
లక్నో: కరోనా వైరస్ వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచాన్ని వణికిస్తుండగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాత్రం అది కేవలం సాధారణ వైరల్ జ్వరం లాంటిదేనంటూ కొట్టిపారేశారు. ‘ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తున్న విషయం వాస్తవమే. రెండోవేవ్‌తో పోలిస్తే ఒమిక్రాన్ వేరియంట్ కాస్త బలహీనమైందనే విషయం కూడా నిజమే. ఇది సాధారణ వైరల్ జ్వరం. ఇతర వ్యాధులకు మాదిరిగా దీనికి ముందు జాగ్రత్తలు, అప్రమత్తత అవసరం’ అని చెప్పారు.