సెంచరీ వయసులో సైడైవింగ్ చేసి చరిత్ర సృష్టించింది. అది కూడా ఓ స్వచ్ఛంద సంస్థ కోనం నిధులు సమకూర్చేందుకు చేయడం విశేషం. ఆ బామ్మ ఎవరంటే..?
సఫోల్క్‌కు చెందిన మానెట్ బైల్లీ అనే బామ్మ 102 ఏళ్ల వయసులో ఈ సాహసం చేసి ఆశ్చర్యచకితులను చేసింది. ఆమె ఉమెన్స్ రాయల్ నావెల్ సర్వీస్‌కు మాజీ సభ్యురాలు. తన పుట్టిన రోజును స్వచ్ఛంద సంస్థకు నిధుల సేకరించే పనితో సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నారు. బైల్లీ ఒక ఛారిటీ ఈవెంట్‌లో భాగంగా యూకే పారాచూటింగ్ సర్వీసెస్ లిమిటెడ్‌తో కలిసి ఈ సాహసం చేసింది. ఆమె బెన్‌హాల్ విలేజ్ హాల్, మోటార్ న్యూరాన్ డిసీజ్ అసోసియేషన్, ఈస్ట్ ఆంగ్లియన్ ఎయిర్ అంబులెన్స్ అనే మూడు ఛారిటీ సంస్థల కోసం ఈ నిధులను సేకరిస్తోంది. ఇప్పటి వరకు దగ్గర దగ్గర రూ. 11 లక్షలు సేకరించింది.
అయితే రూ. 33 లక్షల వరకు నిధులు సేకరించాలనేది ఆ బామ్మ లక్ష్యం. ఈ బామ్మ ఈస్ట్ ఆంగ్లియాలోని బెక్లెస్ ఎయిర్‌ఫీల్డ్ నుంచి ఏకంగా ఏడు వేల అడుగుల ఎత్తు నుంచి స్కైడైవింగ్ చేసింది. ఈ మేరకు స్థానికి మీడియాతో మాట్లాడుతూ.."నాకు చేసేటప్పుడూ కొంచెం భయంగా అనిపించింది. గట్టిగా కళ్లు మూసుకున్నానని ఒపుకోవాల్సిందే. ఆ తర్వత ధైర్యంగానే ఉన్నట్లు తెలిపింది. అంతేగాదు తన ఆరోగ్యకరమైన వృధాప్యం గురించి కూడా మాట్లాడారు. ఎనిమిది లేదా తొమ్మిది పదుల వయసులో దేన్ని వదులుకోకూడదు.
ఈ వయసులో కూడా తాను ఫిట్‌గా ఉండటం అనేది అదృష్టం అనే చెప్పాలి. తన వయసులోనే ఉన్న ఇతర వ్యక్తులు ఆర్థరైటిస్‌తో వికలాంగులుగా మారారు. అయితే తాను అలా ఉండేందుకు ఇష్టపడనని అంటోంది." ఈ బామ్మ. కాగా, ఆమె ఇలాంటి సాహసాలు చేయడం మొదటిసారి కాదు. తన వందో పుట్టిన రోజు సందర్భంగా కూడా ఇలాంటి సాహస కృత్యమే చేసింది. సిల్వర్‌స్టోన్ చుట్టూ 130 మీటర్ పర్ అవర్ వేగంతో ఫెరారీ కారుని నడిపి మరో రికార్డుని నెలకొల్పింది. తన స్నేహితుడి తండ్రి 85 ఏళ్ల వయసులో ఇలాంటి సాహసకృత్యాలు చేయడం చూసి స్ఫూర్తి పొందానని అన్నారు.
బామ్మ బైల్లీ ధైర్యం, సమాజం కోసం నిస్వార్థంగా చేస్తున్న కృషి బ్రిటన్ రాజ కుంటుంబాన్ని ఆకర్షించింది. అంతేగాదు ప్రిన్స్ విలియం ఆ వయసులో ఆ బామ్మ చలాకీగా చేస్తున్న సాహసాలను మెచ్చుకున్నారు. వందవ పుట్టిన రోజునే ఫెరారీ రేసింగ్‌తో చరిత్ర సృష్టించిన మీరు ఈ స్కైడైవింగ్‌ని అవలీలగా చేయగలరు. ఆశ్చర్యపోనవసరం లేదు అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
ఆ బామ్మ ఆరోగ్య రహస్యం..
ఎప్పుడూస్నేహితులు, ప్రజల మధ్య ఉంటుంది. బిజీగా ఉంటుంది. ప్రతిదానిపై ఆసక్తిని కలిగి ఉంటుంది. తన చుట్టూ ఉన్నవారి పట్ల దయతో ప్రేమగా మెలుగుతుందట. అవే ఆమె దీర్ఘాయువుకి కారణం అని ఆనందంగా చెబుతోంది బైల్లీ.
The incredible Manette Baillie skydiving this morning at Beccles airfield for her 102nd birthday sponsored by Goldster!! #manettebaillie #102yearoldskydiver pic.twitter.com/q1FOZtqzyU
— Goldster (@GoldsterClub) August 25, 2024
(చదవండి: టెర్మినల్ కేన్సర్ ఇంత ప్రమాదకరమా..? పాపం ఓ మహిళ..!)
Comments
Please login to add a commentAdd a comment