బరువు తగ్గడం అనేది శారీరక శ్రమకు మించిన కష్టమైన ప్రక్రియ. డైట్‌ని, జీవనశైలిని మార్చకుంటేనే ఇదంతా సాధ్యం. చెప్పాలంటే బరువు తగ్గాలనే గట్టి సంకల్పం ఉంటేనే తగ్గగలం. అలానే భారతసంతతి వ్యక్తి ఏకంగా 45 కిలోలు బరువు తగ్గి చూపించాడు. అందుకోసం ఆయన కొన్ని పత్యేకమైన ఆహారపు అలవాట్లను అనుసరించినట్లు తెలిపాడు. అతనెవరు? ఎలా ఇన్ని కిలోలు మేర బరువు తగ్గగలిగాడు సవివరంగా చూద్దామా..!
భారత సంతతికి చెందిన బిహేవియరల్ సైన్స్ సోల్యూషన్స్ కంపెనీ ఫైనల్ మైల్ కన్సల్టింగ్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో రామ్ ప్రసాద్ ఏకంగా 45 కిలోలు బరువు తగ్గారు. ఆయన తన వెయిట్ లాస్ జర్నింగ్ గురించి సోషల్ మీడియా వేదికగా నెటిజనల్‌తో షేర్ చేసుకున్నారు. తాను స్థిరమైన అలవాట్లతో బరువు తగ్గగలిగానని అన్నారు. ముందుగా వెయిట్ లాస్ జర్నీలో తలెత్తే సందేహాలను, అనుమానాలను పక్కకు పెట్టేయాలి. "ఎక్స్‌ప్లోర్ వర్సెస్ ఎక్స్‌ప్లోయిట్," "ట్రెయిట్స్ వర్సెస్ స్టేట్," "హాబిట్ లాడరింగ్ వర్సెస్ మోటివేషన్," "డిఫెరింగ్ రివార్డ్స్ వర్సెస్ విల్‌పవర్." వంటి పాయింట్లపై దృష్టిపెట్టండి.
అంటే.. ఇక్కడ మీకు ఎలాంటి జీవనశైలి ఎంచుకుంటే బెటర్ అనేది సోధించాలి. ఒక్కోసారి ఆ డైట్‌ని స్కిప్ చేయాలనిపించినప్పుడూ ఎలా ఆ ఫీలింగ్‌ని వాయిదా వేయాలి. అలాగే ఉన్న ప్రస్తుత పరిస్థితి, మీ శరీర తత్వానికి అనుగణంగా తీసకోవాల్సిన జాగ్రత్తలు, దీంతోపాటు అలవాట్లను స్కిప్ చేయకుండా ఉండేలా ప్రేరణనిచ్చే వాటిని ఎంచుకోవడం. వాయిదా పద్దతికి స్వస్తి పలికి విల్‌పవర్ చేయడం వంటివి అనుసరించాలని అంటున్నారు రాం ప్రసాద్. అలాగే బరువు తగ్గడంలో తనకు ఉపకరించిన వాటి గురించి కూడా చెప్పారు. డైట్‌లో రెండు నెలలు పాటు షుగర్ తీసుకోకుండా ఉండటం.
ఏడాదిపాటు వాకింగ్ చేయడం. నాలుగైదు నెలలు పాటు శుభ్రంగా తినడం వంటివి చేసినట్లు సీఈవో రాం ప్రసాద్ చెప్పారు. అలాగే మూడేళ్లు ఒక పూటే భోజనం, వర్కౌట్లపై దృష్టిసారించడం వంటివి చేసినట్లు తెలిపారు. చివరిగా బరువు తగ్గాలనుకున్నప్పుడూ అందుకు సంబంధించి ఏర్పరుచుకున్న మన లక్ష్యాలపై ఫోకస్ ఉండాలని అన్నారు. అప్పుడే సులభంగా బరువు తగ్గగలమని చెప్పారు. అయితే నెటిజన్లు సీఈవో రాం ప్రసాద్ వెయిట్‌లాస్ జర్నీ చాలా స్ఫూర్తిని కలిగించిందంటూ ఆయన్ని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు.
(చదవండి: ఖర్జూరం తింటే మలబద్దకం వస్తుందా..? నిపుణులు ఏమంటున్నారంటే..)
Comments
Please login to add a commentAdd a comment