insufficiency
-
భారతీయుల్లో సగంమంది అన్‌ఫిట్టే! 60 ఏళ్లు పైబడినవారు బెటర్!
మన దేశంలో దాదాపు సగంమంది ఫిజికల్‌గా ఫిట్‌గా లేరట. భారతీయుల్లో 50 శాతం మంది శారీర శ్రమ అన్న ఊసే ఎత్తడం లేదని తేలింది. గ్లోబల్ హెల్త్ జర్నల్ లాన్సెట్ నిర్వహించిన స్టడీలో ఈ షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి.ది లాన్సెట్ గ్లోబల్ హెల్త్ జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, 2022లో భారతదేశంలోని దాదాపు 50శాతం మంది తగినంత వ్యాయామం చేయడం లేదు. కనీసం వారానికి 150 నిమిషాల ఫిజికల్ యాక్టివిటీ కూడా చేయట్లేదని తేలింది.ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) సూచనల ప్రకారం, పద్దెనిమిదేళ్లు పైబడిన వారు(అడల్ట్స్) వారానికి 150 నిమిషాలు మోస్తరు ఫిజికల్ యాక్టివిటీ లేదంటే 75 నిమిషాలు తీవ్రమైన ఫిజికల్యాక్టివిటీ చేయాలి. దీన్ని ఆధారంగా చేసుకుని 2000-2022 మధ్యకాలంలో 197 దేశాల్లో లాన్సెట్ సర్వే చేసింది. దక్షిణాసియా ప్రాంతంలో మహిళల్లో తగినంత శారీరక శ్రమ లేకపోవడం పురుషుల కంటే సగటున 14శాతం ఎక్కువ. 42 శాతంగా పురుషులతో పోలిస్తే, తగిన శారీరక శ్రమ చేయని మహిళల సంఖ్య 57శాతంగా ఉంది.అంతేకాదు 2000 సంవత్సరంలో 22శాతం భారతీయులు శారీరంగా దృఢంగా ఉండగా, 2010 నాటికి ఇది 34 శాతానికి, 2022 నాటికి 50 శాతానికి పెరిగిందని తెలిపింది. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే 2030 నాటికి ఇది 60 శాతం దాటుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచవ్యాప్తంగా, 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న స్త్రీపురుషులిరువురిలోనూ శారీరక శ్రమ పెరగడం గమనార్హం.కాగా, ప్రపంచవ్యాప్తంగా 31.3 శాతం మంది పెద్దలు (18 ఏళ్లు పైబడిన వారు) ఫిజికల్లీ అన్ ఫిట్‌గా ఉన్నారని స్టడీలో తేలింది. ఈ విషయంలో ఫస్ట్ ప్లేస్‌లో ఆసియా పసిఫిక్ రీజియన్, రెండో స్థానంలో దక్షిణాసియా ఉందని లాన్సెట్ పరిశోధకులువెల్లడించారు. -
ఆపదలో కుయ్ కుయ్‌మంటూ వచ్చే వాహనాలేవి?
సాక్షి ,నాగిరెడ్డిపేట: ఆపత్కాలంలో కుయ్ కుయ్‌మంటూ వచ్చి ఆదుకోవాల్సిన అంబులెన్స్‌లు జిల్లాలో అంతంతమాత్రంగానే సేవలందిస్తున్నాయి. ప్రతి మండలానికి ఒక 108 అంబులెన్స్ అవసరం ఉండగా ప్రస్తుతం జిల్లాలోని చాలా మండలాల్లో అంబులెన్స్‌లే లేవు. జిల్లాలో 22 మండలాలుండగా 13 అంబులెన్స్‌లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అంబులెన్స్‌లు అందుబాటులో లేకపోవడంతో సకాలంలో ఆస్పత్రులకు చేర్చలేకపోతున్నారు. దీంతో విలువైన ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. పది మండలాల్లో ఇబ్బందులు.. జిల్లాలోని బాన్సువాడలో రెండు, కామారెడ్డి, మాచారెడ్డి, భిక్కనూర్, సదాశివనగర్, గాంధారి, లింగంపేట, ఎల్లారెడ్డి, పిట్లం, బిచ్కుంద, జుక్కల్, బీర్కూర్ మండలాల్లో ఒక్కొక్కటి చొప్పున 108 అంబులెన్స్‌లు అందుబాటులో ఉన్నాయి. నాగిరెడ్డిపేట, నిజాంసాగర్, దోమకొండ, రామారెడ్డి, రాజంపేట, నస్రుల్లాబాద్, పెద్దకొడప్గల్, మద్నూర్, తాడ్వాయి, బీబీపేట మండలాల్లో 108 అంబులెన్స్‌లు లేవు. ఆయా మండలాల్లో ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగితే, అత్యవసరంగా ఎవరినైనా ఆస్పత్రికి తరలించాల్సి వస్తే పక్క మండలాల్లోని అంబులెన్స్‌లను ఆశ్రయించాల్సి వస్తోంది. పొరుగు మండలంనుంచి అంబులెన్స్ వచ్చేంత వరకు బాధితులు నరక యాతన అనుభవించాల్సిందే.. అంతేకాకుండా ఆ సమయంలో పక్క మండలం అంబులెన్స్ వేరే ఇతర రోగులను తరలించే పనిలో ఉంటే ఇక్కడున్న వారి పరిస్థితి మరీ దారుణం. దీంతో అంబులెన్స్‌లు లేనిప్రాంతాల్లో ప్రమాదాలు జరిగినప్పుడు క్షతగాత్రులను దాదాపు ప్రైవేట్ వాహనాల్లోనే ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ఆటోలు, కార్లలో తరలించే సమయంలో క్షతగాత్రులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. నరకయాతన అనుభవిస్తున్నారు. కోవిడ్ బాధితుల వ్యథలు.. ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజూ వందలాది మంది వైరస్ బారిన పడుతున్నారు. ఇందులో కొందరి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారుతోంది. అయితే వారిని ఆస్పత్రులను తరలించడానికి అంబులెన్స్‌లు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కోవిడ్ సోకినవారిని ఆస్పత్రులకు తరలించడానికి ప్రైవేట్ వాహనదారులెవరూ ముందుకు రావడంలేదు. అంబులెన్స్‌లు అందుబాటులోలేక, ప్రైవేట్ వాహనదారులు ముందుకురాకపోవడం వల్ల బాధితుల కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ప్రైవేట్ వాహనాల యజమానులు ముందుకు రాకపోవడం వల్ల వారిని కుటుంబ సభ్యులే తీసుకెళ్లాల్సి వస్తోంది. నాగిరెడ్డిపేట మండలంలో 108 అంబులెన్స్ లేదు. శనివారం ఓ కోవిడ్ పేషెంట్‌కు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురవడంతో ఎల్లారెడ్డి అంబులెన్స్‌కు సమాచారం అందించారు. కానీ బిజీగా ఉండడంతో రాలేమని సమాధానం వచ్చింది. దీంతో తప్పనిసరి పరిస్థితిలో కుటుంబ సభ్యులు బైక్‌పై ఆస్పత్రికి తీసుకువెళ్లాల్సి వచ్చింది. ప్రభుత్వం స్పందించి ప్రతి మండలానికి ఒక అంబులెన్స్‌ను అందుబాటులో ఉంచాలని ప్రజలు కోరుతున్నారు. ( చదవండి: తల్లి మృతదేహాన్ని స్మశానంలోనే వదిలేసిన కొడుకు ) -
గట్టెక్కేదెలా!
చింతలపూడి/జంగారెడ్డిగూడెం : జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో పేరుకుపోయిన ఇంటిపన్ను బకాయిలు కార్యదర్శులకు గుదిబండగా మారాయి. మార్చి 15వ తేదీలోగా నూరు శాతం పన్నులు వసూలు చేయాలని జిల్లా అధికారులు హుకుం జారీ చేయడంతో కార్యదర్శులు తలలు పట్టుకుంటున్నారు. సిబ్బంది కొరత వేధిస్తుండటంతో లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలో తెలియక కార్యదర్శులు, సర్పంచ్‌లు సతమతమవుతున్నారు. తలకు మించిన పనులతో ఇబ్బంది పడుతున్న కార్యదర్శులకు పన్నుల వసూలు సాధ్యం కావడం లేదు. పంచాయతీల్లో రోజువారీ కార్యకలాపాలతో పాటు ఇతర పనులు కూడా చేయడం వల్ల పన్నుల వసూళ్లపై దృష్టి పెట్టలేక పోతున్నారు. మరోవైపు ఒక్కొక్క కార్యదర్శికి రెండు, మూడు పంచాయతీల ఇన్చార్జి బాధ్యతలు అప్పగించడంతో ఏ పనీ ముందుకు సాగడం లేదు. పన్నులను తక్షణమే వసూలు చేయాలంటూ జిల్లా ఉన్నతాధికారులు తాఖీదులు ఇవ్వడంతో ఈఓపీఆర్డీలు, డివిజన్ స్థాయి పంచాయతీ అధికారుల దీనిపైనే కార్యదర్శులను ఒత్తిడి చేస్తున్నారు. మేజర్ పంచాయతీల్లో బిల్లు కలెక్టర్‌తోపాటు కార్యాలయ సిబ్బందిని సైతం పన్నుల వసూలు కోసం కేటాయించారు. అయినా ఆశించినమేర వసూలు కావడం లేదని తెలుస్తోంది. పంచాయతీల్లో పోస్టులు ఖాళీ జిల్లాలో పంచాయతీ కార్యదర్శులతో పాటు బిల్లు కలెక్టర్, సీనియర్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అనేకం ఖాళీగా ఉన్నాయి. సిబ్బంది కొరతతో పంచాయతీల్లో అభివృద్ధి పనులపై సర్పంచ్‌లు, కార్యదర్శుళు దృష్టి సారించలేకపోతున్నారు. ముఖ్యంగా పాలన కష్టంగా మారింది. ప్రతినెలా పింఛన్ల పంపిణీ, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు, ఉపాధి హామీ పనుల పర్యవేక్షణ, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం తదితర పనులన్నీ కార్యదర్శులే చూడాలి. దీంతో వారు పన్నుల వసూలుపై దృష్టి పెట్టలేకపోతున్నారు. ప్రభుత్వం ఖాళీగా ఉన్న కార్యదర్శి, బిల్లు కలెక్టర్ పోస్టులను భర్తీ చేస్తే పంచాయతీల్లో పాలన గాడిన పడుతుంది. 40 శాతం మించని వసూళ్లు జిల్లాలో 48 మండలాల్లోని నాలుగు డివిజన్ల పరిధిలో 908 పంచాయతీలు ఉన్నాయి. వీటిలో నోటిఫైడ్ పంచాయతీలు 204, నా¯ŒS నోటిఫైడ్ పంచాయతీలు 704. డివిజన్ వారీగా చూస్తే ఒక్కొక్క డివిజన్లో ఇప్పటివరకు 40 శాతం పన్నులు మాత్రమే వసూలయ్యాయి. జంగారెడ్డిగూడెం డివిజన్లో 177 పంచాయతీలు ఉండగా, రూ.10.50 కోట్లు పన్నులు వసూలు కావాల్సి ఉంది. ఇందులో 34 శాతం మాత్రమే వసూలయ్యాయి. ఏలూరు డివిజన్ పరిధిలో 272 పంచాయతీలు ఉండగా, రూ. 19.72 కోట్లకు గాను, 41శాతం మాత్రమే వసూలయ్యాయి. కొవ్వూరు డివిజన్ పరిధిలో 209 పంచాయతీలు ఉండగా, రూ.20.75 కోట్లకు గాను 41శాతం పన్నులు వసూలయ్యాయి. నరసాపురం డివిజన్ పరిధిలో 250 పంచాయతీలు ఉండగా, రూ.12.90 కోట్లకు గాను 45శాతం పన్నులు వసూలయ్యాయి. 34 శాతం మాత్రమే వసూలు చేసి జంగారెడ్డిగూడెం డివిజన్ చివరి స్థానంలో ఉంది. మార్చి 31 నాటికి పన్నులు వసూలు చేయాలంటే.. 44 రోజులు మాత్రమే గడువు ఉంది. ఇటీవల జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ అధికారులతో సమావేశమై పన్ను వసూళ్లలో నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వేగవంతం చేశాం జిల్లాలోని అన్ని పంచాయతీల్లో పన్నుల వసూళ్లను వేగవంతం చేశాం. గత ఏడాది 97శాతం వసూలు చేశాం. ఈ ఏడాది కూడా లక్ష్యాన్ని సాధించేందుకు కృషిచేస్తున్నాం. ఇందుకోసం అధికారులు , సిబ్బందిని అప్రమత్తం చేశాం. – కె.సుధాకర్, జిల్లా పంచాయతీ అధికారి, ఏలూరు