న్యూఢిల్లీ: ఢిల్లీ పరిపాలన సర్వీసులపై నియంత్రణ కోసం కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌ను ఆప్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఇది రాజ్యాంగ విరుద్ధమని, సుప్రీంకోర్టు ఉత్తర్వులను పక్కనబెట్టే ప్రయత్నమని ఆరోపించింది. ఆర్డినెన్స్‌ను కొట్టివేయడంతోపాటు అమ లుపై మధ్యంతర స్టే విధించాలని కోరుతూ శుక్రవారం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది.
పోలీసు, శాంతిభద్రతలు, భూమి మినహా మిగతా సరీ్వసులపై ఢిల్లీలో ఎన్నికైన ప్రభుత్వానికే పెత్తనం ఉండాలని, ఇందుకోసం ప్రత్యేక అథారిటీ ఏర్పాటు చేయాలంటూ మే 11న సుప్రీంకోర్టు ఆదేశాలిచి్చంది. అయితే, ఢిల్లీ ప్రభుత్వంలో పనిచేసే గ్రూప్–ఏ స్థాయి అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లపై పెత్తనం కొనసాగేలా ప్రత్యేక ఆర్డినెన్స్‌ను మే 19న కేంద్ర ప్రభుత్వం జారీ చేయడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment