తండ్రి జే పటేల్, కొడుకు బలరాంతో కలిసి ఉన్న ఫైల్ ఫోటో
ఒక్కో ఘటన లేదా పరిస్థితులు మనిషిని తనకే తెలియని తనలోని ఓ కొత్త కోణాన్ని పరిచయం చేస్తుంది. అవి కొందర్నీ మహనీయుడిని చేస్తే మరికొంర్ని వక్రమార్గంలో పయనించేలా చేస్తాయి. ఇక్కడొక తండ్రి కొడుకుని కోల్పోడమే జీర్ణించుకోలేని సతతమవుతున్న స్థితిలో తన కొడుకులా మరెవరూ అలా చనిపోకూడదనే గొప్ప ఆలోచనకు తెరతీసింది. ఇంకొన్నాళ్లు ఉండాల్సిన కొడుకు ఎలా అకాల మరణం చెందాడన్న ఆ సందేహమే అతడిని ఓ సరికొత్త చైతన్యం వైపుకి తీసుకెళ్లింది.
అసలేం జరిగిందంటే..బ్రిటన్‌లోని భారత సంతతి చెందిన జే పటేల్‌కి 30 ఏళ్ల బలరామ్ అనే కొడుకు ఉన్నాడు. అతను లండన్‌లో చికిత్స పొందుతూ ఆస్పత్రిలో అనూహ్యంగా మరణించాడు. దీంతో జీర్జించుకోలేని బలరామ్ తండ్రి తన కొడుకు ఎలా చనిపోయాడన్న సందేహంతో విచారించడం ప్రారంభించాడు. తన కొడుకు సరైన చికిత్స సకాలంలో అందలేదని, సరైన సంరక్షణ లేకపోవడం తదితర కారణాల వల్లే చనిపోయినట్లు వెల్లడైంది. దీంతో అతను ఆస్పత్రిలోని పేషెంట్స్ సమస్యల పూర్వాపరాలు, జీవన వ్యవధిని నమోదు చేయడం ప్రారంభించాడు. అంతేగాదు చికిత్సలో తలెత్తుతున్న వైద్యుల తప్పుల తడకల గురించి కొత్త ఛారిటీ ఫౌండేషన్‌ని కూడా ప్రారంభించి రోగుల హక్కుల కోసం ప్రచారం చేస్తున్నాడు.
తాను ఏర్పాటు చేసిన ఫౌండేషన్‌లో తన కొడుకు ఆస్పత్రి కన్సల్టెంట్, మిగతా సిబ్బంది చికిత్స సంరక్షణ వైఫల్యం కారణంగానే తీవ్ర నొప్పి, అసౌకర్యంతో ముందుగానే చనిపోయినట్లు అందరికీ తెలియజేశాడు. తాను చేసే ఈ కార్యక్రమాల ద్వారా అయిన తన కొడుకు బలరాం ట్రీట్‌మెంట్‌లో ఎలాంటి తప్పులు జరిగాయి అనే దానిపై ప్రభుత్వం స్పందించి..సత్వరమే దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటుందని నమ్ముతున్నాని అన్నారు. ఆస్పత్రుల్లో పేషెంట్ బంధువు, స్నేహితుడు, మరెవరైనా.. వారి ఆత్రతను ఆవేదనను ఆస్పత్రి యాజమాన్యం అస్సలు పట్టించుకోదని, అక్కడ తతెత్తుతున్న లోపాలను సరిదిద్దే యత్నం కూడా చేయదని ఆవేదనగా చెబున్నారు పటేల్.
బ్రిటన్ పార్లమెంటు ఈ విషయంపై మార్పు తీసుకురావాలని ఆశిస్తున్నట్లు తెలిపాడు. చివరి నిమిషంలో తన కొడుకు ఆరు ప్రాణాపాయ సంకట పరిస్థితులతో పోరాడడని చెప్పారు. తన కొడుకు చిన్నతనంలో కూడా ఎనిమిది నుంచి 10 ఏళ్ల వరకు మానసికి వయసు సంబంధించిన పెరుగదల సమస్యతో ఇబ్బంది పడ్డాడని కన్నీటి పర్యంతమయ్యారు. అలా.. అలా నెమ్మదిగా మానసిక వికాసం కలుగుతుందనేలోపు ఇలాంటి ఘోరంగా జరిగిందని అన్నారు. అతను అందర్నీ ఆప్యాయంగా పలకరించేవాడు, ప్రేమగా ఉండేవాడంటూ కొడుకుని గుర్తుచేసుకున్నారు. ఇది పీడకలలా తనను వెంటాడుతూనే ఉంటుందని కన్నీళ్లు పెట్టుకున్నారు పటేల్.
తన కొడుకు ఇంకొన్నాళ్లు జీవించాల్సిన వాడని, తగిన చికిత్స అందించడంలో జాప్యం, మంచి వైద్యం లేకపోవడం తదితర కారణాల వల్లే మరణించాడన్నారు. అందుకే తాను ఈ ఛారిటీ ద్వారా రోగులకు చికిత్సకు సంబంధించిన వివరాలు సేకరించి అకాల మరణాలను నివారించేలా చేయడమే గాక వారికి మంచి వైద్యం అందేలా ప్రత్యామ్నాయం మార్గాన్ని(వైద్యానికి సంబంధించిన సెకండ్ ఓపినియన్) ఎలా ఎంచుకువాలో అనే దానిపై అవగాహన కల్పిస్తున్నాడు. దీనికి యూకే ప్రభుత్వం, యూకే ఆరోగ్య కార్యదర్శి స్టీవ్ బార్క్లే మద్దతు ఇవ్వడంతోనే ఈ ప్రచారానికి పిలుపు ఇచ్చినట్లు పటేల్ తెలిపారు. ఇక 2021లో సెప్సితో మరణించి 13 ఏళ్ల మార్తా తల్లి కూడా ఇలానే "మార్తాస్ రూల్" అనే పేరుతో వైద్య చికిత్సకు సంబంధించిన సెకండ్ ఓపెనియన్ కోసం విస్తృతంగా ప్రచారం చేసింది.
(చదవండి: భారత సంతతి చిన్నారికి అత్యంత అరుదైన కిడ్నీ మార్పిడి..! బ్రిటన్‌లోనే తొలిసారిగా..)
Comments
Please login to add a commentAdd a comment