సాధారణంగా గుండెపోటు వస్తేనే మనుషులు గిలగిల లాడిపోతారు. అలాంటిది ఒకేరోజు ఆరుసార్లు గుండె ఆగిపోతే ఆ మనిషి ఉంటాడా? అని డౌటు వస్తుంది కదా!. ఒకవేళ బతికినా పూర్తిస్థాయిలో కోలుకుంటాడా అన్నది అనుమానమే. అచ్చం అలానే భారత సంతతి విద్యార్థి కార్డియాక్ అరెస్ట్‌కి గురయ్యాడు. అయితే అతను ఏమయ్యాడు? బతికాడా? అనే కదా!. నిజానికి ఇలా ఆరుసార్లు గుండె ఆగిపోవడం జరుగుతుందా? ఎందుకిలా? తదితరాల గురించే ఈ కథనం.
యూకేలోని 21 ఏళ్ల భారత సంతతి అమెరికన్ విద్యార్థి అతుల్ రావు ఒకే రోజు ఆరుసార్లు గుండె ఆకస్మాత్తుగా ఆగిపోయింది. దీంతో అతను ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అతడి స్నేహితులు సమీపంలోని ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు అంబులెన్స్‌ని పిలిపించారు. ఇంతలో సెక్యూరిటీ గార్డు అతని ఛాతీకి కంప్రెషన్ ఇచ్చేలా సీపీఆర్ చేశాడు. ప్రయోజనం లేకపోయింది. ఆస్పత్రిలో చేరేటప్పటికీ తీవ్ర అస్వస్థతతో ఉన్నాడు.
ఎక్స్‌ట్రాకార్పోరియల్ మెమ్బ్రేన్ ఆక్సిజనేషన్(ఈసీఎంవో)కి యాక్సిస్ చేశారు. గుండె, ఊపిరితిత్తుల పనిని పూర్తిగా భర్తీ చేసేలా లైఫ్ సపోర్ట్ సిస్టమ్‌ని అమర్చారు వైద్యులు. ఇంతలో క్లాట్ బస్టింగ్ డ్రగ్స్ పనిచేయం ప్రారంభించాయి. దీంతో అతను లైఫ్ సపోర్ట్ మెషీన్లు, ఈసీఎంఓ తదితరాలు లేకుండానే పూర్తి స్థాయిలో కోలుకున్నాడు. అతుల్ ఇప్పుడు యూఎస్‌కి తిరిగి వెళ్లాడు. పూర్తిగా కోలుకున్నాడు కూడా. స్టూడెంట్ అతుల్ రావు ఎదుర్కొన్న ఈ పరిస్థితిని వైద్యపరిభాషలో పల్మనరీ ఎంబోలిజం అంటారు
పల్మనరీ ఎంబోలిజం అంటే..
నిపుణుల అభిప్రాయం ప్రకారం..పల్మోనరీ ఎంబోలిజం చాలా సందర్భాల్లో కాలులోని లోతైన సిరల్లో రక్తం గడ్డకట్టడం మొదలై ఊపిరితిత్తులకు వెళ్తుంది. అరుదుగా శరీరంలోని వేరే ఏదైనా భాగంలోని సిరల్లో రక్తం గడ్డకట్టడం జరుగుతుంది. ఫలితంగా ఊపిరితిత్తులకు రక్తప్రవాహాన్ని పరిమితం చేసి, ఆక్సిజన్ స్థాయిలను తగ్గిస్తుంది. ఫలితంగా పల్మనరీ ధమనుల్లో రక్తపోటు పెరిగిపోతుంది. దీన్నే పల్మనరీ ఎంబోలిజం అంటారు. ఈ పల్మోనరీ ఎంబోలిజంలో గుండె లేదా ఊపిరితిత్తులకి రక్తప్రవాహం ఆగిపోయి పనితీరుకి ఆటకం ఏర్పడుతుంది. ఫలితంగా గుండె లేదా ఊపిరితిత్తులు ఆకస్మికంగా వైఫల్యం చెంది మరణానికి దారితీస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత సాధారణంగా ఉన్న గుండె, రక్తనాళాల వ్యాధులకు సంబంధించిన వాటిల్లో ఇదొకటి.
లక్షణాలు
- శ్వాస ఆడకపోవడం మరియు ఛాతీ నొప్పులు కాలక్రమేణా పెరుగుతాయని నిపుణులు అంటున్నారు.
- అలాగే, చాలా మంది రోగులు శ్లేష్మంతో దగ్గినా.
- విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు కూడా శ్వాస ఆడకపోవడం
- ఛాతీ, చేయి, భుజం, మెడ లేదా దవడలో పదునైన నొప్పి
- దగ్గు
- పాలిపోయిన చర్మం
- వేగవంతమైన హృదయ స్పందన
- విపరీతమైన చెమట
- ఆత్రుత
- మూర్ఛపోవడం లేదా స్ప్రుహతప్పిపోవడం
- గురక
ఎవరికి ప్రమాదం అంటే..
- కాలులో రక్తం గడ్డకట్టిన వారు
- కూర్చొని పనిచేసేవారు
- సిరకు గాయం లేదా గాయం కలిగిన వారు
- చాలా కాలం పాటు గర్భనిరోధక మాత్రలు తీసుకోవడం లేదా హార్మోన్ పునఃస్థాపన చికిత్స చేయించుకోవడం
- పొగ
- స్ట్రోక్ వంటి గుండె జబ్బుల చరిత్రను కలిగి ఉండటం
- అధిక బరువు లేదా ఊబకాయంతో ఉన్నారు
Comments
Please login to add a commentAdd a comment