మహమ్మారి సృష్టించిన కల్లోలం నుంచి పూర్తిగా బయటపడ్డాం అని అనుకుంటున్న సమయంలో మరో వేరియంటే చాపకింద నీరులా వచ్చేస్తుంది. ఇంకా నేను ఉన్నానంటూ..మరో కొత్త వేరియంట్ రూపంలో భయబ్రాంతులకు గురిచేస్తుంది. ఆ మహమ్మారి మొదలైన సమయంలో ఎదుర్కొన్న కష్టాలు అంత ఈజీగా మర్చిపోలేం. అందర్నీ ఇంట్లో బందీలుగా చేసింది. ఇప్పుడూ మళ్లీ మరో రూపంలో ఆ మహమ్మారి విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌ఓ సైతం అన్ని దేశాలు అప్రమత్తంగా ఉండాల్సిందేనని గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ఏంటీ కొత్త వేరియంటే..ఎక్కడ వ్యాపించింది?
ఇంతవరకు కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ గురించి, దాని తాలుకా కేసులు చూశాం. ఇప్పుడు అది ఒమిక్రాన్ నుంచి మరో కొత్త వేరియంట్ 'ఈజీ.5.1'గా రూపాంతరం చెంది యూకేలో వేగంగా విజృంభిచడం ప్రారంభించింది. యూకేలో కరోనా కొత్త వేరియంట్ 'ఎరిస్' అనే పేరుతో రూపాంతరం చెంది వేగంగా వ్యాపిస్తోందని ఇంగ్లాండ్‌లోని హెల్త్ అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి దేశంలో దాదాపు 14.6% కేసులు ఉన్నాయని వెల్లడించింది. ఈ మహమ్మారికి సంబంధించి..ఇప్పటి వరకు గుర్తించిన ఏడు కొత్త వేరియంట్‌లలో ఇది ఒకటని యూకే ఆరోగ్య అధికారులు పేర్కొన్నారు. ఈ వారంలో ఆ కొత్త వేరియంట్‌కి సంబంధించి..సుమారు నాలుగువేల కేసు వచ్చాయిని చెప్పారు.
ఈ కేసులు పెరుగుతున్న నేపథ్యంలోనే ఈ కొత్త వేరియంట్‌కి జులై 31న "ఎరిస్" అనే పేరుతో వేరియంట్‌గా వర్గీకరించారు. తొలిసారిగా జూలై 3, 2023న దీని తాలుకా కేసులను గుర్తించారు. అది కాస్త నెమ్మదిగగా పెరగడంతో ఆరోగ్య అధికారులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేశారు. ముఖ్యంగా వృద్ధులు ఆస్పత్రిలో చేరే రేటు పెరగుతున్నట్లు తెలిపారు. మొత్తంగా చూస్తే ఆస్పత్రిలో చేరే పరిస్థితులు తక్కువుగానే ఉన్నాయని, అలాగే ఐసీయూలో అడ్మిట్ అవుతున్న కేసులు పెద్దగా పెరగలేదని యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ(యూకేహెచ్‌ఎస్‌ఏ) పేర్కొంది.
ఏది ఏమైనా ఈ మహామ్మారీ కేసులు పెరగక ముందే జాగ్రత్తలు తీసుకోవడం మంచిదన్నారు ఇయూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ హెడ్ డాక్టర్ మేరి రామ్‌సే. ప్రజలంతా ఈ వైరస్‌ల బారిన పడకుండా ఉండేందుకు క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవాలని, అలానే శ్వాసకోస సంబంధ సమస్యలు ఉన్నవారికి దూరంగా ఉండాలని సూచించారు. ఇదిలా ఉండగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సైతం ఈ కొత్త వేరింట్ కేసులను ట్రాక్ చేయడం ప్రారంభించింది.
ఈ మేరకు డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ మాట్లాడుతూ..ప్రజలంతా ముందస్తు జాగ్రత్తగా వ్యాక్సిన్‌లు, సంరక్షణ పద్దతులను అవలంబించాలని సూచించారు. అలాగే అన్ని దేశాలు అప్రమత్తంగా ఉండటమేగాక తమ రక్షణను వదులుకోవద్దని చెప్పారు. కాగా యూకేలో నెమ్మదిగా పెరుగుతున్న ఈ కొత్త వేరియంట్ కేసులపై నిపుణలు, అధికారలు పరిశోధనలు చేయడం ప్రారంభించారు. అదే సమయంలో ప్రజలు ఈ మహమ్మారి వ్యాప్తి చెందకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని గట్టిగా హెచ్చరించారు అధికారులు.
(చదవండి: అప్పుడే జుట్టు తెల్లబడుతుందా? ఐతే ఇలా చేసి చూడండి!)
Comments
Please login to add a commentAdd a comment