ఫ్రాన్స్: ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ, యూరప్ దేశాల్లో రోజురోజుకు పరిస్థితి చేజారేలా కనిపిస్తోందని డబ్యూహెచ్‌ఓ ఆందోళన వ్యక్తం చేసింది. నవంబర్ 24 న ఒమిక్రాన్ దక్షిణాఫ్రికాలో వెలుగుచూసినప్పటినుంచి, ఇప్పటి వరకు 108 దేశాల్లో పంజా విసిరింది. ముఖ్యంగా ఐరోపాలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఫ్రాన్స్ దేశంలో ఒక్కరోజులోనే తొలిసారిగా లక్ష కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహమ్మారి వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి ఆ దేశంలో అధిక సంఖ్యలో ఒక్కసారిగా కేసులు పెరిగాయి. ఆసుపత్రుల్లో చేరికలు కూడా రెట్టింపయ్యాయి.
గడచిన వారంలో ప్రతి వంద మందిలో ఒకరికి కోవిడ్ పాజిటివ్ బయటపడుతోంది. అంతేకాకుండా కొత్తగా నమోదవుతున్న కేసుల్లో అధిక ఇన్ఫెక్షలు ఒమిక్రాన్‌తో సంబంధం కలిగి ఉంటున్నాయి. రానున్న రోజుల్లో ఒమిక్రాన్ మరింత డామినెట్ చేసే అవకాశం ఉన్నట్లు ఫ్రాన్స్ ప్రభుత్వ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ కోవిడ్ 19 ఉధృతిపై సోమవారం అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు.
చదవండి: వ్యాక్సిన్ వేయించుకున్నప్పటికీ ఒమిక్రాన్ కాటుకు బలి! మొదటిసారిగా..
Comments
Please login to add a commentAdd a comment