న్యూఢిల్లీ: కరోనాతో గత రెండేళ్లుగా ప్రపంచ దేశాలన్నీ ఎంతలా అతలాకుతలమయ్యాయో మనకు తెలిసిందే. ఇప్పుడిప్పుడే ప్రపంచ దేశాలు ఆ కరోనామహమ్మారి నుంచి బయటపడి ఊపిరి పీల్చుకుంటున్నాయి. అయితే కరోనా నుంచి బయటపడి బతికి ఉన్నవారు ఇంకా ఆ వ్యాధికి సంబంధించిన లక్షణాలను ఎదుర్కొంటునే ఉన్నారని లాన్సెట్ మెడికల్ జర్నల్ తన అధ్యయనం తెలిపింది. మరి కొంతమంది కోవిడ్ నుంచి కోలుకుని వ్యాధి తీవ్రతతో సంబంధం లేకుండానే శారీరికంగా, మానసికంగానూ ఆరోగ్యంలో మంచి మెరుగుదల కనిపించిందని వెల్లడించింది.
రెండేళ్ల తదనంతరం కొంతమంది మునుపటివలే తమ పనులను చేసుకోగలగడమే కాకుండా తమ రోజువారి పనిలో యథావిధిగా నిమగ్నమవుతున్నారు కూడా. కానీ ఇంకా కొంత మంది ఆ వ్యాధికి సంబంధించిన దుష్ఫలితాలను ఎదుర్కొంటునే ఉన్నారు. భవిష్యత్తులో కోవిడ్‌కి సంబంధించి పొంచి ఉన్న దీర్ఘకాలిక వ్యాధి లక్షణాల ప్రమాదంపై మరిన్ని పరిశోధనలు చేయడమే కాకుండా మరింత మెరుగైన వైద్యం అందించే దిశగా కృషి చేయాలని తెలిపింది. అంతేగాదు గత రెండేళ్లలో కరోనా నుంచి బయటపడిన వారందరూ సాధారణ జనాభా కంటే చాల తక్కువ ఆరోగ్య స్థితిని కలిగి ఉన్నారని అధ్యయనం వెల్లడించింది.
మరోవైపు యూకే అధ్యయనం ప్రకారం ఆస్పత్రిలో చేరిన నలుగురిలో ఒకరు మాత్రమే కోవిడ్ బారిన పడి ఒక ఏడాది తర్వాత పూర్తిగా కోలుకున్నారని చెప్పారు. కండరాల నొప్పి, శారీరకంగా మందగించడం, నిద్రలేమి, శ్వాస ఆడకపోవడం, అవయవాల పటుత్వం లేకపోవడం, జీవన నాణ్యతలో మార్పులు తదితరాలు సాధారణ దీర్ఘకాలిక కోవిడ్ లక్షణాలు. ఏదీఏమైన కరోనాతో ఆసుపత్రిలో చేరిన చాలామంది రోగులు సుమారు ఐదు నెలల నుంచి ఒక ఏడాదిలోపు పరిమిత సంఖ్యలో పూర్తిగా కోలుకోవడం మాత్రం అద్భుతమైనది అని లీసెస్టర్ విశ్వవిద్యాలయానికి చెందిన రాచెల్ ఎవాన్స్ చెప్పారు.
(చదవండి: Covid 19: ఉత్తర కొరియాలో మొదటి కరోనా కేసు.. కిమ్ కీలక నిర్ణయం)
Comments
Please login to add a commentAdd a comment