ని, కృష్ణాజిల్లా మోపిదేవి మండలం బొబ్బర్లంక గ్రామానికి చెందిన కోనేరు నిరూప్‌బాబు జత 2954.2 అడుగులు లాగి నాల్గో స్థానాన్ని, వేమూరు మండలం కొచ్చెర్లపాడు గ్రామానికి చెందిన తాడికొండ సుధీర్‌బాబు జత 2869.2 అడుగులు లాగి ఐదో స్థానాన్ని కైవసం చేసుకున్నాయి.
సీనియర్స్ విభాగంలో..
శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు సీనియర్స్ విభాగంలో పోటీలు జత జతకూ తీవ్ర ఉత్కంఠభరితంగా సాగాయి. గుంటూరు, ప్రకాశం, కృష్ణా, నల్గొండ, ఖమ్మం జిల్లాల నుంచి పదకొండు జతలు పోటీల్లో పాల్గొన్నాయి. వాటిలో ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం మద్దిరాలముప్పాళ్ల గ్రామానికి చెందిన కల్యాణ్ ఆక్వాఫామ్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్ జత 25 నిమిషాలలో 2416.7 అడుగులు లాగి ప్రదమస్థానంలో నిలిచాయి. కష్ణాజిల్లా పెనమలూరు మండలం కానూరు గ్రామానికి చెందిన డీవీఆర్ మెమోరియల్ దేవభక్తుని సుబ్బారావు జత 2407.2 అడుగులు లాగి ద్వితీయ స్థానంను, ఖమ్మంజిల్లా కామేపల్లి మండలం పాతలింగాల గ్రామానికి చెందిన ఆర్‌ఎన్‌రెడ్డి నంది బ్రీడింగ్ బుల్స్‌కు చెందిన (ఒకగిత్త) పెదకాకాని మండలం కొప్పురావూరు గ్రామానికి చెందిన టీఎస్‌ఆర్ ఇన్ప్రా డెవలపర్స్ (ఒకగిత్త)ల జత, కష్ణా జిల్లా పెనమలూరు మండలం యనమదలకుదురు గ్రామానికి చెందిన అనంతనేని శ్రీకావ్య శ్రీమధుల జతలు 2400 అడుగులు సమానంగా లాగి తతీయ స్థానంలో నిలిచాయి. వీరిద్దరికీ మూడు నాలుగు బహుమతులను కలిపి చెరిసమానంగా అందించనున్నట్లు కమిటీ తెలిపింది. తెనాలిటౌన్‌కు చెందిన బట్టా నాగసాయినిఖిల్‌గౌతమ్‌లు 1876 అడుగులు లాగి ఐదో స్థానంను దక్కించుకున్నారు. ప్రకాశం జిల్లా దొనకొండ మండలం పొల్లేపల్లి గ్రామంకు చెందిన బెజవాడ డేవిడ్ జత 1800 అడుగులు లాగి ఆరో స్థానం, కష్ణాజిల్లా గన్నవరానికి చెందిన కాసనేని పావనచౌదరి 1633 అడుగులు లాగి ఏడవ స్థానంలో నిలిచారు. వీరికి జీడీసీసీబీ చైర్మన్ ముమ్మనేని వెంకటసుబ్బయ్య బహుమతులను అందజేశారు.